దుబాయ్: ఐసీసీ అండర్ - 19 ప్రపంచ కప్లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారమిక్కడ భారత్కు, ఇంగ్లండ్కు మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓటిమి పాలైంది. దీంతో అండర్ -19 ప్రపంచ కప్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ ఇండియా నిష్ర్కమించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 222 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 49.1 ఓవర్లలో ఐదు బంతులు మిగులుండగానే 3 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఇంగ్లండ్ ఆటగాడు డక్కెట్ట్ 61 పరుగులు చేయగా, క్లార్క్42 పరుగులు చేశాడు. మిగతా ఇంగ్లండ్ ఆటగాళ్లు టట్టర్సాల్ల్ (23), పించ్(10), భర్నార్డ్ (24), రోడ్స్ (10) పరుగులు చేశారు. జోన్స్ (28), సేయర్ (10)లు నాటౌట్గా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లు ఫిషర్ 3 వికెట్లు తీసుకోగా, విన్స్టేడ్,సేయర్, హిగ్గిన్స్, తలో వికెట్ తీసుకున్నారు.
అంతకముందు బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టులో హుడా (68), జోల్ (48), కులదీప్ యాదవ్ (16), బెయిన్స్ (3) పరుగులు చేయగా, ఖాన్ (52), మిల్లంద్ (7)లు నాటౌట్గా నిలిచారు. భారత్ బౌలర్లు కులదీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకోగా, మెనూ కుమార్, హుడా, గనీ, మిల్లంద్లు తలో వికెట్ తీసుకున్నారు.
అండర్ - 19: డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా ఔట్
Published Sat, Feb 22 2014 7:17 PM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM
Advertisement
Advertisement