ఆగ్రా అంధకవిగా ప్రసిద్ధులైనవారెవరు? | Who Agra famous blind poet? | Sakshi
Sakshi News home page

ఆగ్రా అంధకవిగా ప్రసిద్ధులైనవారెవరు?

Published Sat, May 3 2014 10:18 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Who Agra famous blind poet?

భారతదేశ చరిత్ర

 1.     ఏ సిక్కు గురువు ఔరంగజేబు చేతిలో హత్యకు గురయ్యాడు?
       తేజ్ బహదూర్
 
 2.    అక్బర్ ప్రవేశపెట్టిన నూతన మతం ‘దిన్ - ఇ - ఇలాహీ’ అంటే అర్థం ఏమిటి?
       భగవంతుడు ఒక్కడే
 
 3.    జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన మొదటి ఆంగ్లేయుడు?
       హాకిన్‌‌స
 
 4.    మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన మొదటి మొగల్ సుల్తాన్?
       జహంగీర్
 
 5.    ‘కుతుబ్‌మీనార్’ నిర్మాత?
       ఇల్-టుట్-మిష్
 
 6.    ‘భగవద్గీతను’ పారశీక భాషలోకి ఎవరు అనువదించారు?
      దారాషికో
 
 7.    మరాఠ పరిపాలనలో ‘చౌత్’ దేన్ని వివరిస్తుంది?
      భూమి శిస్తు వాటా 1/4 వ వంతు
 
 8.    ‘వాస్కోడిగామా’ ఎవరు?
      పోర్చుగీస్ నావికుడు
 
 9.    అక్బర్ కాలంలో ‘మహాభారతాన్ని’ పారశీక భాషలోకి ఏ పేరుతో అనువదించారు?
      ‘రజమ్ నామా’
 
 10.    ‘జిమ్మీలు’ అంటే ఎవరు?
      జిజియా పన్నుకట్టి, రక్షణ పొందిన హిందువులు
 
 11.    పంచారాత్ర క్రతువు ఏ మతశాఖకు చెందింది?
      వైష్ణవ మతం (విష్ణువే సృష్టికి మూల పురుషుడని చెబుతారు)
 
 12.    మధురైలోని ‘మీనాక్షి’ దేవాలయాన్ని ఏ రాజులు నిర్మించారు?
      పాండ్యరాజులు
 
 13.    ‘స్థల మాహాత్మ్యం’ అంటే ఏమిటి?
      దేవాలయాల్లో దేవతల గురించి వివరించే స్థానిక కథనాలు
 
 14.    కేరళ మలబార్ తీరం ‘కాలడి’ గ్రామంలో జన్మించిన శంకరాచార్యులు భారతదేశంలో నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు? అవి ఏవి?
 
       1. బదరీనాథ్ (హిమాలయ ప్రాంతం)
        2. ద్వారకా (గుజరాత్)
        3. పూరి (ఒరిస్సా)
        4. శృంగేరి (కర్ణాటక)
 
 15.    ఇస్లాం మత స్థాపకుడు ఎవరు?
      మహమ్మద్
 
 16.    గుజరాత్‌లో ప్రఖ్యాతి గాంచిన సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసిన రాజు?
      మహ్మద్ గజినీ (1025 - 26)
 
 17.    ‘రస గంగాధరం’, ‘గంగాలహరి’ లాంటి కావ్యాల రచయిత?
      పండిత జగన్నాథ రాయలు
 
 18. ముస్లిమేతరులపై సుల్తానులు విధించిన ‘జిజియా’ పన్నును రద్దు చేసిన మొగలు చక్రవర్తి?
      అక్బర్
 
 19.    మొగలుల రాజధానిని ‘ఆగ్రా’ నుంచి ఢిల్లీకి మార్చిన సుల్తాన్?
      షాజహాన్
 
 20.    అక్బర్ ప్రవేశపెట్టిన ‘మున్సబ్దారీ’ వ్యవస్థ దేనికి సంబంధించింది?
      సైనిక, పౌర పరిపాలనా వ్యవస్థ
 
 21.    ‘సిక్కు మత’ స్థాపకుడు ఎవరు?
      గురునానక్
 
 22.    ‘ఆది గ్రంథ్’ లేదా ‘గ్రంథ సాహెబ్’ను ఎవరు సంకలనం చేశారు?
      గురు అర్జున్‌దాస్
 
 23.    భారతదేశంలో పోర్చుగీసుల మొదటి రాజధాని ఏది?
      కొచ్చిన్
 
 24. ‘తాజ్‌మహల్’ వాస్తు రూపకర్త ఎవరు?
      ఉస్తాద్ ఈసా
 
 25.    ‘న్యాయ గంట’ను ఏర్పాటు చేసిన మొగల్ చక్రవర్తి?        
       జహంగీర్
 
 26.    మొగల్ చక్రవర్తుల్లో నిరక్షరాస్యుడు ఎవరు?
      అక్బర్
 
 27.    భారతదేశంలో పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టిన పంట ఏది?
      పొగాకు
 
 28. సమర్థ రామదాసు రచించిన గ్రంథం?
      దాసబోధ
 
 29.    {ఫెంచివారి ఆధీనంలో ఉన్న స్థావరాలు?
      యానాం, చంద్రనాగూర్, కరికాల్
 
 30.    భారతదేశంలో ‘మొగల్ వంశం’ రాజ్యస్థాపనకు దారితీసిన యుద్ధం?
      మొదటి పానిపట్టు యుద్ధం (1526)
 
 31.    భారతదేశంపై ‘నాదిర్ షా’ ఎప్పుడు దండెత్తాడు?
      1738 - 39
 
 32.    ‘సూరదాస్’ భక్తి పాటలను ఏ భాషలో రచించాడు?
      హిందీ
 
 33.     కృష్ణుడిని ఆరాధించిన భక్తి ఉద్యమకారులు?
      మీరాబాయి, వల్లభాచార్యులు, చైతన్యుడు
 
 34.    ‘పుష్టి మార్గ తాత్విక’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు?
      వల్లభాచార్యుడు
 
 35.    ‘శుద్ధాద్వైత’ మత స్థాపకుడు?
      వల్లభాచార్యుడు
 
 36.    బుద్ధుడి జీవితంలో ‘మహాభినిష్ర్కమణం’ అంటే?
      ఇల్లు వదిలి వెళ్లడం
 
 37.    అన్ని కులాలవారిని శిష్యులుగా స్వీకరించే సంప్రదాయాన్ని తొలిసారి ప్రవేశపెట్టిన భక్తి ఉద్యమకారుడు ఎవరు?
      రామానందుడు
 
 38.    ఆగ్రా అంధకవిగా ప్రసిద్ధులైనవారెవరు?
      సూరదాసు
 
 39.    ‘సుర్‌సాగర్’ గ్రంథ రచయిత?
      సూరదాసు
 
 40.    శివాజీ మత, రాజకీయ గురువు పేరు?
      సమర్థ రామదాసు
 
 41.    ‘జ్ఞానేశ్వరి’  గ్రంథ రచయిత?
      జ్ఞానదేవుడు (మహారాష్ర్ట)
 
 42.    ఢిల్లీలోని ‘కుతుబ్‌మీనార్’ను  నిర్మించిన రాజవంశం ఏదీ?
      బానిస వంశరాజులు. కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించాడు, ఇల్- టుట్- మిష్ పూర్తి చేశాడు.
 
 43.    ఉద్యానవనాల మధ్య గొప్ప కట్టడాలు నిర్మించడం అనే ప్రక్రియను ఏ సుల్తాన్‌లు ప్రారంభించారు?
      లోడీ వంశస్థులు
 
 44.    ‘ద హిందూ’ ఆంగ్ల వార్తా పత్రికను ఏ సంవత్సరంలో, ఎవరు స్థాపించారు?
      1876లో (మద్రాసు) జీఎస్. అయ్యర్, వీర రాఘవాచారి
 
 45.    1947లో ‘ఇమ్రోజ్’ (సూర్యోదయం) అనే పత్రికను నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎవరు నడిపారు?
      షోయబుల్లాఖాన్
 
 46.    ‘రయ్యత్’ అనే పేరుతో హైదారాబాద్ నుంచి ఉర్దూభాషలో పత్రికను నడిపి వారు?
      బూర్గుల రామకృష్ణారావు
 
 47.    సేవాసదన్, గోదాన్, రంగభూమి రచనలు ఎవరివి?
      ప్రేమ్‌చంద్
 
 48.    1857 మార్చి 29న ‘మంగళ్‌పాండే’ ఉదంతం ఎక్కడ జరిగింది?
      బారక్‌పూర్‌లో
 
 49.    1857 నాటి తిరుగుబాటు ఉద్యమంలో ఏ వర్గాలవారు పాల్గొన లేదు?
      వర్తకులు, విద్యావంతులు, వడ్డీవ్యాపారులు
 
 50.    {పాచీన గురుకుల పద్ధతిలో విద్యాబోధన చేయాలనే లక్ష్యంతో గురుకుల వర్గానికి ఎవరు నాయకత్వం వహించారు?
      స్వామి శ్రద్ధానంద
 
 51.    దయానంద ఆంగ్లో వేదిక్ (డీఏవీ) కళాశాల వర్గానికి ఎవరు నాయకత్వం వహించారు?
      లాలాలజపతి రాయ్, హంసరాజ్
 
 52.    సయ్యద్ అహ్మద్‌ఖాన్‌పై ముస్లిం సంప్రదాయ వాదులు ఏ ఉద్యమం పేరుతో తిరుగుబాటు చేశారు?
      దియోబంద్ ఉద్యమం
 
 53.    ‘పుణే సేవాసదన్’ను ఎవరు ఏర్పాటు చేశారు?
      రమాబాయి రనడే
 
 54.    1867లో ‘ప్రార్థనా సమాజాన్ని’ ఎవరు ఏర్పాటు చేశారు?
      ఆత్మారాం పాండురంగ
 
 55.    ఆంధ్రదేశంలో ‘బ్రహ్మసమాజం’ మందిరాలు ఎక్కడ ఉన్నాయి?
      1) కాకినాడ బ్రహ్మ సమాజ మందిరం
       2) దక్కన్ బ్రహ్మ సమాజ మందిరం,
          హైదరాబాద్
 
 56.    ఆంగ్లేయులపై వీర పాండ్య కట్ట బ్రహ్మణ ఎక్కడి నుంచి తిరుగుబాటు చేశాడు?
      తిరునల్వేలి
 
 57.    ‘దక్కన్ విద్యా సమాజాన్ని’  ఎవరు స్థాపించారు?
      1884లో పుణేలో, జి.జి. అగార్కర్ స్థాపించారు
 
 58.    వితంతు శరణాలయాన్ని కందుకూరి వీరేశలింగం ఎక్కడ నెలకొల్పారు?
      రాజమండ్రిలో
 
 59.    ‘గులాంగిరి’ సంపాదకుడు?
      జ్యోతిబా పూలే
 
 60.    రామకృష్ణ పరమహంస అసలు పేరు?
      గంగోధర చటోపాధ్యాయ
 
 61.    ‘గోల్కొండ’ పత్రికను స్థాపించినవారు?
      సురవరం ప్రతాపరెడ్డి
 
 62.    1922లో ‘రంపచోడవరం’ గెరిల్లా యుద్ధం ఎవరి నాయకత్వంలో జరిగింది?
      అల్లూరి సీతారామరాజు
 
 63.    గిరిజనులను ‘ఆదివాసీలు’గా ఎవరు పేర్కొన్నారు?    
       దక్కర్‌బాబా
 
 64.    ‘అమృత బజార్’ పత్రిక స్థాపకుడు?
      శిశిర్ కుమార్ ఘోష్ (1868లో కలకత్తా నుంచి)
 
 65.    ‘పృథ్వీరాజ్ - రసో’ గ్రంథ కర్త ఎవరు?
      చాంద్ బర్ధాయ్
 
 66.    వాస్తు కళా విశేషాలను తెలియజేసే ‘సమరాంగణ సూత్రధార’  గ్రంథ రచయిత?
      భోజుడు (పరమార రాజు)
 
 67.    ‘కవిరాజమార్గ’ అనే కన్నడ రచన ఎవరిది?
      అమోఘ వర్షుడు
 
 68.    దక్షిణ భారతదేశంలో 1891లో ‘సాంఘిక శుద్ధి’ అనే సంస్థను ఎవరు స్థాపించారు?
      సర్. రఘుపతి వెంకటరత్నం నాయుడు
 
 69.    1906లో ఆంధ్రాలో కొమర్రాజు లక్ష్మణ రావు ప్రారంభించిన ముద్రణాలయం పేరేమిటి?
      విజ్ఞాన చంద్రికా మండలి
 
 70.    ‘బ్యాక్ టు వేదాస్’నినాదాన్ని ఎవరిచ్చారు?
      స్వామి దయానంద సరస్వతి
 
 71.    దక్షిణ భారతదేశంలో తొలి వితంతు వివాహాన్ని ఎవరు జరిపించారు?
 
      కందుకూరి వీరేశలింగం
 
 72.    రాజా రామమోహన్‌రాయ్ అభ్యుదయ సంస్కరణలను వ్యతిరేకిస్తూ, ‘ధర్మసభ’ అనే సంస్థను ఎవరు ఏర్పాటు చేశారు?
      రాధాకాంత్ దేవ్
 
 73.    మహారాష్ర్టలో సామాజిక సంస్కరణలకు, నూతన విద్యా విధానానికి ఆధ్యుడైన ఎవరిని ‘లోక హితవాదిగా’ పిలుస్తారు?
      గోపాల్ హరి దేశ్‌ముఖ్
 
 74.    1873లో ‘సత్యశోధక్’ సమాజాన్ని ఎవరు స్థాపించారు?    
       జ్యోతిబా పూలే
 
 75.    దివ్యజ్ఞాన సమాజాన్ని ఎవరు స్థాపించారు?
      మేడమ్ హెచ్.సి. బ్లావట్‌స్కీ, హెచ్.ఎస్. ఆల్కాట్ న్యూయార్‌‌కలో, 1857లో స్థాపించారు.
 
 76.    ‘విగ్రహారాధనను’ వ్యతిరేకించిన ‘నిరంకారీ’ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?
      బాబాదయాళ్ దాస్
 
 77.    ఆర్య సమాజం రెండుగా  ఎప్పుడు చీలిపోయింది?
      1892. (గురుకులవర్గం, కళాశాల వర్గం)
 
 78.    అక్బర్ ఆస్థాన చరిత్రకారుడు ఎవరు?
      అబుల్ ఫజల్
 
 79.    మొగల్ చక్రవర్తి ‘షాజహాన్’ చరిత్రను వివరించే ‘పాదుషానామా’ రచయిత?
      అబుల్ హమీద్ లాహోరి
 
 80.    ‘రామచరిత మానస్’గా ప్రసిద్ధిగాంచిన ‘హిందీ రామాయణం’ రచయిత?
      తులసీదాస్
 
 81.    భూమిశిస్తు వసూలు పద్ధతి ‘బందోబస్తు’ని  ఏమని పిలుస్తారు?
      జప్తు పద్ధతి
 
 82.    మొగల్ చక్రవర్తుల చారిత్రక క్రమం?
      బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు
 
 83.    అక్బర్ స్వయంగా రూపొందించిన రెండు రెవెన్యూ శిస్తు పద్ధతులు?
      జప్తు, దహశల
 
 84.    ‘చిన్ - కిలిచ్ -ఖాన్’ ఎవరు?
      మొగలుల కాలంలో దక్కనులో గవర్నర్ (తరఫీదార్). ఆ తర్వాత అసఫ్-జా- నిజాం - ఉల్ - ముల్క్ అయ్యాడు
 
 85.    భక్తి ఉద్యమంలో అతి ప్రధాన అంశం?
      హిందూ మత పునరుద్ధరణ
 
 86.    ‘రాళ్లను పూజిస్తే దేవుడు కనబడితే, నేను కొండనే పూజిస్తాను’ అని అన్నది ఎవరు?
      కబీర్
 
 87.    ‘భావార్థదీపిక’ రచయిత?
      రామానుజాచార్యులు
 
 88.    ‘సూఫీమతం’ ప్రధాన సందేశం ఏమిటి?
      సహజీవనం, మానవత ప్రధాన లక్షణం, ముస్లింల ఛాందస వాదాన్ని తిరస్కరించడం
 
 89.    ‘ఫిరదౌసీ’ తన ‘షానామా’ కావ్యాన్ని ఎవరి కాలంలో రచించాడు? అది ఎప్పుడు పూర్తయింది?
      మహ్మద్ గజినీ (ఢిల్లీ సుల్తాన్)
       క్రీ.శ. 1010లో పూర్తయింది
 
 90.    వీరశైవం ఉద్యమ స్థాపకుడు ‘బసవేశ్వరుడు’ ఏ రాజుల వద్ద మంత్రిగా పనిచేశాడు?
      కాలచూరి రాజులు
 
 91.    గుణాఢ్యుడు ‘బృహత్కథను’ ఏ భాషలో రచించాడు?
      పైశాచి ప్రాకృతభాషలో
 
 92.    వలయబద్ధ విధానాన్ని (పాలసీ ఆఫ్ రింగ్ ఫెన్‌‌స) అవలంబించిన గవర్నర్ జనరల్ ఎవరు?
      వారన్ హేస్టింగ్‌‌స
 
 93.    ‘భారతీయ శిక్షాస్మృతి’ సివిల్, క్రిమినల్ క్రోడీకరణ న్యాయ విషయాల కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో రూపొందించారు?
      1833లో లార్‌‌డ మెకాలే
 
 94.    తొలి రైలుమార్గం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేశారు?
      బొంబాయి నుంచి థానే వరకు (1853లో)
 
 95.    రైత్వారీ భూమిశిస్తు పద్ధతిని మొదట ఎవరు, ఎక్కడ ప్రవేశపెట్టారు?
      కెప్పెన్ రీడ్. 1792లో సేలం జిల్లాలోని బారామహల్
 
 96.    ‘సావిత్రి’, ‘లైఫ్ డివైన్’ గ్రంథాల రచయిత ?
      అరవింద్ ఘోష్
 
 97.    ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ గ్రంథకర్త?
      జవహర్‌లాల్ నెహ్రూ
 
 98.    ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదాన్ని ఎవరిచ్చారు?
      భగత్‌సింగ్
 
 99.    1947 ఆగస్టు నాటికి భారతదేశంలో విలీ నం కాని సంస్థానాలు ఏవి?
      హైదరాబాద్, కాశ్మీర్, జునాఘడ్
 
 100. భారతదేశ స్వాతంత్య్రం అనంతరం పోర్‌‌చగీస్ వారు ఏ ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయించారు?
      గోవా, డయ్యూ, డామన్
 
 101. ‘విజయ విలాసం’ గ్రంథ రచయిత?
      చేమకూర వెంకటకవి
 
 102. ‘గీతాభాష్యం’ రచించిన మతాచార్యుడు?
      మధ్వాచార్యుడు
 
 103. ‘ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని ఎవరు నిర్మించారు?
      తూర్పు చాళుక్యరాజు చాళుక్య భీముడు
 
 104. చోళుల కాలంలో ‘వర్తక శ్రేణులను’ ఏమని పిలిచేవారు?    
      మణిగ్రామాలు
 
 105. కన్నడ సాహిత్యంలో ‘రత్నత్రయంగా’ ఎవరిని పేర్కొంటారు?
      పంపడు, పొన్నడు, రణ్ణడు
 
 106. ‘రాజస్థాన్ కథావళి’ గ్రంథ రచయిత?
      కర్నల్ టాడ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement