దాదాపు నెల రోజుల పాటు క్రికెట్ అభిమానులను ఉరుత్రూలూగించిన టీ20 వరల్డ్‌కప్-2024 ఘనంగా ముగిసింది. జూన్ 29న బార్బోడస్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి ఎండ్ కార్డ్ పడింది.
తుది పోరులో విజయం సాధించిన భారత్.. ఈ ఏడాది పొట్టి వరల్డ్‌కప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈ వరల్డ్‌కప్ విజయంతో 13 ఏళ్ల భారత అభిమానుల నిరీక్షణకు తెరపడింది.
ఇక వరల్డ్‌కప్ ముగిసి వారం రోజుల తిరగకుముందే టీ20 వరల్డ్‌కప్-2026కు సంబంధించిన వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. టీ20 వరల్డ్‌కప్-2026 భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్నట్లు ఐసీసీ తెలిపింది. 2024 తరహాలోనే 2026లో వరల్డ్ కప్‌లోలోనూ 20 జట్లతో టోర్నీ జరుగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది.
ఇక వచ్చే పొట్టి వరల్డ్‌కప్‌కు 12 జట్లు నేరుగా అర్హత సాధించనున్నాయి. ఆతిథ్య జట్ల హోదాలో భారత్, శ్రీలంక, రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాలు నేరుగా టోర్నీలో అడుగుపెట్టనున్నాయి. సూపర్-8కు అర్హత సాధించిన అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, వెస్టిండీస్, అమెరికా వచ్చే ప్రపంచ కప్‌నకు క్వాలిఫై అయ్యాయి.
అదే విధంగా ఈ ఏడాది జూన్ 30 నాటికి ఐసీసీ టీ20 ర్యాంక్స్ ఆధారంగా మరో మూడుజట్లు ఈ మెగా టోర్నీకి అర్హత సాధిస్తాయి. అంటే న్యూజిలాండ్ (6వ ర్యాంకు), పాకిస్తాన్ (7వ ర్యాంకు), ఐర్లాండ్ (11వ ర్యాంక్) వచ్చే టీ20 ప్రపంచకప్‌లో ఆడనున్నాయి. మిగితా 8 జట్లు క్వాలిఫియర్స్ ఆడి అర్హత సాధించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment