Andrew Symonds Sudden Demise ICC Tweet 2003 World Cup 143 Not Out Video - Sakshi
Sakshi News home page

Andrew Symonds-ICC: సైమండ్స్‌కు ఐసీసీ నివాళి.. పాకిస్తాన్‌పై 143 నాటౌట్‌ వీడియో ట్వీట్‌

Published Sun, May 15 2022 9:33 AM | Last Updated on Sun, May 15 2022 11:06 AM

Andrew Symonds Sudden Demise ICC Tweet 2003 World Cup 143 Not Out Video - Sakshi

ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌ (46) హఠాన్మరణం యావత్‌ క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. శనివారం రాత్రి ఆస్ట్రేలియాలోని టౌన్స్‌విల్లే సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే ఆసీస్‌ దిగ్గజ స్పిన్నర్‌ షేర్‌వార్న్‌ ఆకస్మిక మృతి ఘటనను మరువకముందే సైమండ్స్‌ మరణవార్త కలచివేస్తోంది. క్రీడా ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా తమ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చుతున్నారు. ఈక్రమంలోనే సైమోకు నివాళి అర్పించిన ఐసీసీ 2003 ప్రపంచకప్‌లో ఆయన విధ్వంసక బ్యాటింగ్‌ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది.
చదవండి👉🏾 ఆండ్రూ సైమండ్స్‌ మృతి.. దిగ్గజ క్రికెటర్ల సంతాపం

బౌండరీల వరద!
2003 దక్షిణాఫ్రికా వన్డే వరల్డ్‌కప్‌ను పాంటింగ్‌ సారథ్యంలో ఆస్ట్రేలియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు జరిగిన లీగ్‌ మ్యాచుల్లో జట్టు విజయంలో సైమండ్స్‌ కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్‌తో జరిగిన తమ తొలిమ్యాచ్‌లోనే పాంటింగ్‌ సేన 82 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. 2 సిక్సర్లు, 18 ఫోర్లతో వీరవిహారం చేసిన ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సైమండ్స్‌ 125 బంతుల్లో 143 (నాటౌట్‌) పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ ఛేదనలో ఎంతమాత్రం సఫలీకృతం కాలేదు. 44.3 ఓవర్లకే పాక్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు.
చదవండి👉🏻 IPL 2022: సన్‌రైజర్స్‌ ఢమాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement