Young India
-
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో జీహెచ్ఐఏఎల్ ఒప్పందం
తెలంగాణ యువతకు ఏవియేషన్ స్కిల్ డెవలప్మెంట్ను పెంచేందుకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం వివిధ విమానయాన శిక్షణా కార్యక్రమాలతో పాటు.. సర్టిఫికేషన్లను అందిస్తుంది. ఇది శ్రామిక నైపుణ్యాలను బలోపేతం చేయడానికి.. విమానయాన రంగంలో పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించినట్లు జీహెచ్ ఐఎఎల్ వెల్లడించిందిఈ సందర్భంగా జిహెచ్ ఐఎఎల్ సిఇఒ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ.. "విమానయాన పరిశ్రమకు నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం చాలా ఉంది. ఈ భాగస్వామ్యం ద్వారా యువత ఉద్యోగావకాశాలు పొందుతారు. విమానయాన రంగానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఈ కార్యక్రమం నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తుందని, రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలకు దారితీసే ప్రతిభా అంతరాలను పరిష్కరిస్తుందన్నారు. ప్రొఫెషనల్ క్యూరేటెడ్ కోర్సుల ద్వారా విమానయాన రంగంలో ఉన్నత శ్రేణి నైపుణ్యాలను అందించేందుకు జీఎంఆర్, వైఐఎస్యూల సంయుక్త కృషి రాష్ట్ర విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.అకడమిక్ క్రెడిట్లతో కూడిన సాంకేతిక నైపుణ్యాలు విద్యార్థులకు నిలువు మార్గాలు కల్పించడంతో పాటు అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలో తక్షణ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ వైస్ ఛాన్సలర్ విఎల్ విఎస్ ఎస్ సుబ్బారావు అన్నారు. ఈ భాగస్వామ్యం రాష్ట్రం.. దేశం కోసం విమానయాన పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి పనిచేయడానికి జిహెచ్‌ఐఎఎల్ యొక్క నిబద్ధతకు నిదర్శనం. -
అదిగో యువభారత్
‘దేనికీ వెరువని ధైర్యసాహసాలు, ముక్కుసూటితనంతో దూసుకుపోయే యువతే ఈ దేశ భవిష్యత్ నిర్మాతలు!’ – స్వామి వివేకానంద యూఎన్ఎఫ్పీఏ.. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2023 నివేదిక ప్రకారం (ఆ నివేదిక విడుదలయిన నాటికి) మన దేశ జనాభా.. 142.86 కోట్లు. 142.57 కోట్ల జనాభాతో ఉన్న చైనాను దాటేసి.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా పాపులేషన్ లిస్ట్‌లో ముందున్నాం. ప్రపంచమంతటా 15 ఏళ్ల నుంచి 64 ఏళ్లలోపు జనాభా 65 శాతం ఉంటే.. అది ఒక్క మన దగ్గరే 68 శాతం ఉంది. ఈ జనాభాను ప్రపంచం.. వర్కింగ్ పాపులేషన్ అంటోంది. అంటే శక్తియుక్తులున్న మానవ వనరుల సమూహం.. మనకు అనుకూలమైన అంశం. ప్రపంచంలోకెల్లా అధిక జనాభా గల దేశంగానే కాదు.. అత్యధిక యువత ఉన్న దేశంగానూ ప్రథమ స్థానంలో ఉన్నాం. అంటే స్వామి వివేకానంద కోరుకున్న లక్షణాలతో ఉన్న యువతరం అన్నమాట. అడ్డూ అదుపూ లేని జనాభాతో వనరులను హరిస్తూ.. పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బ తీస్తుందని అభివృద్ధి చెందిన దేశాలు ఆగ్రహపడినా.. వెంటనే అసూయపడేలా చేస్తోంది ఈ యువతే. ప్రపంచానికి అతి పెద్ద మార్కెట్‌గానే కాదు.. ప్రపంచ ఉత్పాదక రంగానికి అవసరమైన అద్భుత మానవ వనరులకూ మన నేలను కేంద్రంగా మలుస్తోంది. ఈ మనుషుల ఎడారిలో కనిపిస్తున్న ఆ ఒయాసిస్సే ఈ దేశం శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశాన్నీ కల్పిస్తోంది. జపాన్‌తోపాటు అభివృద్ధి చెందిన చాలా దేశాలు జనాభా.. అందులో యువత తక్కువగా ఉండడంతో తీవ్రమైన వర్క్‌ఫోర్స్‌ని ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య ఆయా దేశాల ఉత్పాదక రంగం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దాంతో ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడుతోంది. ఆ క్రమంలోనే 68 శాతం వర్కింగ్ పాపులేషన్‌తో మనం చాలా రిచ్‌గా ఉన్నాం.. అనే భావనలోనే కాదు.. ఆ దిశగా కృషిచేస్తే ప్రాక్టికల్‌గానూ ధనికదేశంగా మారగలం. ప్రపంచ మార్కెట్‌ని శాసించగలం. ఈ విషయంలో చైనానూ అధిగమించగలం. సవాళ్లు దేశ ఆర్థికాభివృద్ధికి యువతను ప్రధానవనరుగా మలచుకోవడం అత్యంత అవసరం. కానీ కార్యాచరణలో అదంత ఈజీ కాదు. ఆ లక్ష్యం చేరుకోవడానికి మౌలిక సదుపాయాలు, నిర్మాణాత్మకమైన ప్రణాళికలూ లేవు. ఏ జనాభాలోంచి వర్కింగ్ పాపులేషన్‌ను చూసి మురిసిపోతున్నామో.. ఆ వర్కింగ్ పాపులేషన్లోనే ఏ ఉపాధిమార్గంలేని వాళ్ల శాతం ఎక్కువగా ఉంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) లెక్కల ప్రకారం.. 2022 నాటికి మన దగ్గరున్న నిరుద్యోగిత 23.22 శాతం. 2018లో ఇది 4.9 శాతమే. ఈ పెరుగుదలకు కరోనా పరిస్థితులూ ఒక కారణం. పాండమిక్‌లో కోటీ తొంభైలక్షల యువత ఉద్యోగాలను కోల్పోయిందని కొన్ని సర్వేల సారాంశం. పని ఉన్నవారు కూడా చదువుకు సరిపడా కొలువులు దొరకక దొరికిన కొలువుల్లో తక్కువ వేతనాలతో సర్దుకోవాల్సిన పరిస్థితి. ది సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎమ్ఐఈ) అనే ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వే (2022) ప్రకారం ..ఈ నిరుద్యోగ పర్వంలో హరియాణ 37. 4 శాతం, రాజస్థాన్ 28.5 శాతం, ఢిల్లీ 20.8 శాతం పెరుగుదలతో మొదటి మూడు స్థానాల్లో తలవంచుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇది ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతం, తెలంగాణలో 4.1 శాతం పెరిగింది. ఉపాధి కల్పన లేమి.. పట్టణాలు, నగరాల్లో కన్నా గ్రామాల్లోనే ఎక్కువగా ఉంది. నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణాల్లో మళ్లీ అధిక జనాభాదే మొదటి స్థానం. మిగతా కారణాల్లో.. అక్షరాస్యత.. ఉపాధి కల్పనల మధ్య అసమాన నిష్పత్తి, వ్యవసాయాధారిత పరిశ్రమలు తగినంతగా లేకపోవడం.. వ్యవసాయం నుంచి వలసలు (ఈ రెండిటినీ పరిగణించాలి), కుటీర, చిన్నతరహా పరిశ్రమలు దెబ్బతినడం, ఉమ్మడి కుటుంబాలు ఉన్న చోట్ల.. ఆ కుటుంబంలో ఒకరే వారసత్వ వ్యాపారాన్ని నిర్వహిస్తూండడం.. మిగిలిన వాళ్లకు పనిలేకపోవడం, కుటుంబ బాంధవ్యాలకు లోబడి కార్మికులు, శ్రామికులు స్వస్థలం వదిలి వెళ్లలేకపోవడం వంటివాటితోపాటు మార్కెట్ డిమాండ్‌కి అనుగుణమైన నైపుణ్య శిక్షణ లేకపోవడమూ కనిపిస్తున్నాయి. నైన్ టు ఫైవ్ దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరచడంలో యువత ప్రధాన వనరుగా ఉపయోగపడకపోవడానికి ఆ తరం ఎదుర్కొంటున్న రెండు ముఖ్యమైన అడ్డంకులను చూపిస్తున్నారు నిపుణులు. మొదటిది.. కార్పొరేట్ ప్రపంచంలో అడుగుపెట్టేందుకు కావల్సిన సాఫ్ట్ స్కిల్స్ వారిలో లేకపోవడం. రెండవది.. సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి కావల్సిన మెళవకువలూ కరువవడం. ఆశ్చర్యం ఏంటంటే ఈ రెండూ ఉన్న యువతకూ తగినంత ప్రోత్సాహం లేదు. ముఖ్యంగా కుటుంబపరమైన మద్దతు లభించడం లేదు. సొంతంగా వ్యాపారం చేద్దామనే యువత ఆశయం, ఉత్సాహం మీద సొంత కుటుంబాలే నీళ్లు చల్లుతున్నాయి.. కెరీర్‌తో తమ పిల్లలు ఎలాంటి ఆటలు ఆడకుండా నెలనెలా వేతనంతో భద్రమైన జీవితాన్ని గడపాలనే కోరికతో! ప్రయోగాలకు పోయి పిల్లలు నష్టాలను తెస్తే నెత్తికెత్తుకునే ఆర్థిక సామర్థ్యం.. వాళ్లకు అండగా నిలబడే నైతిక స్థయిర్యం లేకపోవడమే ఆ వెనుకడుగుకు కారణం కావచ్చు. అందుకే పిల్లల ఉత్సాహం కన్నా భరోసానిచ్చే ఆర్థిక భవిష్యత్ పట్లే పెద్దలు మొగ్గు చూపుతున్నారు. నెలవారీ జీతపు ఉద్యోగాల దిశగానే వారిని ప్రోత్సహిస్తున్నారు. అయితే నైన్ టు ఫైవ్ జాబులే సర్వస్వం కాదనే సత్యాన్ని గ్రహించాలి. అలాగని ఇలా వ్యాపారం పెట్టగానే అలా కోట్లలో లాభాలు వచ్చిపడతాయి.. అవి తిరిగి పెట్టుబడులుగా మారి.. ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అనే నమ్మకాన్ని ఎవరూ ఇవ్వలేరు. కానీ ప్రయత్నం జరగాలి. ఈ రోజు యువత ఆ ధైర్యం చేయలేకపోతే రేపటి యువతకు ఎక్కడి నుంచి ప్రేరణ అందుతుంది? నేడు విజయపథంలో ఉన్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటియం, ఓలా వగైరా సంస్థలు నిన్న ధైర్యం చేసి వ్యాపారంలోకి అడుగుపెట్టినవే. ఒడిదుడుకులు తెలిసి.. తట్టుకునే మెకానిజమూ అర్థమై నేడు మార్కెట్లో తమ సేవలకు డిమాండ్ కల్పించుకుంటున్నవే! అందుకే దిగితేకానీ లోతు అంతుబట్టదు. ఐడియాలను కార్యాచరణలో పెడితే కానీ సక్సెస్ చేతికి చిక్కదు. గ్లోబలైజేషన్ తర్వాత రోజ్‌గార్ బజార్ రూపురేఖలు మారిపోయాయి. సర్కారు కొలువుల పరిధి తగ్గుతూ వస్తోందా.. ప్రైవేట్ జాబ్స్ విస్తృతమవుతున్నాయా అనేది తెలియదు కానీ పెను మార్పయితే స్పష్టమయింది. తదనుగుణంగానే యువత అడుగులూ అనివార్యం అయ్యాయి. కంప్యూటరీకరణ నేపథ్యంలో ఉద్యోగాల కోసం సాంకేతిక పరిజ్ఞానం ఎలా తప్పనిసరి అయిందో ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార దక్షత కూడా అంతే తప్పనిసరి అవుతోంది. మారిన ప్రపంచ పరిణామాల నేపథ్యంలో అందరూ నైన్ టు ఫైవ్ ఉద్యోగాల కోసమే దరఖాస్తు చేసుకుంటే వాటిని సృష్టించే సంస్థలు ఉండొద్దూ? ఆ సంస్థలను నడిపే వ్యాపారవేత్తలు.. పారిశ్రామిక గణం రావద్దూ? ఆ చొరవ తీసుకోవడానికి.. చూపడానికి కావల్సిన శక్తియుక్తులున్న యువత మన దగ్గరే ఉంది. వారికి కావల్సింది ప్రభుత్వం నుంచి కాస్త ఆర్థిక ఆలంబన.. కుటుంబం నుంచి కాసింత నమ్మకం! ఆ రెండూ ఇస్తే ఐడియాలతో స్టార్టప్‌లను పండిస్తూ వాప్యార దక్షతను పెంపొందించుకుంటుంది. బడా పారిశామికవేత్తల పెట్టుబడులను రాబట్టుకుంటుంది. వేలసంఖ్యలో కొత్త కొలువులను సృష్టిస్తుంది. ఆశాకిరణాలు.. నికరంగా వేతనాలు అందే ఉద్యోగాలే చేయాలనే తల్లిదండ్రుల ఒత్తిడినీ, పెట్టుబడుల కొరతనూ లెక్కచేయక ముందడుగు వేస్తున్న యువతా ఉన్నారు. కాబట్టే మన దగ్గర స్టార్టప్ కల్చర్ దినదిన ప్రవర్థమానమవుతోంది. ఎంతోమంది యంగ్ అంట్రప్రెన్యూర్స్ని సృష్టిస్తోంది. ఇందుకు ఓయో రూమ్స్ సీఈఓ రితేశ్ అగర్వాల్ చక్కటి ఉదాహరణ. 2013లో.. అంటే తన పందొమ్మిదో ఏట .. ‘ఓయో రూమ్స్’ ప్రారంభించాడు. సరసమైన ధరలో.. సౌకర్యవంతమైన ఒక బసను వెదకడంలో విఫలమైన ఫ్రస్ట్రేషన్‌తో అతను ఈ కంపెనీని స్థాపించాడు. ఈ రోజు ప్రపంచంలోకెల్లా యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ బిలియనీర్‌గా పేరుపొందాడు. ఫోర్బ్స్ – 30 అండర్ 30 లిస్ట్ ఫర్ ఆసియాలోనూ స్థానం సంపాదించుకున్నాడు. ఈ వరుసలోనే లాజిస్టిక్ స్టార్టప్ ‘పోర్టర్’ ఫౌండర్ ప్రణవ్ గోయెల్నీ చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్టార్టప్ 500 సభ్యుల టీమ్‌గా..సిఖోయా కాపిటల్, టైగర్ గ్లోబల్ వంటి ఇన్వెస్టర్స్‌తో వంద మిలియన్ డాలర్ల ఫండింగ్‌తో విరాజిల్లుతోంది. లెన్స్‌కార్ట్ గురించి తెలుసు కదా! దాని ఫౌండర్ పియూష్ భన్సాల్ కూడా యంగ్‌చాప్.. 2010లో ఆ పోర్టల్‌ను స్థాపించినప్పుడు! ఫోర్బ్స్ – 30 అండర్ 30లో ఉన్నాడు. అందరూ అబ్బాయిలేనా.. మరి అమ్మాయిలూ? అనే క్వశ్చన్ మార్క్ ఇమోజీని డిలీట్ చేయండి. అంట్రప్రెన్యూర్స్‌గా అమ్మాయిల సంఖ్యా తక్కువేం లేదు మన దగ్గర. దేశంలోని 58 శాతం మహిళా అంట్రప్రెన్యూర్స్ .. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసులోనే ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రారంభించారు. వీళ్లంతా తమ తాతల, తండ్రుల వ్యాపారాన్ని నడుపుతున్నవారు కాదు. ఇండిపెండెంట్ అంట్రప్రెన్యూర్స్. వాళ్లలో ‘మెన్స్ట్రుపీడియా’ ఫౌండర్ అదితి గుప్తా.. మోస్ట్ సక్సెస్ఫుల్ అంట్రప్రెన్యూర్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీలక్ష్మి సురేశ్.. దేశంలోకెల్లా అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా అంట్రప్రెన్యూర్. 2020లో తన ఇరవయ్యొకటో ఏటకల్లా.. ప్రపంచంలోనే యంగెస్ట్ వెబ్ డిజైనర్ కమ్ సీఈఓగా పేరు పొందింది. తన ఎనిమిదవ ఏటనే కోళికోడ్‌లోని తన స్కూల్‌కి వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసింది. శ్రీలక్ష్మి ‘ఎస్ఈఓ’ అనే వెబ్ డిజైన్ కంపెనీని ప్రారంభించేనాటికి ఆమెకు పదేళ్లు. ఒక్క తన స్కూల్‌కే కాదు దేశంలోని ఇతరత్రా వాటికోసం ఆమె ఓ వంద వెబ్‌సైట్స్‌ని డెవలప్ చేసింది. వీళ్లంతా దేశంలో స్టార్టప్ కల్చర్ వృద్ధికి ఆశాకిరణాలు! మేధో వలస.. దేశానికి యువత.. బలంగా మారకుండా అడ్డంపడుతున్న మరో సవాలు మేధో వలస. తమ ప్రతిభాపాటవాలకు సరైన గుర్తింపు, జీతభత్యాలు, వాళ్లు కోరుకున్న జీవన ప్రమాణాలు లేక ఎంతోమంది యువతీయువకులు విదేశాల బాట పడుతున్నారు. పైగా మన దగ్గర ఉద్యోగాలకు పోటీ ఎక్కువ. ఈ వలస తాత్కాలిక పరిణామంలాగే కనిపిస్తుంది కానీ మన ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాల నష్టాన్ని చేకూరుస్తోంది. ఈ మేధో వలసల్లో ముఖ్యంగా ఐఐటీయన్లే ఉంటున్నారు. మన ఐఐటీల్లో శిక్షణ పొందిన విద్యార్థులను అత్యుత్తమ మానవ వనరులుగా గుర్తిస్తున్నాయి ప్రపంచ దేశాలు. అందుకే ఐఐటీ పట్టభద్రుల పట్ల విదేశీ సంస్థలకు విపరీతమైన క్రేజ్! దాంతో వీళ్లకు ఊహించని రీతిలో వేతనాలిస్తూ తమ సంస్థల్లో ప్లేస్‌మెంట్స్‌ని కల్పిస్తున్నాయి. వాళ్లు ఎంచుకున్న రంగంలో నిష్ణాతులవడానికి విదేశాల్లో ఉన్నత విద్యను అందించడానికీ పోటీ పడుతున్నాయి. అందుకే బ్రెయిన్ డ్రెయిన్‌కి బ్రేక్ పడడం లేదు. ఈ వలసలన్నీ ప్రధానంగా అమెరికాకే తరలుతున్నాయి. విదేశాలకు వెళుతున్న ఐఐటియన్లలో 65 శాతం మందికి అమెరికాయే మజిలీ. ప్రపంచంలోని 50 విదేశీ విద్యా సంస్థల విద్యార్థులకు బ్రిటన్ జారీ చేసే హైపొటెన్షియల్ ఇండివిడ్యువల్ వీసాల లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉన్నది మన ఐఐటీ విద్యార్థులే. బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఐఐటీ హోదా కల్పించిన తరువాత ఆ ఇన్స్టిట్యూట్లోని స్టూడెంట్స్‌కి విదేశాల్లో 540 శాతం ప్లేస్‌మెంట్స్ పెరిగాయంటే మన ఐఐటీలకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 2015 నుంచి దాదాపు లక్షమంది భారతీయులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు అంచనా. 2014 నుంచి దాదాపు 2300 మంది సంపన్నులు దేశాన్ని వీడి విదేశాలకు వెళ్లిపోయారు. వీళ్లంతా మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాలే! త్వరిత గతిన మన దేశాన్ని అభివృద్ధి పరచగల ప్రతిభాసామర్థ్యాలే! అందుకే వేగిరంగా ఈ మేధో వలసను ఆపే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అమ్మాయిల భాగస్వామ్యం.. ఎన్ఎస్ఎస్ఓ (నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్) సర్వే ప్రకారం.. పదిహేను నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిల్లో దాదాపు యాభై శాతం మంది అమ్మాయిలు ఇటు చదువుకోవడమూ లేదు అటు ఉద్యోగాల్లోనూ లేరు. కారణం.. కుటుంబ బాధ్యతలు, పెళ్లి! ఆశ్చర్యపోకండి! ఈ దేశంలో చాలా విషయాల్లో వైవిధ్యమైన పరిస్థితులు ఉన్నట్లే స్త్రీ సమానత్వం విషయంలోనూ భిన్నమైన వాతావరణం ఉంది. స్త్రీవాద ఉద్యమాలతో చైతన్యం పొందిన ప్రాంతాల్లోనే ఇంకా అసమానతలు కన్పిస్తుంటే అసలు ఆ ఊసే లేని ప్రాంతాల్లో అమ్మాయిల స్థితి ఎలా ఉండొచ్చు! దీనికి సమాధానమే ఆ సర్వే. దాన్నిబట్టే అర్థమవుతోంది వర్క్‌ఫోర్స్‌లో అమ్మాయిల భాగస్వామ్యం ఎంతో! ఆడపిల్ల ఉద్యోగం చేయాలా? వద్దా? ఎలాంటి ఉద్యోగాన్ని ఎంచుకోవాలి? ఆ మాటకొస్తే చదువు దగ్గర నుంచే ఆ నిర్ణయం మొదలవుతోంది. అయితే అమ్మాయిది కాదు.. కుటుంబానిది. విద్యావంతుల కుటుంబంలోని అమ్మాయిలకు తమకు ఇష్టమైన చదువు చదివే స్వేచ్ఛ దొరికినా.. కెరీర్ విషయానికి వచ్చేసరికి పెళ్లి అనేది దాన్ని సాగనివ్వడంలేదు. ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడకు వెళ్లి బాధ్యతలు నిర్వర్తించాలి. ఇది పెళ్లికాని అమ్మాయికి కూడా అడ్డంకిగానే ఉంది. ‘ఇంకా ఇలాంటి పరిస్థితులున్నాయా విడ్డూరం కాకపోతే అని ముక్కున వేలేసుకునే పనిలేదు. ఇప్పటికీ మనదేశంలో.. అమ్మాయిలకు చదువు, ఉద్యోగం కన్నా పెళ్లే ఆర్థిక భద్రతను, భరోసాను ఇస్తుంది అని భావించే కుటుంబాలే ఎక్కువ’ అంటారు ప్రముఖ ఆర్థికవేత్త, రచయిత్రి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ప్రొఫెసర్ లేఖా చక్రవర్తి. ఇలా పెళ్లి, పిల్లలు అనే బాధ్యత వర్క్‌ఫోర్స్‌లో అమ్మాయిల భాగస్వామ్యాన్ని తగ్గిస్తోంది. ఇది మన ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తోంది. ఈ విషయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యత్యాసం తగ్గాలి. అవగాహనా కార్యక్రమాలు పెరగాలి. ప్రభుత్వం అందిస్తున్న కొన్ని సహాయాలు.. దేశంలో ఇప్పుడు అంట్రప్రెన్యూర్ రంగంలో చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో రాణించేందుకు యువతకు అవసరమైన శిక్షణను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వంలోని స్కిల్ డెవలప్మెంట్ అండ్ అంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ. ఆ శిక్షణతో యువత అంట్రప్రెన్యూర్స్‌గా ఎదిగి.. ఆర్థికంగా తాము నిలదొక్కుకోవడమే కాక పదిమందికి ఉపాధి కల్పించే చాన్స్ ఉంది. స్కిల్ ఇండియా మిషన్.. పాతికేళ్లలోపు యువతకు వృత్తి శిక్షణ, పాలిటెక్నిక్, ఐటీ, సాఫ్ట్‌స్కిల్స్ డెవలప్మెంట్ వంటి కోర్సులను బోధిస్తోంది. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వగైరాల ద్వారా స్టార్టప్ ఇనీషియేటివ్ ప్రోగ్రామ్స్‌ను చేపడుతోంది. అంట్రప్రెన్యూర్‌షిప్ దిశగా యువతను ప్రోత్సహించడానికి పెట్టుబడుల కోసం ఆర్థిక మద్దతునూ అందిస్తోంది. పన్ను రాయితీలు కల్పిస్తోంది. కొత్త ఇంక్యుబేటర్స్‌ను క్రియేట్ చేస్తోంది. ఉన్న ఇంక్యుబేటర్ల సామర్థ్యాన్ని పెంచుతోంది. దేశంలోని పట్టణ, నగరాల్లోని యువత కన్నా గ్రామీణ యువతే అంట్రప్రెన్యూర్‌షిప్ పట్ల ఉత్సుకతతో ఉన్నారు. అందుకే ప్రధాన్‌మంత్రి కుశల్ కేంద్రాలు అంట్రప్రెన్యూర్‌షిప్ హబ్స్‌గా మారి ఆసక్తి ఉన్న ట్రైనీలను అంట్రప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దుతున్నాయి. అంతేకాదు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎస్ఐడీబీఐ, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఆర్‌ఎస్‌ఈటీఐఎస్) వంటి స్థానిక సంస్థలతో కలసి చదువుకున్న యువతకు స్టార్టప్స్‌లో శిక్షణనిస్తోంది. విజయవంతమైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నేషనల్ అంట్రప్రెన్యూర్‌షిప్ అవార్డ్స్నీ స్థాపించింది. కాలేజ్స్టూడెంట్స్లోని అంట్రప్రెన్యూర్‌షిప్ స్కిల్స్‌ని వెలికి తీసి వారికి శిక్షణనిస్తోంది. నైపుణ్యంగల మానవ వనరులను తయారు చేస్తోంది. సృజనాత్మక రంగాల్లో.. ఉన్నత విద్య మీద నిర్వహించిన ఆల్ ఇండియా సర్వే రిపోర్ట్‌లో ఇంజినీరింగ్ (బీటెక్ అండ్ ఎమ్‌టెక్)లో కోవిడ్ కంటే ముందు అయిదేళ్లలో దాదాపు 6,37,781 అడ్మిషన్లు పడిపోయాయని తేలింది. అదే సమయంలో సృజనాత్మక రంగాలైన ఫైన్ ఆర్ట్స్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ, డిజైనింగ్, లింగ్విస్టిక్స్ వంటి ఎన్నో విభాగాల్లో ప్రవేశాల సంఖ్య పెరిగింది. 2018–19 విద్యా సంత్సరంలో 53, 213 మంది విద్యార్థులు పలురకాల ఫైన్ ఆర్ట్స్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు పొందారు. ఈ వృద్ధి ఆయా రంగాల్లో కొత్త కొలువులు ఏర్పడేందుకు దోహదపడుతోందనేది విద్యావేత్తలు, ఆర్థికవేత్తల అభిప్రాయం. ‘భారతీయ సినిమా మీద సోషల్ మీడియా, డిజిటలైజేషన్ ప్రభావాన్ని కాదనలేం. థియేటర్లలో కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద సినిమా ప్రదర్శన గురించి ఏనాడైనా ఊహించామా? ఈ మార్పు ఆయా రంగాల్లో ఎన్నో కొత్తరకాల∙ఉద్యోగాలకు దారితీస్తోంది. వాటిల్లో వీడియో అండ్ ఫిల్మ్ ఎడిటింగ్, ప్రొడక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, సౌండ్ రికార్డింగ్ వంటివి మచ్చుకు కొన్ని. నేటి యువత ఇదివరకటిలా కెరీర్‌కి సంబంధించి తల్లిదండ్రుల అభిప్రాయాలను పట్టుకు వేళ్లాడట్లేదు. సాంకేతిక విప్లవ ప్రపంచంలో ఎలాగైనా బతకగలమనే ధైర్యం వాళ్లకుంది. ఏ ఉద్యోగమైనా తిండి పెడుతుంది అనే భరోసా కలిగింది. అందుకే నచ్చిన ఉద్యోగాలను ఇచ్చే చదువులను ఎంచుకుంటున్నారు. కొందరైతే చదివిన చదువుతో సంబంధం లేకుండా కొత్త కొత్త కొలువులతో ప్రయోగాలు చేస్తున్నారు. అమ్మాన్నానల అంచనాలను సంతృప్తి పరచడమా లేక తమకు నచ్చినట్టు ఉండడమా అనే ప్రశ్న ఎదురైనప్పుడు కచ్చితంగా తమకు నచ్చిన ఉద్యోగం చేసుకునే స్వేచ్ఛనే వాళ్లు తీసుకుంటున్నారు. అలాగని పిల్లల ఇష్టాల్ని సపోర్ట్ చేయని తల్లిదండ్రులే అందరూ అని చెప్పడానికీ లేదు. చాలా మంది పెద్దలు కూడా పిల్లల సృజనాత్మకత మీద నమ్మకంతో వాళ్లకు నచ్చిన దారిలో వాళ్లు వెళ్లే స్వతంత్రాన్నిస్తున్నారు. అండగా నిలబెడుతున్నారు. దాంతో సృజనాత్మక రంగాలైన డిజైనింగ్, ఫ్యాషన్, రైటింగ్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ వంటివాటిల్లో నేటి యువత రాణిస్తోంది. ఆ రంగాలకూ డిమాండ్ పెరిగి.. ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. కాబట్టి సృజనాత్మక రంగాలను పాఠశాల, కళాశాల స్థాయిలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్గానే చూడకుండా.. మంచి ఉద్యోగావకాశాలు కల్పించే రంగాలుగానూ గుర్తించి.. ఆ దిశగా వాటిని సిలబస్‌లో చేర్చాలి’ అంటారు న్యూ ఢిల్లీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలోని కల్చర్ డిపార్ట్మెంట్ అధిపతి మిర్ ఇంతియాజ్. ‘విదేశాల్లో లాగా బయటి క్రియేటివ్ ఇండస్ట్రీకి, అకాడమిక్స్కి మధ్య ఉన్న అంతరాన్ని చెరిపేసేలా ఓ పాలసీని తయారు చేయాలి. అప్పుడే యువతకు ఫలానా కోర్స్ చదివితే ఫలానా రంగంలో ఫలానా ఉద్యోగాలు ఉన్నాయనే అవగాహన కలుగుతుంది. ఇప్పుడెలాగైతే కంప్యూటర్ సైన్స్ చదివితే సాఫ్ట్వేర్ ఉద్యోగాలున్నాయని తెలుస్తోందో అలాగా’ అని అభిప్రాయపడుతున్నారు పుణెలోని ఎమ్ఐటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లోని ఫిల్మ్ అండ్ వీడియో డిజైన్ డిపార్ట్మెంట్ హెడ్ ఇంద్రజిత్ నియోగి. ‘సీబీఎస్ఈ సిలబస్ ఎడ్యుకేషన్ పాటర్న్‌లో ఈ రకమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం క్రియేటివ్ కోర్సుల్లో అంట్రప్రెన్యూర్ షిప్ కరిక్యులమ్‌ని తప్పనిసరి చేసింది. దీని వల్ల ఇటు విద్యార్థులు.. అటు తల్లిదండ్రుల ఆలోచనా తీరు మారి.. పిల్లల్లోని సృజనాత్మకత పెంపొందే అవకాశం ఉంటుంది’ అని చెబుతున్నారు విద్యారంగ నిపుణులు. ముగింపు దేశంలో ప్రతి ఏటా దాదాపు కోటి మంది యువత వర్క్‌ఫోర్స్‌లోకి వస్తోందని అంచనా. ఇప్పుడున్న అవకాశాలు సరిపోవడం లేదు. అదీగాక మన దగ్గరున్న యువతరం దాదాపుగా.. ఉపాధి కల్పన అంతగాలేని గ్రామీణ, చిన్న చిన్న పట్టణాలకు చెందినదే. చిన్న చిన్న పట్టణాల్లో చాలామంది అమ్మాయిలు సైబర్ సెక్యూరిటీ నిపుణులుగా మారాలని ఆశిస్తున్నారు. వారిలో నేర్చుకునే తపనకు.. సృజనాత్మక ఆలోచనలకేం కొదువలేదు. కావల్సిందల్లా సరైన మార్గదర్శకత్వం.. అవసరమైన మౌలిక సదుపాయాలు. ఇందాకే చెప్పుకున్నట్టు వీళ్లంతా మన దేశ ఆర్థిక ప్రగతికి అవాకాశాలు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన చాలా దేశాలు యువ జనాభా లేక ఉస్సూరుమంటున్నాయి. వాటిల్లో జపాన్ ఒకటి. అలాంటి దేశాలకు మన యూత్ వరం. మన దగ్గరి ప్రతిభావంతులైన యువతకు వాళ్ల దేశంలో మంచి కొలువులు ఇస్తానని ఇప్పటికే జపాన్ మనదేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటి ఒప్పందాలను మనం ఇంకెన్నో దేశాలతో చేసుకునే వీలుంది. అయితే ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మన యువతను తయారు చేయాలి. మనకున్న మరో అనుకూలాంశం. పెరుగుతున్న మధ్యతరగతి. వీళ్లే అతిపెద్ద వినియోగదారులు. మన డొమెస్టిక్ గ్రోత్‌కి డ్రైవర్స్. అందుకే పెట్టుబడులకూ మన దేశాన్ని మించింది లేదు. ఆ పెట్టుబడులే ఉద్యోగాలనూ సృష్టిస్తున్నాయి. ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ యువతకు ఉపాధి కల్పించినప్పుడే సాధ్యమవుతుంది. ఇదే ప్రభుత్వాల ఎజెండా కావాలి. అప్పుడే మనం బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతాం! -
ప్రధాని మోదీకి భయపడే ప్రసక్తే లేదు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ భవనంలో యంగ్ ఇండియా ఆఫీస్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీల్ వేసిన మరుసటి రోజు కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ అంటే భయపడేది లేదన్నారు. దేశాన్ని కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు ‘నీవు ఏం చేయాలనుకుంటున్నావో చేయ్. దేశాన్ని, ప్రజాస్వామ్యన్ని, సామరస్యతను కాపాడేందుకు కృషి చేస్తూనే ఉంటాను. వారు ఏం చేసిన మా పని కొనసాగిస్తాం. నిజాన్ని ఎవరూ బారికేడ్లు పెట్టి ఆపలేరు.’ అని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయం, గాంధీల నివాసం వద్ద బుధవారం బారికేడ్లు ఏర్పాటు చేయటంపై ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘మేము బెదిరిపోము. నరేంద్ర మోదీ అంటే భయపడటం లేదు. మీకు అర్థమవుతోందా? ఆయన ఏం చేయాలనుకుంటున్నారో చేయని. దానివల్ల ఎటువంటి తేడా ఉండదు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సమరస్యాన్ని కాపాడటం నా బాధ్యత. అందుకోసం కృషి చేస్తూనే ఉంటాను.’ అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు రాహుల్. బారికేడ్లపై ప్రశ్నించగా.. వారు మరిన్ని బారికేడ్లు పెట్టవచ్చని, కానీ, నిజాన్ని ఆపలేరని పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ నేపథ్యంలో ఈ మేరకు కేంద్రంపై విమర్శలు గుప్పించారు రాహుల్. ఇప్పటికే రాహుల్‌తో పాటు సోనియా గాంధీలను విచారించింది ఈడీ. బుధవారం యంగ్ ఇండియా ఆఫీస్‌ను సీల్ చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం, గాంధీల నివాసం ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. మరోవైపు.. ఈడీ నుంచి తనకు సమన్లు అందాయని రాజ్యసభలో పేర్కొన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే. #WATCH | Delhi: "I am not at all scared of Modi. They can put up more barricades. Truth can't be barricaded..," says Congress MP Rahul Gandhi after reaching the Parliament. pic.twitter.com/dsJBCQKQ2C — ANI (@ANI) August 4, 2022 ఇదీ చదవండి: ప్రొఫైల్ పిక్చర్లు మార్చుకోవాలంటూ మోదీ పిలుపు.. త్రివర్ణ పతాకంతో నెహ్రూ ఫొటో! -
రవి కుమార్ ‘స్వింగ్’.. సెమీస్‌లో యువ భారత్
కూలిడ్జ్ (అంటిగ్వా): అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో యువ భారత్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో 2020 అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 37.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ఎడంచేతి వాటం పేస్ బౌలర్ రవి కుమార్ (3/14) స్వింగ్ బౌలింగ్‌తో బంగ్లాదేశ్‌ను హడ లెత్తించాడు. స్పిన్నర్ విక్కీ (2/25) కూడా రాణించాడు. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 30.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ అంగ్కృష్ (44; 7 ఫోర్లు), ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ (26; 3 ఫోర్లు) రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. కెప్టెన్ యశ్ ధుల్ (20 నాటౌట్; 4 ఫోర్లు), కౌశల్ (11 నాటౌట్; 1 సిక్స్) రాణించారు. రవి కుమార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఫిబ్రవరి 1న తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో అఫ్గానిస్తాన్; ఫిబ్రవరి 2న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ ఆడ తాయి. ఫైనల్ ఫిబ్రవరి 5న జరుగుతుంది. -
క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడనున్న టీమిండియా..
టరోబా: అండర్– 19 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు అసాధారణ గెలుపుతో లీగ్ దశ ను ముగించింది. గ్రూప్ ‘బి’ మ్యాచ్ లో యువ భారత్ 326 పరుగుల భారీ తేడాతో ఉగాండాపై నెగ్గింది. మొదట భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 405 పరుగుల భారీస్కోరు చేసింది. రాజ్ అంగద్ బావా (162 నాటౌట్; 14 ఫోర్లు, 8 సిక్సర్లు), అంగ్కృష్ (144; 22 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. తర్వాత ఉగాండా 19.4 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో నిషాంత్ 4, రాజ్వర్ధన్ 2 వికెట్లు తీశారు. ఈనెల 29న జరిగే క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. -
ఆశ, శ్వాస.. యువ భారతమే
ఒక దేశ ఆర్థికాభివృద్ధికి.. ఆ దేశంలోని కార్మిక శక్తి అత్యంత కీలకం. సహజ వనరులు ఎన్నున్నా.. భారీగా పెట్టుబడులు, అద్భుతమైన విధానాలు, సాంకేతికత అందుబాటులో ఉన్నా వీటికి పనిచేసే చేతులు తోడైతేనే సమాజానికి సంపద అందుతుంది. మానవాభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే.. అన్ని హంగులు, సామర్థ్యాలున్నా ప్రపంచంలోని చాలా దేశాల్లో పనిచేసేందుకు అవసరమైన కార్మికశక్తి లేకపోవడం ఆ దేశాలను కలవరపెడుతోంది. జనన రేటు తగ్గుదల కారణంగా జనాభా పెరుగుదల రేటు బాగా మందగించడం పెద్ద సమస్యగా మారింది. రాబోయేతరం పెద్దగా లేకపోవడంతో కార్మికశక్తి కొరత ఉంది. ఉత్పాదకత తగ్గిపోవడం, ఆర్థికవృద్ధి మందగించడం, అదే సమయంలో వృద్ధుల అవసరాల కోసం మరిన్ని నిధులు కేటాయించాల్సిరావడం వల్ల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఆ దేశాల్లో ఈ పరిస్థితులు దశాబ్దాల పాటు కొనసాగుతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) పేర్కొంది. భారత్‌లో పరిస్థితి భిన్నం భారతదేశ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మన జనాభాలో సగం పాతికేళ్ల లోపువారే. మూడింట రెండొంతుల మంది 35 ఏళ్లలోపు వారే. ఈ స్థాయిలో యువశక్తి ఉన్న దేశం భారత్ ఒక్కటే. ఒక విశ్లేషణ ప్రకారం 2027 నాటికి భారత్‌లో పని చేయగల సామర్థ్యం ఉన్న జనాభా (15–64 వయోశ్రేణి) వంద కోట్లకు చేరనుంది. దేశంలో సగటు సంతానోత్పత్తి రేటు 2.3 (సగ టున ఒక్కో మహిళకు పుట్టే బిడ్డలు). తమిళ నాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీల్లో ఇది 1.6గా ఉంది. ఈ మూడు చోట్ల సంతానోత్పత్తి రేటు ఇంచుమించు జర్మనీ, ఇటలీ (1.5) స్థాయిలో క్షీణించిందని, ఫ్రాన్స్ (2) బ్రిటన్, అమెరికా (1.9) కంటే తగ్గిపోయిందని యూఎన్ఎఫ్పీఏ (ఐరాస జనాభా నిధి) డేటా చెబుతోంది. యూపీ, మధ్యప్రదేశ్, బిహార్లలో సగటున ప్రతి మహిళా ముగ్గురికి పైగా పిల్లల్ని కంటున్నారు. బిహార్‌లో దేశంలో అత్యధిక జననాలు (3.3) నమోదవుతున్నాయని తాజా రికార్డులు వెల్లడిస్తున్నాయి. వీరందరికీ విద్య, శిక్షణ, నైపుణ్యాలను అందించడం, మౌలిక సదుపాయాలపరంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించడం వంటి నిర్మాణాత్మక చర్యలపై ప్రభుత్వాలు ఎంతమేరకు దృష్టి పెడతాయనే దానిపైనే మన దేశ ఆర్థికాభివృద్ధి ఆధారపడి వుందని సామాజికవేత్తలు చెబుతున్నారు. క్షీణించిన విద్యా ప్రమాణాలు.. దేశంలో 14–18 వయసు పిల్లల్లో 57% మంది కనీసం రెండో తరగతి భాగాహారాలు కూడా చేయలేకపోతున్నారని ఇటీవల వెలువడిన వార్షిక విద్యా స్థితిగతుల నివేదిక వివరించింది. క్షీణించిన విద్యా ప్రమాణాలను మెరుగు పరచడంపై దృష్టి పెట్టాలని ఇలాంటి ఎన్నో నివేదికలు పదే పదే నొక్కి చెబు తున్నాయి. విద్య, వైద్య రంగాలపై పెట్టుబడుల పెట్టడం వల్ల నాణ్యమైన మానవ వనరులు సమకూరుతాయని, వృద్ధిరేటును పెంచుకోవడంలో ఇది అత్యంత కీలకమని సామాజికవేత్తలు వివరిస్తు న్నారు. స్కిల్ ఇండియా వంటి పథకాలను సమర్థంగా అమలు చేయడం, పని చేయగల జనాభాను ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తిలో భాగస్వాముల్ని చేయడం, సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు పెంచడంపై కేంద్రం మరింత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. వన్ చైల్డ్ పాలసీకి నో ప్రపంచంలోని రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో.. దీర్ఘకాలంగా అమలు చేసిన ఒకే బిడ్డ విధానం (వన్ చైల్డ్ పాలసీ) కారణంగా జనాభా పెరుగుదల రేటు తగ్గింది. జననాల రేటు ఎక్కువగా వుండటం, 30 ఏళ్ల లోపు జనాభా మూడింట రెండొంతులకు చేరడం వంటి కారణాల నేపథ్యంలో చైనా ప్రభుత్వం 1979లో ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. వృద్ధ జనాభా పెరిగిపోయిన కారణంగా 35 ఏళ్ల పాటు కొనసాగించిన ఈ విధానానికి 2016లో స్వస్తి పలికింది. అధిక యువ జనాభాకి ఆర్థిక సరళీకరణ విధానాలు తోడవడంతో.. దాదాపు మూడు దశాబ్దాల పాటు చైనా దూసుకుపోయింది (1990 తర్వాత తొలిసారిగా ఆ దేశ వృద్ధి రేటు 2018లో 6.6%కు పడిపోయింది). వచ్చే పాతికేళ్లలో పని చేయగల సామర్థ్యమున్న వయో శ్రేణి 67% నుంచి 57% పడిపోనుంది. దీనికారణంగా 2040 నాటికి చైనా తలసరి జీడీపీ 15% మేర క్షీణిస్తుందని తాజా అంచనాలు చెబుతున్నాయి. తగ్గుతున్న వర్కింగ్ ఏజ్ గ్రూప్ - పని చేయగల జనాభా (15–64 వయోశ్రేణి) తగ్గిపోతున్న దేశాల సంఖ్య ప్రస్తుతం 40కి చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం.. అమెరికాలో 1975–2015 మధ్య 20–64 ఏళ్ల మధ్యనున్న వారి జనాభా ఏడాదికి 1.24% మేర పెరిగింది. కానీ తర్వాతి 40 ఏళ్లలో ఈ పెరుగుదల 0.29% మించబోదని అంచనా. ఐరోపాలో 2015–2055 మధ్య పని చేసే జనాభా 20శాతానికి పడిపోనుంది. - జపాన్‌లో మరెక్కడా లేనంతగా వృద్ధులు పెరిగిపోయారు. 65 ఏళ్లు పైబడిన వారే 26.3%గా ఉన్నారు. 2030 నాటికి వీరి సంఖ్య 32.2%కు చేరుతుందని అంచనా. - 2030 నాటికి బ్రిటన్‌లో 65ఏళ్లు పైబడిన వారు దాదాపు 50%కు చేరుకోనున్నారు. ఉద్యోగ విరమణ వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో పనుల్లో కొనసాగుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. - ఇటలీలో 65% వయసు పైబడిన వారు 22.4% దాటారు. అక్కడ యువ జనాభా 14% మాత్రమే. - పలు అభివృద్ధి చెందిన దేశాలూ సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాల జీడీపీపై, వినియోగంపై ఇది ప్రభావం చూపనుంది. బడ్జెట్లో వృద్ధుల ఆరోగ్యం, పింఛను సహా సామాజిక భద్రత కోసం వెచ్చించాల్సిన మొత్తాలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఉదాహరణకు 2014లో జర్మనీ జీడీపీలో 26శాతం పింఛను సహా ఇతరత్రా వృద్ధుల అవసరాలకు వెచ్చించాల్సి వచ్చింది. - 2015లో ఇటలీ జీడీపీలో 16.5 శాతం పింఛన్లదే. యూరోపియన్ యూనియన్‌లో గ్రీస్ తర్వాత పింఛన్ల కోసం ఇంత మొత్తం వెచ్చిస్తున్న రెండో దేశం ఇటలీయే. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే.. పేద దేశాలు మరింతగా సంక్షోభంలోకి కూరుకుపోతాయని ఐరాస హెచ్చరిస్తోంది. కృత్రిమ మేధతో భర్తీ అయ్యేనా? వృద్ధ జనాభా పెరుగుదల సమస్య ఒక సంక్షోభం రూపు దాల్చి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చుట్టుముట్ట గలదని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని.. అమెరి కాకు చెందిన పీటర్సన్ ఇనిస్టిట్యూట్ హెచ్చరిస్తోంది. అయితే, ఈ సమస్యను చాలా మంది తక్కువ అంచనా వేస్తున్నారు. కృత్రిమ మేధ సహా రకరకాల సాంకేతికతల సాయంతో కార్మిక, ఉద్యోగుల కొరతను అధిగమించవచ్చునని భావిస్తున్నారు. ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని మానవ కొరత దుష్ప్రభావాన్ని ఊహించడం కష్టమని స్పష్టం చేసింది. బిడ్డల్ని కనండి.. జననాల రేటు పెంచేందుకు కొన్ని దేశాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. జర్మనీ దశాబ్ద కాలంగా పిల్లలను కనేవారికి కల్పించే ప్రయోజనాలను, శిశు సంరక్షణ సౌకర్యాలను విస్తరించింది. దీంతో అక్కడ 2016లో (1996 తర్వాత తొలిసారిగా) ఎక్కువ మంది బిడ్డలు జన్మించారు. ఫ్రాన్స్, సింగపూర్, దక్షిణ కొరియా, టర్కీ, జపాన్ తదితర దేశాలు ఈ దిశగా ప్రోత్సహిస్తు న్నాయి. జపాన్‌లో 2దశాబ్దాల తర్వాత 2015లో జననాల రేటు స్వల్పంగా (1.46) పెరిగింది. వలసదార్లే దిక్కు భారీగా వస్తున్న వలసదారుల కారణంగా.. కొన్ని దేశాలు కార్మికుల కొరతను అధిగమిస్తున్నాయి. అలాంటి దేశాల్లో అమెరికా ఒకటి. అయితే, ట్రంప్ అవలంభిస్తున్న వలస వ్యతిరేక విధానాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. వలస దార్లను తగ్గించుకోవడం వల్ల రానున్న దశాబ్దంలో అమెరికాకు కార్మిక కొరత తప్పేట్లు లేదు. వృద్ధులకు శిక్షణ ఇవ్వడం, వారి నైపుణ్యాలకు సానబెట్టడం వంటి చర్యల ద్వారా కార్మిక కొరతను కొంతవరకు అధిగమించవచ్చని.. ఐఎల్ఓ సూచిస్తోంది. సింగపూర్ ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. స్త్రీల భాగస్వామ్యమేదీ? దేశ ఉత్పత్తిలో మహిళలు భాగస్వాములు అయినప్పుడే.. వారు ఆర్థిక సాధికారత దిశగా పయనించగలుగుతారు. ఆర్థిక వ్యవస్థలూ వృద్ధి చెందుతాయి. కానీ వీరికి పని కల్పించడంలో ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదు. మన దేశంలో ఉత్పత్తి కార్యక్రమాల్లో పాల్గొనే మహిళలు 27%ను మించడం లేదు. పురుషులతో సమానంగా స్త్రీలను కార్మిక శక్తిలో భాగం చేసినట్టయితే, భారత్ జీడీపీలో 27% మేరకు వృద్ధి నమోదవుతుందంటున్నారు ఐఎంఎఫ్ చీఫ్ క్రిష్టినా లగారే. -
ఎవరీ యువ కెరటం..?
శుభ్‌మాన్ గిల్.. యువ టీమిండియాలో ఈ పేరు మార్మోగుతోంది. నిలకడగా రాణిస్తున్న ఈ యువ బ్యాట్స్‌మన్ తాజాగా అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో జట్టును టైటిల్‌కు చేరువ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో పాకిస్తాన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని సెంచరీ బాదాడు. 94 బంతుల్లో 7 ఫోర్లతో 102 పరుగులు సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు(341) కూడా అతడివే. ఈ కుడిచేతి వాటం టాపార్డర్ బ్యాట్స్‌మన్ అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతో గిల్ మరింత రాటు దేలుతున్నాడు. దేశీయ మ్యాచుల్లో పంజాబ్ తరుపున ఆడుతున్న అతడు 2017, నవంబర్‌లో బెంగాల్‌తో తన మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. తొలి మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేసిన గిల్.. రెండో మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. పంజాబ్‌లోని ఫాజిల్కా పట్టణంలో 1999, సెప్టెంబర్ 8న శుభ్‌మాన్ గిల్ జన్మించాడు. అతడి తండ్రి రైతు. క్రికెటర్ కావాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు తండ్రిని ఒప్పించి కుటుంబంతో సహా మొహాలి తరలివెళ్లాడు. కఠోర సాధన, క్రమశిక్షణతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నాడు. 2014లో జరిగిన అండర్-16 పంజాబ్ అంతర్ జిల్లా టోర్నమెంట్లో 351 పరుగులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. నిర్మల్ సింగ్‌తో కలిసి మొదటి వికెట్‌కు 587 భాగస్వామ్యం నమోదు చేశాడు. విజయ్ మర్చంట్ ట్రోఫిలో పంజాబ్ తరపున అరంగ్రేటం చేసిన అండర్-16 మ్యాచ్‌లోనే అజేయ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. 2013-14, 2014-15లో వరుసగా రెండుసార్లు బెస్ట్ జూనియర్ క్రికెటర్‌గా బీసీసీఐ అవార్డు అందుకున్నాడు. తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లి చేతుల మీదుగా 2014లో అవార్డు అందుకుని మురిసిపోయాడు. తాజాగా నిర్వహించిన ఐపీఎల్ వేలంలో రూ.1.8 కోట్లకు గిల్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకుంది. -
ద్రవిడ్ బాయ్స్.. అదుర్స్!
క్రైస్ట్‌చర్చ్: రాహుల్ ద్రవిడ్ శిక్షణలో యువ టీమిండియా అద్భుతాలు చేస్తోంది. వరుస విజయాలు సాధిస్తూ అప్రతిహతంగా దూసుకుపోతోంది. అండర్–19 వన్డే ప్రపంచకప్‌లో భారీ విజయాలు నమోదు చేయడం యువ భారత్ సత్తాకు సిసలైన నిదర్శనంగా నిలిచింది. కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో రాటుదేలిన యువ క్రికెటర్లు అన్ని విభాగాల్లో రాణిస్తూ ప్రతిష్టాత్మక టోర్నిలో దేశానికి తిరుగులేని విజయాలు అందించారు. సెమీస్‌లో పాకిస్తాన్‌ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లారు. తుది సమరంలోనూ జోరు కొనసాగించి విజేతగా నిలవాలని యువ భారత్ ఉవ్విళ్లూరుతోంది. అండర్–19 తాజా ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన యంగ్ ఇండియా అన్నింటిలోనూ భారీ విజయాలు సాధించింది. వందకు పైగా పరుగుల తేడాతో మూడు, 10 వికెట్ల తేడాతో రెండుసార్లు విజయదుందుభి మోగించింది. యువ భారత్ గెలిచిందిలా... ఆస్ట్రేలియాతో ఆడిన తొలి మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో గెలుపు పపువా న్యూ గునియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో 10 వికెట్లతో విజయకేతనం మూడో వన్డేలో జింబాబ్వేపై 10 వికెట్లతో విజయం క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై 131 పరుగుల తేడాతో విక్టరీ సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై 203 పరుగుల తేడాతో విజయదుందుభి -
మోదీ@యువభారత్
-
యంగ్ ఇండియా పత్రికను ఎవరు ప్రారంభించారు?
1. కుతుబ్‌షాహీలు పరిపాలించిన దక్కను ప్రాంతం? గోల్కొండ 2. మద్రాస్‌లో రైత్వారీ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? సర్ థామస్ మన్రో 3. యానాంలో వర్తక స్థావరాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఫ్రెంచి వారు 4. ఏ గవర్నర్ కాలంలో సతీసహగమనం, స్త్రీ, శిశు హత్యలను నిషేధించారు? విలియం బెంటింక్ (1829లో) 5. ఆంధ్రాలో ‘బొబ్బిలియుద్ధం’ ఎప్పుడు జరిగింది? క్రీ.శ. 1757లో 6. భారతదేశంలో బ్రిటిష్ అధికారాన్ని సుస్థిరం చేయడానికి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? లార్డ డల్హౌసీ 7. భారతదేశంలో రైల్వేబోర్డను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1936లో 8. గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను ఏ సంవత్సరంలో నిర్మించారు? 1853లో 9. ఆంధ్రదేశంలో గ్రామాల చరిత్రను కైఫీయతులు పేరుతో రూపొందించిన ఆంగ్లేయుడు? కల్నల్ మెకంజీ 10. తెలుగు భాషకు విశేష కృషి చేసిన ఆంగ్లేయుడు? సి.పి. బ్రౌన్ 11. పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? దాదాబాయ్ నౌరోజీ 12. ముస్లింలకు ఆధునిక విద్యను అందించడానికి విశేష కృషి చేసిన వారు? సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్ 13. యువ బెంగాల్ ఉద్యమ నాయకుడు? ఎమ్.వి. డెరోజీయో 14. రాధాస్వామి సత్సంగ్ స్థాపకుడు? తులసీరామ్ 15. తెలుగులో మొదటి సాంఘిక నవల? రాజశేఖర చరిత్ర 16. రామకృష్ణ మిషన్ ముఖ్య కేంద్రం ఎక్కడ ఉంది? బేలూరులో 17. పాశ్చాత్య దేశాల్లో హిందూమత ఉన్నతి కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త? స్వామి వివేకానంద 18. భారత బ్రహ్మసమాజాన్ని 1866లో ఏర్పాటు చేసిన సంఘ సంస్కర్త ఎవరు? కేశవ చంద్రసేన్ 19. 1906లో ఆంధ్రాలో కొమర్రాజు లక్ష్మణ రావు ప్రారంభించిన ముద్రణాలయం పేరు? విజ్ఞాన చంద్రికామండలి 20. సారే జహాసే అచ్ఛా - హిందుస్థాన్ హమారా గేయ రచయిత? మహ్మద్ ఇక్బాల్ 21. ఆర్య సమాజాన్ని ఏ సంవత్సరంలో ఎవరు స్థాపించారు? దయానంద సరస్వతి, క్రీ.శ. 1875లో 22. పార్శీల పవిత్ర గ్రంథం పేరు? అవెస్టా 23. జొరాష్ట్రియన్ మత స్థాపకుడు? జొరాష్టర్ 24. వివేకవర్దిని మాస పత్రిక, హితకారిణి సమాజం ద్వారా సంఘ సంస్కరణలు చేపట్టినవారు? కందుకూరి వీరేశలింగం 25. కందుకూరి వీరేశలింగం స్మారక మ్యూజియం ఆంధ్రాలో ఎక్కడ ఉంది? రాజమండ్రిలో 26. బాలురకు 18 ఏళ్లు, బాలికలకు 14 ఏళ్లు వివాహ వయసుగా నిర్దేశిస్తూ 1930లో ఏ చట్టాన్ని ప్రవేశపెట్టారు? శారదాచట్టం 27. బంకించంద్ర రచించిన ఆనందమఠ్ నవల దేన్ని గురించి వివరిస్తుంది? ఒక సన్యాసి తిరుగుబాటు 28. ఆంధ్ర దేశంలో బ్రహ్మసమాజ మందిరాలు ఎక్కడ ఉన్నాయి? కాకినాడ బ్రహ్మసమాజం, దక్కను బ్రహ్మసమాజం (హైదరాబాద్) 29. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ఢిల్లీలో మొగలు చక్రవర్తి ఎవరు? రెండో బహదూర్ షా 30. గదర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడెవరు? దర్శిచెంచయ్య 31. జలియన్ వాలాబాగ్ హత్యాకాండ ఎప్పుడు, ఎక్కడ జరిగింది? 1919 ఏప్రిల్ 13న, అమృత్సర్(పంజాబ్) 32. ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణోద్యమం ఎక్కడ ప్రారంభమైంది? చీరాల, పేరాల, పెదనందిపాడు, పల్నాడు 33. {బిటిష్ పార్లమెంట్‌కు ఎన్నికైన ప్రథమ భారతీయుడు? దాదాబాయి నౌరోజీ 34. వందేమాతరం గేయ రచయిత? బంకించంద్ర చటర్జీ 35. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ స్వీయ రచన ఎవరికి సంబంధించింది? మహాత్మాగాంధీ 36. భారతదేశానికి పూర్ణ స్వాతంత్య్రం సిద్ధించాలని భారత జాతీయ కాంగ్రెస్ ఏ సదస్సులో తీర్మానించింది? దాని అధ్యక్షుడెవరు? 1929 లాహోర్ సదస్సులో, పండిత్ నెహ్రూ అధ్యక్షుడు 37. భారత జాతీయ కాంగ్రెస్‌కు మొదట అధ్యక్షత వహించిన మహిళ? అనిబీసెంట్ 38. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని విడిచి వెళ్లే సమయంలో బ్రిటన్ ప్రధాని? అట్లీ 39. సరిహద్దు గాంధీ అని ఎవరిని పేర్కొంటారు? ఆయన ఏర్పాటు చేసిన సేవాదళం పేరు? ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్. కుదైకిద్మత్గార్ (దేవుడి సేవకులు) 40. తెలంగాణా ప్రాంతాన్ని ఆంధ్రాలో విలీనం చేసి, ఆంధ్రప్రదేశ్‌గా ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1956 నవంబరు 1 41. పోర్చుగీసు స్వాధీనంలోని గోవా భారతదేశంలో ఎప్పుడు విలీనం అయింది? 1961 డిసెంబరు 20న 42. యంగ్ ఇండియా పత్రికను ఎవరు ప్రారంభించారు? మహాత్మాగాంధీ 43. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం భక్తి పాటను ఎవరు రచించారు? విష్ణు దిగంబర పులూస్కర్ 44. మద్రాసులో హిందూ సాంఘిక సంస్కరణ సంఘాన్ని ఎవరు స్థాపించారు? కందుకూరి వీరేశలింగం 45. సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించినవారు? గోపాలకృష్ణ గోఖలే 46. 1857 నాటి సిపాయిల తిరుగుబాటును ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ యుద్ధంగా ఎవరు అభివర్ణించారు? వి.డి. సావార్కర్ 47. గులాంగిరి గ్రంథ రచయిత? జ్యోతిబాపూలే 48. ద్వైతాద్వైత సిద్ధాంతకర్త? నింభార్కుడు 49. కాశీయాత్ర గ్రంథాన్ని ఎవరు రచించారు? ఏనుగుల వీరాస్వామి 50. ఆంధ్రాలో దత్త మండలాలకు రాయలసీమ అని ఎవరు పేరు పెట్టారు? గాడిచర్ల హరిసర్వోత్తమరావు 51. మాలపల్లి తెలుగు నవలా రచయిత? ఉన్నవ లక్ష్మీ నారాయణ 52. ఆంధ్ర- మద్రాసు రాష్ట్రాల విభజన సంఘానికి అధ్యక్షుడు? కుమారస్వామిరాజు 53. కర్నూలు రహాస్య సర్క్యూలర్ రూపొందించిన నేత? కళా వెంకట్రావు, 1942లో 54. 1930 నాటి తొలి రౌండ్ టేబుల్ సమావేశం ఎక్కడ జరిగింది? లండన్‌లో 55. 1930 నాటి దండి ఉప్పు సత్యాగ్రహం(శాసనోల్లంఘన ఉద్యమం)లో పాల్గొన్న ఆంధ్రుడు? ఎర్నేని సుబ్రమణ్యం -
ఉద్యోగాలకు సై అనే పార్టికే... నిరుద్యోగుల జై