యంగ్ ఇండియా పత్రికను ఎవరు ప్రారంభించారు? | Who started magazine Young India? | Sakshi
Sakshi News home page

యంగ్ ఇండియా పత్రికను ఎవరు ప్రారంభించారు?

Published Fri, Apr 11 2014 10:05 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Who started magazine Young India?

1.    కుతుబ్‌షాహీలు పరిపాలించిన దక్కను ప్రాంతం?
     గోల్కొండ
 
 2.    మద్రాస్‌లో రైత్వారీ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు?
     సర్ థామస్ మన్రో
 
 3.    యానాంలో వర్తక స్థావరాన్ని ఎవరు ఏర్పాటు చేశారు?
     ఫ్రెంచి వారు
 
 4.    ఏ గవర్నర్ కాలంలో సతీసహగమనం, స్త్రీ, శిశు హత్యలను నిషేధించారు?
     విలియం బెంటింక్ (1829లో)
 
 5.    ఆంధ్రాలో ‘బొబ్బిలియుద్ధం’ ఎప్పుడు జరిగింది?
   క్రీ.శ. 1757లో
 
 6.    భారతదేశంలో బ్రిటిష్ అధికారాన్ని సుస్థిరం చేయడానికి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
     లార్‌‌డ డల్హౌసీ
 
 7.    భారతదేశంలో రైల్వేబోర్‌‌డను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
     1936లో
 
 8.    గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను ఏ సంవత్సరంలో నిర్మించారు?
     1853లో
 
 9.    ఆంధ్రదేశంలో గ్రామాల చరిత్రను కైఫీయతులు పేరుతో రూపొందించిన ఆంగ్లేయుడు?
     కల్నల్ మెకంజీ
 
 10.    తెలుగు భాషకు విశేష కృషి చేసిన ఆంగ్లేయుడు?
     సి.పి. బ్రౌన్
 
 11.    పావర్టీ అండ్ అన్‌బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు?
     దాదాబాయ్ నౌరోజీ
 
 12.    ముస్లింలకు ఆధునిక విద్యను అందించడానికి విశేష కృషి చేసిన వారు?
     సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్
 
 13.    యువ బెంగాల్ ఉద్యమ నాయకుడు?
     ఎమ్.వి. డెరోజీయో
 
 14.    రాధాస్వామి సత్సంగ్ స్థాపకుడు?
     తులసీరామ్
 
 15.    తెలుగులో మొదటి సాంఘిక నవల?
     రాజశేఖర చరిత్ర
 
 16.    రామకృష్ణ మిషన్ ముఖ్య కేంద్రం ఎక్కడ ఉంది?
     బేలూరులో
 
 17.    పాశ్చాత్య దేశాల్లో హిందూమత ఉన్నతి కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త?
     స్వామి వివేకానంద
 
 18.    భారత బ్రహ్మసమాజాన్ని 1866లో ఏర్పాటు చేసిన సంఘ సంస్కర్త ఎవరు?
     కేశవ చంద్రసేన్
 
 19.    1906లో ఆంధ్రాలో కొమర్రాజు లక్ష్మణ రావు ప్రారంభించిన ముద్రణాలయం పేరు?
     విజ్ఞాన చంద్రికామండలి
 
 20.    సారే జహాసే అచ్ఛా - హిందుస్థాన్ హమారా గేయ రచయిత?
     మహ్మద్ ఇక్బాల్
 
 21.    ఆర్య సమాజాన్ని ఏ సంవత్సరంలో ఎవరు స్థాపించారు?
     దయానంద సరస్వతి, క్రీ.శ. 1875లో
 
 22.    పార్శీల పవిత్ర గ్రంథం పేరు?
     అవెస్టా
 
 23.    జొరాష్ట్రియన్ మత స్థాపకుడు?
     జొరాష్టర్
 
 24.    వివేకవర్దిని మాస పత్రిక, హితకారిణి సమాజం ద్వారా సంఘ సంస్కరణలు చేపట్టినవారు?
     కందుకూరి వీరేశలింగం
 
 25.    కందుకూరి వీరేశలింగం స్మారక మ్యూజియం ఆంధ్రాలో ఎక్కడ ఉంది?
     రాజమండ్రిలో
 
 26.    బాలురకు 18 ఏళ్లు, బాలికలకు 14 ఏళ్లు వివాహ వయసుగా నిర్దేశిస్తూ 1930లో ఏ చట్టాన్ని ప్రవేశపెట్టారు?
     శారదాచట్టం
 
 27.    బంకించంద్ర రచించిన ఆనందమఠ్ నవల దేన్ని గురించి వివరిస్తుంది?
     ఒక సన్యాసి తిరుగుబాటు
 
 28.    ఆంధ్ర దేశంలో బ్రహ్మసమాజ మందిరాలు ఎక్కడ ఉన్నాయి?
     కాకినాడ బ్రహ్మసమాజం,
     దక్కను బ్రహ్మసమాజం (హైదరాబాద్)
 
 29.    1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ఢిల్లీలో మొగలు చక్రవర్తి ఎవరు?
     రెండో బహదూర్ షా
 
 30.    గదర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడెవరు?
     దర్శిచెంచయ్య
 
 31.    జలియన్ వాలాబాగ్ హత్యాకాండ ఎప్పుడు, ఎక్కడ జరిగింది?
     1919 ఏప్రిల్ 13న, అమృత్‌సర్(పంజాబ్)
 
 32.    ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణోద్యమం ఎక్కడ ప్రారంభమైంది?
     చీరాల, పేరాల, పెదనందిపాడు, పల్నాడు
 
 33.    {బిటిష్ పార్లమెంట్‌కు ఎన్నికైన ప్రథమ భారతీయుడు?
     దాదాబాయి నౌరోజీ
 
 34.    వందేమాతరం గేయ రచయిత?
     బంకించంద్ర చటర్జీ
 
 35.    మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్ స్వీయ రచన ఎవరికి సంబంధించింది?
     మహాత్మాగాంధీ
 
 36.    భారతదేశానికి పూర్ణ స్వాతంత్య్రం సిద్ధించాలని భారత జాతీయ కాంగ్రెస్ ఏ సదస్సులో తీర్మానించింది? దాని అధ్యక్షుడెవరు?
     1929 లాహోర్ సదస్సులో,
     పండిత్ నెహ్రూ అధ్యక్షుడు
 
 37.    భారత జాతీయ కాంగ్రెస్‌కు మొదట అధ్యక్షత వహించిన మహిళ?
     అనిబీసెంట్
 
 38.  బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని విడిచి వెళ్లే సమయంలో బ్రిటన్ ప్రధాని?
     అట్లీ
 
 39.    సరిహద్దు గాంధీ అని ఎవరిని పేర్కొంటారు? ఆయన ఏర్పాటు చేసిన సేవాదళం పేరు?
     ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్.
     కుదైకిద్‌మత్‌గార్ (దేవుడి సేవకులు)
 
 40.    తెలంగాణా ప్రాంతాన్ని ఆంధ్రాలో విలీనం చేసి, ఆంధ్రప్రదేశ్‌గా ఎప్పుడు ఏర్పాటు చేశారు?
     1956 నవంబరు 1
 
 41.    పోర్చుగీసు స్వాధీనంలోని గోవా భారతదేశంలో ఎప్పుడు విలీనం అయింది?
     1961 డిసెంబరు 20న
 
 42.    యంగ్ ఇండియా పత్రికను ఎవరు ప్రారంభించారు?
     మహాత్మాగాంధీ
 
 43.    రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం భక్తి పాటను ఎవరు రచించారు?
     విష్ణు దిగంబర పులూస్కర్
 
 44.    మద్రాసులో హిందూ సాంఘిక సంస్కరణ సంఘాన్ని ఎవరు స్థాపించారు?
     కందుకూరి వీరేశలింగం
 
 45.    సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించినవారు?
     గోపాలకృష్ణ గోఖలే
 
 46.    1857 నాటి సిపాయిల తిరుగుబాటును ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ యుద్ధంగా ఎవరు అభివర్ణించారు?
     వి.డి. సావార్కర్
 
 47.    గులాంగిరి గ్రంథ రచయిత?
     జ్యోతిబాపూలే
 
 48.    ద్వైతాద్వైత సిద్ధాంతకర్త?
     నింభార్కుడు
 
 49.    కాశీయాత్ర గ్రంథాన్ని ఎవరు రచించారు?
     ఏనుగుల వీరాస్వామి
 
 50.    ఆంధ్రాలో దత్త మండలాలకు రాయలసీమ అని ఎవరు పేరు పెట్టారు?
     గాడిచర్ల హరిసర్వోత్తమరావు
 
 51.    మాలపల్లి తెలుగు నవలా రచయిత?
     ఉన్నవ లక్ష్మీ నారాయణ
 
 52.    ఆంధ్ర- మద్రాసు రాష్ట్రాల విభజన సంఘానికి అధ్యక్షుడు?
     కుమారస్వామిరాజు
 
 53.    కర్నూలు రహాస్య సర్క్యూలర్ రూపొందించిన నేత?
     కళా వెంకట్రావు, 1942లో
 
 54.    1930 నాటి తొలి రౌండ్ టేబుల్ సమావేశం ఎక్కడ జరిగింది?
     లండన్‌లో
 
 55.    1930 నాటి దండి ఉప్పు సత్యాగ్రహం(శాసనోల్లంఘన ఉద్యమం)లో పాల్గొన్న ఆంధ్రుడు?
     ఎర్నేని సుబ్రమణ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement