
రూ. 114కే మ్యాచ్‌ను చూసే ఛాన్స్
మైనర్లకు మైదానంలో ఉచిత ప్రవేశం
దుబాయ్: యూఏఈలో త్వరలోనే జరగబోయే మహిళల టి20 ప్రపంచకప్ టికెట్ల విక్రయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రారంభించింది. కేవలం 5 యూఏఈ దిర్హామ్ (రూ. 114)లకే ఈ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు 18 ఏళ్లలోపు వయసున్న బాలబాలికలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘అందరు వెచి్చంచగలిగే స్థితిలో టికెట్లను అందుబాటు ధరలో ఉంచాం.
ప్రారంభ టికెట్ ఐదు దిర్హామ్‌లకే కొనుగోలు చేయొచ్చు. అత్యధికంగా ప్రీమియం సీట్ల ధర 40 దిర్హామ్ (రూ. 910)లుగా ఉంది. ఒక వేదికపై ఒకే రోజు రెండు మ్యాచ్‌లుంటే ఒక టికెట్‌తోనే ఆ రెండు మ్యాచ్‌ల్ని వీక్షించవచ్చు’ అని ఐసీసీ తెలిపింది. ఐసీసీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఆఫ్‌లైన్‌లోనూ టికెట్లను విక్రయించేందుకు దుబాయ్, షార్జా క్రికెట్ స్టేడియాల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. భారత్ సహా 10 దేశాల జట్లు పోటీపడే ఈ మెగా ఈవెంట్ వచ్చే నెల 3 నుంచి యూఏఈలోని రెండు వేదిక (దుబాయ్, షార్జా)ల్లో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment