క్రైస్ట్‌చర్చ్: రాహుల్ ద్రవిడ్ శిక్షణలో యువ టీమిండియా అద్భుతాలు చేస్తోంది. వరుస విజయాలు సాధిస్తూ అప్రతిహతంగా దూసుకుపోతోంది. అండర్–19 వన్డే ప్రపంచకప్‌లో భారీ విజయాలు నమోదు చేయడం యువ భారత్ సత్తాకు సిసలైన నిదర్శనంగా నిలిచింది. కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో రాటుదేలిన యువ క్రికెటర్లు అన్ని విభాగాల్లో రాణిస్తూ ప్రతిష్టాత్మక టోర్నిలో దేశానికి తిరుగులేని విజయాలు అందించారు. సెమీస్‌లో పాకిస్తాన్‌ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లారు. తుది సమరంలోనూ జోరు కొనసాగించి విజేతగా నిలవాలని యువ భారత్ ఉవ్విళ్లూరుతోంది.
అండర్–19 తాజా ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన యంగ్ ఇండియా అన్నింటిలోనూ భారీ విజయాలు సాధించింది. వందకు పైగా పరుగుల తేడాతో మూడు, 10 వికెట్ల తేడాతో రెండుసార్లు విజయదుందుభి మోగించింది.
యువ భారత్ గెలిచిందిలా...
- ఆస్ట్రేలియాతో ఆడిన తొలి మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో గెలుపు
- పపువా న్యూ గునియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో 10 వికెట్లతో విజయకేతనం
- మూడో వన్డేలో జింబాబ్వేపై 10 వికెట్లతో విజయం
- క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై 131 పరుగుల తేడాతో విక్టరీ
- సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై 203 పరుగుల తేడాతో విజయదుందుభి
Comments
Please login to add a commentAdd a comment