106 రోజుల్లో నిర్మాణం... మరికొన్ని రోజుల్లో నేలమట్టం! | New York Stadium will be demolished from today | Sakshi
Sakshi News home page

106 రోజుల్లో నిర్మాణం... మరికొన్ని రోజుల్లో నేలమట్టం!

Published Fri, Jun 14 2024 3:23 AM | Last Updated on Fri, Jun 14 2024 3:23 AM

New York Stadium will be demolished from today

న్యూయార్క్‌ స్టేడియం నేటి నుంచి కూల్చివేత 

న్యూయార్క్‌: ప్రస్తుత టి20 ప్రపంచకప్‌ కోసం న్యూయార్క్‌లో కేవలం 106 రోజుల్లో శరవేగంగా నిర్మించిన నాసా కౌంటీ క్రికెట్‌ స్టేడియాన్ని కూల్చివేయనున్నారు. ఆ్రస్టేలియా (అడిలైడ్‌)లో తయారు చేసిన ‘డ్రాప్‌ ఇన్‌’ పిచ్‌లతో న్యూయార్క్‌లో నాసా స్టేడియాన్ని 34 వేల సీట్ల సామర్థ్యంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాత్కాలికంగా నిర్మించింది. వెస్టిండీస్‌తో కలిసి మెగా ఈవెంట్‌కు అమెరికాలోని న్యూయార్క్, ఫ్లోరిడా, డాలస్‌ వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి. 

కేవలం ఇక్కడ లీగ్‌ దశనే జరుగుతుంది. న్యూయార్క్‌లోని నాసా స్టేడియం 8 మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. ఇండో–అమెరికన్లు అధిక సంఖ్యలో ఉండటంతో ఇక్కడ భారత్‌... బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్‌ సహా నాలుగు మ్యాచ్‌ల్ని ఆడింది. 9న భారత్, పాక్‌ సమరం ఇక్కడే జరిగింది. ఐసీసీ ఊహించినట్లుగానే భారత అభిమానుల కోలాహలంతో స్టేడియం నిండిపోయింది. ఇక్కడ మ్యాచ్‌ల నిర్వహణ పూర్తి కావడంతో నేటి నుంచి కూల్చివేత పనులు ప్రారంభించి ఆరు వారాల్లో గతంలో ఎలా ఉందో అలాంటి యథాతథస్థితికి తీసుకొస్తారు. 

ఇక వేదిక విషయానికొస్తే ఆగమేఘాల మీద నిర్మించిన ఈ స్టేడియం పిచ్‌ అత్యంత పేలవం. టి20లకు ఏమాత్రం కుదరని పిచ్‌లపై బ్యాట్‌ డీలా పడటంతో మెరుపులు, ధనాధన్‌ లేక టి20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లే చిన్నబోయేలా చేసింది. క్రికెటర్లు, మాజీలే కాదు... విశ్లేషకులు, వ్యాఖ్యాతలు అంతా ఈ పిచ్‌పై దుమ్మెత్తి పోశారు. కొసమెరుపు ఏమిటంతే ఈ నెల 1న బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌తో ప్రారంభోత్సవం జరిగిన ఈ స్టేడియానికి 14 (నేటి)తో కాలం చెల్లబోతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement