P. Joginayudu
-
‘ద మదర్’ రచయిత ఎవరు?
భారతదేశ చరిత్ర 1. రాజధానిని స్థానేశ్వరం నుంచి కనోజ్‌కు మార్చిన రాజెవరు? హర్షుడు 2. ‘అష్టాంగ సంగ్రహం’ అనే వైద్య గ్రంథాన్ని ఎవరు రచించారు? వాగ్బటుడు 3. ‘హితకారిణీ సమాజం’ ఎవరు స్థాపించారు? కందుకూరి వీరేశలింగం 4. ‘ప్రచ్ఛన్న బుద్ధుడు’ అని ఎవరిని పేర్కొంటారు? శంకరాచార్యులు 5. నరేంద్ర మృగేశ్వరాలయాలు అనే పేరుతో 108 శివాలయాలు నిర్మించిన తూర్పు చాళుక్యరాజు? రెండో విజయాదిత్యుడు 6. ‘మహాభాష్య’ రచయిత? పతంజలి 7. ‘సెంగుట్టువాన్’ ఏ రాజ వంశస్థుడు? చేర 8. శాశ్వత భూమిశిస్తు విధానాన్ని బెంగాల్లో ఎవరు ప్రవేశపెటారు? కారన్‌వాలీస్ 9. రుగ్వేద కాలంలో ‘గ్రామాధిపతిని’ ఏమని పిలిచేవారు? గ్రామణి 10. సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించిన భారతీయ పాలకుడు? టిప్పుసుల్తాన్ (మైసూర్) 11. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి, చిట్టచివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? చక్రవర్తుల రాజగోపాలాచారి 12. స్వతంత్ర భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్? లార్డ మౌంట్‌బాటన్ 13. ‘అభినవ్ భారత్’ అనే అతివాద సంస్థను ఎవరు స్థాపించారు? సావార్కర్ సోదరులు 14. ‘గదర్ పార్టీని’ 1915లో అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో ఎవరు స్థాపించారు? లాలా హరదయాళ్ 15. గదర్ పార్టీలో సభ్యుడైన ఆంధ్రుడెవరు? దర్శి చెంచయ్య 16. లాలా లజపతిరాయ్‌ని తీవ్రంగా గాయపర్చిన బ్రిటిష్ పోలీసు అధికారి ‘సాండర్స’ ను లాహోర్‌లో కాల్చి చంపిందెవరు? భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ 17. 1922-24 సంవత్సరాల్లో రంప విప్లవం (లేదా) మన్నెం పోరాటం ఎవరి నాయకత్వంలో జరిగింది? అల్లూరి సీతారామరాజు 18. శాసనోల్లంఘన ఉద్యమకాలంలో 1930లో గాంధీజీ దండియాత్రను ఎక్కడ నుంచి ప్రారంభించారు? సబర్మతీ ఆశ్రమం 19. ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ భారత జాతీయ సైన్యాన్ని ఎవరు స్థాపించారు? సుభాష్ చంద్రబోస్ 20. భారత స్వాతంత్య్ర సమితి (లేదా) ‘ఇండియన్ ఇండిపెండెన్స లీగ్’కి మొదటి అధ్యక్షుడెవరు? రాస్బిహారీ బోస్ 21. ‘ఛలో ఢిల్లీ’ అనే నినాదాన్ని ఎవరు అందించారు? సుభాష్ చంద్రబోస్ 22. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడినప్పుడు దాని కార్యస్థానం ఎక్కడ ఉండేది? విజయవాడ 23. ఆంధ్ర రాష్ర్టం ఏర్పడినప్పుడు హైకోర్టును ఎక్కడ నెలకొల్పారు? గుంటూరు 24. భారతదేశపు మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని పుణేలో ఎవరు ప్రారంభించారు? పండిత రమాబాయి 25. భారతదేశంలో రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? డల్హౌసీ 26. ఛత్రపతి శివాజీ నౌకాబల స్థావరం ఏది? సాల్సెట్ట్ 27. ‘బృహత్సంహిత’ గ్రంథకర్త? వరాహమిహిరుడు 28. భారతదేశంలో పాశ్చాత్య విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టడంలో బాధ్యత వహించింది? 1813 చార్టర్ చట్టం 29. ‘అభిలాషితార్థ చింతామణి’ గ్రంథకర్త? చాళుక్య సోమేశ్వరుడు 30. మౌర్యుల కాలంనాటి పట్టణ పరిపాలనా విధానం గురించి తెలియజేసే ప్రధాన ఆధారం? మెగస్తనీస్ ఇండికా 31. ‘పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా’ (ౌ్కఠ్ఛిట్టడ ్చఛీ ్ఖఆటజ్టీజీటజి ఖఠ్ఛ జీ ఐఛీజ్చీ) రచయిత ఎవరు? దాదాబాయి నౌరోజీ 32. ‘భారత జాతీయ కాంగ్రెస్’కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు ఎవరు? పి. ఆనందాచార్యులు. (1891లో) 33. ‘ది ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్’ను ఎవరు స్థాపించారు? సర్ విలియం జోన్స 34. 1857లో తిరుగుబాటును ‘ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం’గా అభివర్ణించిందెవరు? వి.డి. సావార్కర్ 35. ‘ఆంధ్రాలో మొట్టమొదటి’ బాలికల పాఠశాలను ఎక్కడ నెలకొల్పారు? ధవళేశ్వరంలో 36. ‘ఆత్మ గౌరవ సభ’ను ఎవరు స్థాపించారు? పెరియార్ రామస్వామి నాయకర్ 37. ‘గాంధారశిల్పకళారీతి’ ఏ రాజు పోషణలో ఎక్కువగా అభివృద్ధి చెందింది? కనిష్కుడు 38. సుప్రసిద్ధ నాగర వాస్తురీతికి చెందిన లింగరాజ దేవాలయం ఏ రాష్ర్టంలో ఉంది? ఒడిశా 39. ‘పంజాబ్ కేసరి’గా ప్రసిద్ధి చెందినవారెవరు? లాలా లజపతిరాయ్ 40. వందేమాతరం ఉద్యమంలో భాగంగా బిపిన్ చంద్ర పాల్ పర్యటనలను ఆంధ్రదేశంలో ఎవరు ఏర్పాటు చేశారు? ముట్నూరి కృష్ణారావు 41. 1907లో రాజమండ్రిలో ‘బాలభారతి సమితి’ వ్యవస్థాపకులెవరు? చిలుకూరి వీరభద్రరావు 42. ‘భరత ఖండంబు చక్కని పాడియావు’ అనే గేయాన్ని చిలకమర్తి లక్ష్మీనరసింహం ఏ ఉద్యమం కాలంలో రచించాడు? వందేమాతరం ఉద్యమం 43. ‘ద మదర్’ రచయిత ఎవరు? మాక్సిమ్ గోర్కీ 44. ‘రౌలత్ చట్టానికి’ వ్యతిరేకంగా గాంధీజీ సత్యాగ్రహం చేపట్టినప్పుడు ఏ దురంతం జరిగింది? జలియన్ వాలాబాగ్ 45. బహమనీ - విజయనగర రాజ్యాలు తరచుగా ఏ ప్రాంతం కోసం కీచులాడేవి? రాయచూరు, అంతర్వేది 46. ఔరంగజేబు గోల్కొండ కోటను ఏ సంవత్సరంలో జయించాడు? 1687లో 47. పీష్వా పదవిని వారసత్వ హక్కుగా చేసినవాడు? మొదటి బాజీరావు 48. ‘ఆంధ్ర శివాజీ’గా పేరు పొందినవారు? పర్వతనేని వీరయ్య చౌదరి 49. ‘ఫార్వర్డ బ్లాక్’ను నెలకొల్పినవారు? సుభాష్ చంద్రబోస్ 50. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘వందేమాతరం’ ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1938లో 51. హర్షవర్థనుని ఓడించిన చాళుక్యరాజు? రెండో పులకేశిన్ 52. చోళుల గ్రామ పరిపాలన గురించి వివరించే ఉత్తర మేరూర శాసనాన్ని వేయించింది ఎవరు? మొదటి పరాంతక చోళుడు 53. హైడాస్పస్ యుద్ధంలో అలెగ్జాండర్‌ను ఎదుర్కొన్న వీరుడెవరు? పోరస్ 54. ‘ది క్రిసెంట్’ అనే పత్రికను ప్రారంభించిందిఎవరు? గాజుల లక్ష్మీ నరసుచెట్టి -
‘భారత జాతీయ కాంగ్రెస్ పిత’ ఎవరు?
ఫారెస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ భారతదేశ చరిత్ర 1. హరప్పా ప్రజలు ఆరాధించిన దేవతలు ఎవరు? పశుపతి, అమ్మతల్లి 2. నవీన శిలాయుగానికి చెందిన లక్షణానికి ఉదాహరణ? ఆహార ఉత్పత్తి, కుండల తయారీ 3. హరప్పా ప్రజలు తమ ఇళ్ల నిర్మాణానికి వేటిని విరివిగా వాడారు? ఇటుకలు 4. సమాజాన్ని చాతుర్వర్ణ వ్యవస్థ (నాలుగు వర్ణాలు)గా విభజించినట్లు దేంట్లో పేర్కొన్నారు? రుగ్వేదంలోని పురుషసూక్తం 5. ‘కంఠక శోధన’ దేనికి సంబంధించింది? న్యాయవ్యవస్థ 6. సముద్రగుప్తుని అలహాబాదు స్తంభ శాసనాన్ని ఎవరు రచించారు? హరిసేనుడు 7. ఎర్ర కోట (ఢిల్లీ)లోని మయూర (నెమలి) సింహాసనాన్ని ఎవరు చేజిక్కించుకున్నారు? నాదిర్ షా 8. బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? 1905 9. ‘చౌరీ చౌరా’ సంఘటన ప్రాముఖ్యం ఏమిటి? గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేశారు. 10. ఆంధ్ర దేశ చరిత్రలో ‘పద్మనాభ యుద్ధం’ ఎప్పుడు జరిగింది? క్రీ.శ. 1794 11. చీరాల - పేరాల ఉద్యమం సందర్భంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నెలకొల్పిన గ్రామం పేరు? రామ్‌నగర్ 12. రాణా ప్రతాప్, అక్బర్ మధ్య యుద్ధం ఎక్కడ జరిగింది? హల్దీఘాట్ 13. ‘దేశభక్త’గా పేరు పొందిన తెలుగువారెవరు? కొండా వెంకటప్పయ్య 14. ‘శ్రీ భాగ్ ఒప్పందం’ఎవరి మధ్య జరిగింది? ఆంధ్ర - రాయలసీమ ప్రాంతాల నాయకుల మధ్య 15. ‘చైతన్య చరితామృతం’ గ్రంథ రచయిత? కృష్ణదాస్ కవిరాజ్ 16. ‘రామాయణం గ్రంథాన్ని’ పారశీక భాషలోకి అనువదించినవారు ఎవరు? బదౌనీ 17. సింధు నాగరికతకు సంబంధించిన మహా స్నానఘట్టం, పెద్ద ధాన్యాగార భవనం ఎక్కడ బయటపడ్డాయి? మొహంజోదారో పట్టణంలో (సింధు నది ఒడ్డున) 18. ‘హరప్పా’ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? రావీ నది 19. ‘సింధు నాగరికత’ ఏ యుగానికి చెందింది? ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉన్నతస్థితిలో విలసిల్లింది? కాంస్య యుగం. క్రీ.పూ. 2500 నుంచి క్రీ.పూ 1750 వరకు పరిఢవిల్లింది. 20. క్రీ.శ.7వ శతాబ్దంలో ఏ విదేశీ యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు? ఇత్సింగ్ 21. ఆంధ్రదేశంలో ‘బేతంచర్ల’ దేనికి ప్రసిద్ధి? ప్రాక్ చరిత్రనాటి గుహలు 22. ‘సంగీత రత్నాకర’ గ్రంథ రచయిత? సారంగదేవుడు 23. పాలవంశ స్థాపకుడు ఎవరు? గోపాలుడు 24. ‘విక్రమశిల’ విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు? ధర్మపాలుడు 25. ‘దేవదాసీ’ అంటే అర్థం ఏమిటి? దేవుడికి అంకితమైన స్త్రీ 26. ‘గంగాదేవి’ రచించిన ‘మధురా విజయం’ ఏ అంశాన్ని వర్ణిస్తుంది? కంపన మధురను జయించడం 27. ఏ విజయనగర రాజు చైనా దేశానికి రాయబారిని పంపాడు? మొదటి బుక్కరాయలు 28. ‘శారదా చట్టం’ దేనికి సంబంధించింది? బాల్య వివాహం 29. భారతదేశంలో మొదటిసారిగా ‘లేబర్’ ఉద్యమాన్ని నడిపిందెవరు? ఎన్.ఎమ్. లోఖండీ 30. భారతదేశంలో మొదటి ‘జాతీయ వార్తా’ సంస్థ ఏది? ది ఫ్రీ ప్రెస్ ఆఫ్ ఇండియా 31. ‘రాధాస్వామి సత్సంగ్’ను 1861లో ఆగ్రా లో ఎవరు స్థాపించారు? తులసీరామ్ 32. ‘దయాభాగ’ రచయిత ఎవరు? జీమూత వాహనుడు 33. మహాభారతానికి మొదట ఉన్న పేరు? జయ 34. ‘లోథాల్’ దేనికి సంబంధించింది? సింధు నాగరికత 35. గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందిన పురాతన శాస్త్ర వైద్యుడెవరు? సుశ్రుతుడు 36. 1866లో ‘భారత బ్రహ్మసమాజం’ అనే నూతన సమాజాన్ని ఎవరు స్థాపించారు? కేశవ చంద్రసేన్ 37. 1856 నాటి ‘హిందూ వితంతు పునర్వివాహ’ చట్టం ఏ సంఘసంస్కర్త కృషి ఫలితంగా వచ్చింది? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ 38. రామకృష్ణ మిషన్‌ను 1897లో ఎవరు ఏర్పాటు చేశారు? స్వామి వివేకానంద 39. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడెవరు? జె.బి. కృపలానీ 40. ‘ది నాయర్ సర్వీస్ సొసైటీ’ని ఎవరు స్థాపించారు? ఎం. పద్మనాభ పిళ్లై 41. ‘భారత జాతీయ కాంగ్రెస్ పిత’ ఎవరు? ఎ.ఒ. హ్యూమ్ 42. ‘ప్రపంచ మతాల సమావేశం-1894’లో భారత్ తరఫున వివేకానందుడు ఎక్కడ ప్రసంగించాడు? చికాగో (అమెరికా) 43. రైతుల దీన పరిస్థితిని వివరించే ‘నీలి దర్పణ్’ నాటక రచయిత ఎవరు? దీనబంధుమిత్ర 44. ‘విజయమో లేదా మరణమో’ అనే నినాదాన్ని గాంధీజీ ఏ ఉద్యమం సందర్భంగా ప్రకటించారు? క్విట్ ఇండియా ఉద్యమం - 1942 45. ఆధునిక భారతదేశ సంఘ సంస్కరణ పితామహుడిగా ఎవరు గుర్తింపు పొందారు? రాజా రామ్మోహన్రాయ్ 46. 1815లో కలకత్తాలో ‘ఆత్మీయ సభ’ను ఎవరు ఏర్పాటు చేశారు? రాజా రామ్మోహన్రాయ్ 47. 1828 నాటి ‘బ్రహ్మసమాజం’ ప్రధాన ఉద్దేశం ఏమిటి? హిందూ మతాన్ని శుద్ధి చేయడానికి ‘ఏకేశ్వరో పాసనను’ ప్రోత్సహించడం 48. బెంగాల్ యువ హేతువాదుల ‘రాడికల్ ఉద్యమం’ నాయకుడెవరు? హెన్రీ డిరోజియో 49. భారతదేశంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతా న్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? డల్హౌసీ 50. 1917-18లో నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా ‘చంపారన్ రైతుల ఉద్యమం’ ఎక్కడ జరిగింది? దానికి ఎవరు నాయకత్వం వహించారు? బీహార్. గాంధీజీ నాయకత్వం వహించారు. 51. 1918 నాటి ఖైరా రైతు ఉద్యమం ఎవరి నాయకత్వంలో, ఎక్కడ జరిగింది? వల్లభాయ్ పటేల్, గాంధీజీ. గుజరాత్లో. 52. వల్లభాయ్ పటేల్‌కు ‘సర్దార్’ అనే బిరుదు ఏ సత్యాగ్రహం సందర్భంగా వచ్చింది? బార్డోలి సత్యాగ్రహం (1928) 53. ‘ఆంధ్రా ప్రొవిన్సియల్ రైతు అసోసియే షన్’ను 1928లో ఎవరు ప్రారంభించారు? ఎన్.జి. రంగా, బి.వి. రత్నం 54. 1936 నాటి అఖిల భారత కిసాన్ సభకు మొదటి అధ్యక్షుడెవరు? స్వామి సహజానంద 55. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? వెల్లస్లీ 56. ‘సైన్య సహకార పద్ధతి’ని అంగీకరించిన మొదటి రాజ్యం ఏది? హైదరాబాద్ సంస్థానం 57. ‘ఆర్కాట్ వీరుడు’ అని ఎవరిని పేర్కొంటారు? రాబర్ట క్లైవ్ 58. ‘శాశ్వత భూమిశిస్తు’ నిర్ణయ పద్ధతిని ప్రవేశ పెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? కారన్ వాలీస్ 59. ఆంగ్లేయులు 1641లో ‘సెయింట్ జార్జి’ కోటను ఎక్కడ నిర్మించారు? మద్రాసు 60. పోర్చుగీసువారు ఏ బ్రిటిష్ రాజుకు బొంబాయిని కట్నంగా ఇచ్చారు? రెండో చార్లెస్ 61. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసినవారెవరు? రాబర్ట క్లైవ్ 62. విజయనగర సామ్రాజ్య రెండో రాజధాని ఏది? పెనుగొండ 63. కాకతీయుల కాలంలో ‘మోటుపల్లి’ రేవును సందర్శించిన విదేశీ యాత్రికుడు? మార్కోపోలో 64. ఏ వైశ్రాయ్ కాలంలో ఇంపీరియల్ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు? రెండో లార్డ హార్డింజ్ (1911లో) 65. భారతదేశ జాతీయ చిహ్నాన్ని అశోకుని శిలా స్తంభం నుంచి గ్రహించారు. ఇది ఎక్కడ లభించింది? సారనాథ్ 66. కళింగ యుద్ధాన్ని వర్ణించిన అశోకుని 13వ శిలాశాసనం ఎక్కడ ఉంది? జౌగడ 67. సూర్య - చంద్ర వంశరాజుల చరిత్రను ఏవి వివరిస్తాయి? పురాణాలు 68. ఆంగ్లేయులు ఆంధ్రదేశంలో మొదటగా స్థాపించిన వర్తక స్థావరం ఏది? మచిలీపట్నం 69. 1921లో ఆంధ్రదేశంలో మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? దాని అధ్యక్షుడెవరు? విజయవాడలో, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 70. 1885 నుంచి 1905 వరకు భారత జాతీయ మితవాద యుగానికి నాయకత్వం ఎవరు వహించారు? గోపాలకృష్ణ గోఖలే 71. 1905 నుంచి 1915 వరకు జరిగిన జాతీయ ఉద్యమంలో ‘అతివాదులు’గా పేరు పొందినవారెవరు? లాలా లజపతిరాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ 72. ‘యుగాంతర్’ పత్రిక స్థాపకుడెవరు? అరవింద ఘోష్ 73. ‘గీతా రహస్యం’ గ్రంథకర్త ఎవరు? బాల గంగాధర్ తిలక్ 74. ‘శకారి’ అనే బిరుదు ఉన్న గుప్తరాజు ఎవరు? రెండో చంద్రగుప్తుడు 75. ‘సిపాయిల తిరుగుబాటు’ ఎక్కడ ప్రారంభమైంది? 1857 మీరట్‌లో 76. డల్హౌసీ దత్తత స్వీకారం (లేదా) రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ రాజ్యంలో విలీనం అయిన మొదటి స్వదేశీ సంస్థానం ఏది? సతారా 77. పురోహితులు లేకుండా వివాహం చేసుకునే విధానాన్ని ఎవరు ప్రచారం చేశారు? ఇ.వి. రామస్వామి నాయకర్ 78. 1883లో ‘ఇల్బర్ట బిల్లు’ను ఏ వైశ్రాయ్ ప్రవేశపెట్టారు? లార్డ రిప్పన్ 79. 1884 నాటి ‘మద్రాస్ మహాజన సభ’ వ్యవస్థాపకులెవరు? జి.ఎస్. అయ్యర్, వీర రాఘవాచారి, పి. ఆనందాచార్యులు 80. ‘సైమన్ కమిషన్’ భారతదేశంలో ఏ సంవత్సరంలో పర్యటించింది? 1928లో 81. భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం మొదట ఎక్కడ జరిగింది? కాకినాడలో 82. ఈస్టిండియా కంపెనీ పరిపాలన రద్దుకు విక్టోరియా రాణి ఎప్పుడు ప్రకటన జారీ చేసింది? 1858లో 83. జాతీయ విద్యాభివృద్ధి కోసం అనిబీసెంట్ జాతీయ కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు? మదనపల్లిలో 84. ‘అవేక్ మదర్’ అనే గీతాన్ని ఎవరు రచించారు? సరోజినీనాయుడు 85. బాల కార్మికుల రక్షణకు మొదటిసారిగా ఫ్యాక్టరీ చట్టాన్ని ఎవరు ప్రవేశ పెట్టారు? 1881లో లార్డ రిప్పన్ 86. ‘ముద్రా రాక్షస’ గ్రంథ రచయిత ఎవరు? విశాఖ దత్తుడు 87. ‘అమిత్రఘాత్ర శత్రువులను నిర్మూలించిన వాడు’ అని ఎవరిని పేర్కొంటారు? బిందుసారుడు 88. మొదటి సంగమ సాహిత్య సదస్సుకు అధ్యక్షుడెవరు? అగస్త్యుడు 89. ‘శిలప్పాధికారం’ గ్రంథ రచయిత ఎవరు? ఇలాంగో అడిగళ్ 90. తొల్కాప్పియార్ రచించిన ‘తొల్కప్పీయం’ ఏ అంశాన్ని ప్రస్తావిస్తుంది? వ్యాకరణం -
ఆగ్రా అంధకవిగా ప్రసిద్ధులైనవారెవరు?
భారతదేశ చరిత్ర 1. ఏ సిక్కు గురువు ఔరంగజేబు చేతిలో హత్యకు గురయ్యాడు? తేజ్ బహదూర్ 2. అక్బర్ ప్రవేశపెట్టిన నూతన మతం ‘దిన్ - ఇ - ఇలాహీ’ అంటే అర్థం ఏమిటి? భగవంతుడు ఒక్కడే 3. జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన మొదటి ఆంగ్లేయుడు? హాకిన్స 4. మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన మొదటి మొగల్ సుల్తాన్? జహంగీర్ 5. ‘కుతుబ్మీనార్’ నిర్మాత? ఇల్-టుట్-మిష్ 6. ‘భగవద్గీతను’ పారశీక భాషలోకి ఎవరు అనువదించారు? దారాషికో 7. మరాఠ పరిపాలనలో ‘చౌత్’ దేన్ని వివరిస్తుంది? భూమి శిస్తు వాటా 1/4 వ వంతు 8. ‘వాస్కోడిగామా’ ఎవరు? పోర్చుగీస్ నావికుడు 9. అక్బర్ కాలంలో ‘మహాభారతాన్ని’ పారశీక భాషలోకి ఏ పేరుతో అనువదించారు? ‘రజమ్ నామా’ 10. ‘జిమ్మీలు’ అంటే ఎవరు? జిజియా పన్నుకట్టి, రక్షణ పొందిన హిందువులు 11. పంచారాత్ర క్రతువు ఏ మతశాఖకు చెందింది? వైష్ణవ మతం (విష్ణువే సృష్టికి మూల పురుషుడని చెబుతారు) 12. మధురైలోని ‘మీనాక్షి’ దేవాలయాన్ని ఏ రాజులు నిర్మించారు? పాండ్యరాజులు 13. ‘స్థల మాహాత్మ్యం’ అంటే ఏమిటి? దేవాలయాల్లో దేవతల గురించి వివరించే స్థానిక కథనాలు 14. కేరళ మలబార్ తీరం ‘కాలడి’ గ్రామంలో జన్మించిన శంకరాచార్యులు భారతదేశంలో నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు? అవి ఏవి? 1. బదరీనాథ్ (హిమాలయ ప్రాంతం) 2. ద్వారకా (గుజరాత్) 3. పూరి (ఒరిస్సా) 4. శృంగేరి (కర్ణాటక) 15. ఇస్లాం మత స్థాపకుడు ఎవరు? మహమ్మద్ 16. గుజరాత్లో ప్రఖ్యాతి గాంచిన సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసిన రాజు? మహ్మద్ గజినీ (1025 - 26) 17. ‘రస గంగాధరం’, ‘గంగాలహరి’ లాంటి కావ్యాల రచయిత? పండిత జగన్నాథ రాయలు 18. ముస్లిమేతరులపై సుల్తానులు విధించిన ‘జిజియా’ పన్నును రద్దు చేసిన మొగలు చక్రవర్తి? అక్బర్ 19. మొగలుల రాజధానిని ‘ఆగ్రా’ నుంచి ఢిల్లీకి మార్చిన సుల్తాన్? షాజహాన్ 20. అక్బర్ ప్రవేశపెట్టిన ‘మున్సబ్‌దారీ’ వ్యవస్థ దేనికి సంబంధించింది? సైనిక, పౌర పరిపాలనా వ్యవస్థ 21. ‘సిక్కు మత’ స్థాపకుడు ఎవరు? గురునానక్ 22. ‘ఆది గ్రంథ్’ లేదా ‘గ్రంథ సాహెబ్’ను ఎవరు సంకలనం చేశారు? గురు అర్జున్‌దాస్ 23. భారతదేశంలో పోర్చుగీసుల మొదటి రాజధాని ఏది? కొచ్చిన్ 24. ‘తాజ్‌మహల్’ వాస్తు రూపకర్త ఎవరు? ఉస్తాద్ ఈసా 25. ‘న్యాయ గంట’ను ఏర్పాటు చేసిన మొగల్ చక్రవర్తి? జహంగీర్ 26. మొగల్ చక్రవర్తుల్లో నిరక్షరాస్యుడు ఎవరు? అక్బర్ 27. భారతదేశంలో పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టిన పంట ఏది? పొగాకు 28. సమర్థ రామదాసు రచించిన గ్రంథం? దాసబోధ 29. {ఫెంచివారి ఆధీనంలో ఉన్న స్థావరాలు? యానాం, చంద్రనాగూర్, కరికాల్ 30. భారతదేశంలో ‘మొగల్ వంశం’ రాజ్యస్థాపనకు దారితీసిన యుద్ధం? మొదటి పానిపట్టు యుద్ధం (1526) 31. భారతదేశంపై ‘నాదిర్ షా’ ఎప్పుడు దండెత్తాడు? 1738 - 39 32. ‘సూరదాస్’ భక్తి పాటలను ఏ భాషలో రచించాడు? హిందీ 33. కృష్ణుడిని ఆరాధించిన భక్తి ఉద్యమకారులు? మీరాబాయి, వల్లభాచార్యులు, చైతన్యుడు 34. ‘పుష్టి మార్గ తాత్విక’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? వల్లభాచార్యుడు 35. ‘శుద్ధాద్వైత’ మత స్థాపకుడు? వల్లభాచార్యుడు 36. బుద్ధుడి జీవితంలో ‘మహాభినిష్ర్కమణం’ అంటే? ఇల్లు వదిలి వెళ్లడం 37. అన్ని కులాలవారిని శిష్యులుగా స్వీకరించే సంప్రదాయాన్ని తొలిసారి ప్రవేశపెట్టిన భక్తి ఉద్యమకారుడు ఎవరు? రామానందుడు 38. ఆగ్రా అంధకవిగా ప్రసిద్ధులైనవారెవరు? సూరదాసు 39. ‘సుర్సాగర్’ గ్రంథ రచయిత? సూరదాసు 40. శివాజీ మత, రాజకీయ గురువు పేరు? సమర్థ రామదాసు 41. ‘జ్ఞానేశ్వరి’ గ్రంథ రచయిత? జ్ఞానదేవుడు (మహారాష్ర్ట) 42. ఢిల్లీలోని ‘కుతుబ్మీనార్’ను నిర్మించిన రాజవంశం ఏదీ? బానిస వంశరాజులు. కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించాడు, ఇల్- టుట్- మిష్ పూర్తి చేశాడు. 43. ఉద్యానవనాల మధ్య గొప్ప కట్టడాలు నిర్మించడం అనే ప్రక్రియను ఏ సుల్తాన్లు ప్రారంభించారు? లోడీ వంశస్థులు 44. ‘ద హిందూ’ ఆంగ్ల వార్తా పత్రికను ఏ సంవత్సరంలో, ఎవరు స్థాపించారు? 1876లో (మద్రాసు) జీఎస్. అయ్యర్, వీర రాఘవాచారి 45. 1947లో ‘ఇమ్రోజ్’ (సూర్యోదయం) అనే పత్రికను నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎవరు నడిపారు? షోయబుల్లాఖాన్ 46. ‘రయ్యత్’ అనే పేరుతో హైదారాబాద్ నుంచి ఉర్దూభాషలో పత్రికను నడిపి వారు? బూర్గుల రామకృష్ణారావు 47. సేవాసదన్, గోదాన్, రంగభూమి రచనలు ఎవరివి? ప్రేమ్‌చంద్ 48. 1857 మార్చి 29న ‘మంగళ్‌పాండే’ ఉదంతం ఎక్కడ జరిగింది? బారక్పూర్లో 49. 1857 నాటి తిరుగుబాటు ఉద్యమంలో ఏ వర్గాలవారు పాల్గొన లేదు? వర్తకులు, విద్యావంతులు, వడ్డీవ్యాపారులు 50. {పాచీన గురుకుల పద్ధతిలో విద్యాబోధన చేయాలనే లక్ష్యంతో గురుకుల వర్గానికి ఎవరు నాయకత్వం వహించారు? స్వామి శ్రద్ధానంద 51. దయానంద ఆంగ్లో వేదిక్ (డీఏవీ) కళాశాల వర్గానికి ఎవరు నాయకత్వం వహించారు? లాలాలజపతి రాయ్, హంసరాజ్ 52. సయ్యద్ అహ్మద్‌ఖాన్‌పై ముస్లిం సంప్రదాయ వాదులు ఏ ఉద్యమం పేరుతో తిరుగుబాటు చేశారు? దియోబంద్ ఉద్యమం 53. ‘పుణే సేవాసదన్’ను ఎవరు ఏర్పాటు చేశారు? రమాబాయి రనడే 54. 1867లో ‘ప్రార్థనా సమాజాన్ని’ ఎవరు ఏర్పాటు చేశారు? ఆత్మారాం పాండురంగ 55. ఆంధ్రదేశంలో ‘బ్రహ్మసమాజం’ మందిరాలు ఎక్కడ ఉన్నాయి? 1) కాకినాడ బ్రహ్మ సమాజ మందిరం 2) దక్కన్ బ్రహ్మ సమాజ మందిరం, హైదరాబాద్ 56. ఆంగ్లేయులపై వీర పాండ్య కట్ట బ్రహ్మణ ఎక్కడి నుంచి తిరుగుబాటు చేశాడు? తిరునల్వేలి 57. ‘దక్కన్ విద్యా సమాజాన్ని’ ఎవరు స్థాపించారు? 1884లో పుణేలో, జి.జి. అగార్కర్ స్థాపించారు 58. వితంతు శరణాలయాన్ని కందుకూరి వీరేశలింగం ఎక్కడ నెలకొల్పారు? రాజమండ్రిలో 59. ‘గులాంగిరి’ సంపాదకుడు? జ్యోతిబా పూలే 60. రామకృష్ణ పరమహంస అసలు పేరు? గంగోధర చటోపాధ్యాయ 61. ‘గోల్కొండ’ పత్రికను స్థాపించినవారు? సురవరం ప్రతాపరెడ్డి 62. 1922లో ‘రంపచోడవరం’ గెరిల్లా యుద్ధం ఎవరి నాయకత్వంలో జరిగింది? అల్లూరి సీతారామరాజు 63. గిరిజనులను ‘ఆదివాసీలు’గా ఎవరు పేర్కొన్నారు? దక్కర్బాబా 64. ‘అమృత బజార్’ పత్రిక స్థాపకుడు? శిశిర్ కుమార్ ఘోష్ (1868లో కలకత్తా నుంచి) 65. ‘పృథ్వీరాజ్ - రసో’ గ్రంథ కర్త ఎవరు? చాంద్ బర్ధాయ్ 66. వాస్తు కళా విశేషాలను తెలియజేసే ‘సమరాంగణ సూత్రధార’ గ్రంథ రచయిత? భోజుడు (పరమార రాజు) 67. ‘కవిరాజమార్గ’ అనే కన్నడ రచన ఎవరిది? అమోఘ వర్షుడు 68. దక్షిణ భారతదేశంలో 1891లో ‘సాంఘిక శుద్ధి’ అనే సంస్థను ఎవరు స్థాపించారు? సర్. రఘుపతి వెంకటరత్నం నాయుడు 69. 1906లో ఆంధ్రాలో కొమర్రాజు లక్ష్మణ రావు ప్రారంభించిన ముద్రణాలయం పేరేమిటి? విజ్ఞాన చంద్రికా మండలి 70. ‘బ్యాక్ టు వేదాస్’నినాదాన్ని ఎవరిచ్చారు? స్వామి దయానంద సరస్వతి 71. దక్షిణ భారతదేశంలో తొలి వితంతు వివాహాన్ని ఎవరు జరిపించారు? కందుకూరి వీరేశలింగం 72. రాజా రామమోహన్‌రాయ్ అభ్యుదయ సంస్కరణలను వ్యతిరేకిస్తూ, ‘ధర్మసభ’ అనే సంస్థను ఎవరు ఏర్పాటు చేశారు? రాధాకాంత్ దేవ్ 73. మహారాష్ర్టలో సామాజిక సంస్కరణలకు, నూతన విద్యా విధానానికి ఆధ్యుడైన ఎవరిని ‘లోక హితవాదిగా’ పిలుస్తారు? గోపాల్ హరి దేశ్‌ముఖ్ 74. 1873లో ‘సత్యశోధక్’ సమాజాన్ని ఎవరు స్థాపించారు? జ్యోతిబా పూలే 75. దివ్యజ్ఞాన సమాజాన్ని ఎవరు స్థాపించారు? మేడమ్ హెచ్.సి. బ్లావట్స్కీ, హెచ్.ఎస్. ఆల్కాట్ న్యూయార్కలో, 1857లో స్థాపించారు. 76. ‘విగ్రహారాధనను’ వ్యతిరేకించిన ‘నిరంకారీ’ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? బాబాదయాళ్ దాస్ 77. ఆర్య సమాజం రెండుగా ఎప్పుడు చీలిపోయింది? 1892. (గురుకులవర్గం, కళాశాల వర్గం) 78. అక్బర్ ఆస్థాన చరిత్రకారుడు ఎవరు? అబుల్ ఫజల్ 79. మొగల్ చక్రవర్తి ‘షాజహాన్’ చరిత్రను వివరించే ‘పాదుషానామా’ రచయిత? అబుల్ హమీద్ లాహోరి 80. ‘రామచరిత మానస్’గా ప్రసిద్ధిగాంచిన ‘హిందీ రామాయణం’ రచయిత? తులసీదాస్ 81. భూమిశిస్తు వసూలు పద్ధతి ‘బందోబస్తు’ని ఏమని పిలుస్తారు? జప్తు పద్ధతి 82. మొగల్ చక్రవర్తుల చారిత్రక క్రమం? బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు 83. అక్బర్ స్వయంగా రూపొందించిన రెండు రెవెన్యూ శిస్తు పద్ధతులు? జప్తు, దహశల 84. ‘చిన్ - కిలిచ్ -ఖాన్’ ఎవరు? మొగలుల కాలంలో దక్కనులో గవర్నర్ (తరఫీదార్). ఆ తర్వాత అసఫ్-జా- నిజాం - ఉల్ - ముల్క్ అయ్యాడు 85. భక్తి ఉద్యమంలో అతి ప్రధాన అంశం? హిందూ మత పునరుద్ధరణ 86. ‘రాళ్లను పూజిస్తే దేవుడు కనబడితే, నేను కొండనే పూజిస్తాను’ అని అన్నది ఎవరు? కబీర్ 87. ‘భావార్థదీపిక’ రచయిత? రామానుజాచార్యులు 88. ‘సూఫీమతం’ ప్రధాన సందేశం ఏమిటి? సహజీవనం, మానవత ప్రధాన లక్షణం, ముస్లింల ఛాందస వాదాన్ని తిరస్కరించడం 89. ‘ఫిరదౌసీ’ తన ‘షానామా’ కావ్యాన్ని ఎవరి కాలంలో రచించాడు? అది ఎప్పుడు పూర్తయింది? మహ్మద్ గజినీ (ఢిల్లీ సుల్తాన్) క్రీ.శ. 1010లో పూర్తయింది 90. వీరశైవం ఉద్యమ స్థాపకుడు ‘బసవేశ్వరుడు’ ఏ రాజుల వద్ద మంత్రిగా పనిచేశాడు? కాలచూరి రాజులు 91. గుణాఢ్యుడు ‘బృహత్కథను’ ఏ భాషలో రచించాడు? పైశాచి ప్రాకృతభాషలో 92. వలయబద్ధ విధానాన్ని (పాలసీ ఆఫ్ రింగ్ ఫెన్స) అవలంబించిన గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స 93. ‘భారతీయ శిక్షాస్మృతి’ సివిల్, క్రిమినల్ క్రోడీకరణ న్యాయ విషయాల కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో రూపొందించారు? 1833లో లార్డ మెకాలే 94. తొలి రైలుమార్గం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేశారు? బొంబాయి నుంచి థానే వరకు (1853లో) 95. రైత్వారీ భూమిశిస్తు పద్ధతిని మొదట ఎవరు, ఎక్కడ ప్రవేశపెట్టారు? కెప్పెన్ రీడ్. 1792లో సేలం జిల్లాలోని బారామహల్ 96. ‘సావిత్రి’, ‘లైఫ్ డివైన్’ గ్రంథాల రచయిత ? అరవింద్ ఘోష్ 97. ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ గ్రంథకర్త? జవహర్లాల్ నెహ్రూ 98. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదాన్ని ఎవరిచ్చారు? భగత్‌సింగ్ 99. 1947 ఆగస్టు నాటికి భారతదేశంలో విలీ నం కాని సంస్థానాలు ఏవి? హైదరాబాద్, కాశ్మీర్, జునాఘడ్ 100. భారతదేశ స్వాతంత్య్రం అనంతరం పోర్చగీస్ వారు ఏ ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయించారు? గోవా, డయ్యూ, డామన్ 101. ‘విజయ విలాసం’ గ్రంథ రచయిత? చేమకూర వెంకటకవి 102. ‘గీతాభాష్యం’ రచించిన మతాచార్యుడు? మధ్వాచార్యుడు 103. ‘ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని ఎవరు నిర్మించారు? తూర్పు చాళుక్యరాజు చాళుక్య భీముడు 104. చోళుల కాలంలో ‘వర్తక శ్రేణులను’ ఏమని పిలిచేవారు? మణిగ్రామాలు 105. కన్నడ సాహిత్యంలో ‘రత్నత్రయంగా’ ఎవరిని పేర్కొంటారు? పంపడు, పొన్నడు, రణ్ణడు 106. ‘రాజస్థాన్ కథావళి’ గ్రంథ రచయిత? కర్నల్ టాడ్ -
అతిపురాతన బౌద్ధ స్థూపం ఎక్కడ ఉంది?
1. తొలివేద కాలంలో గ్రామానికి నాయకుడు ఎవరు? గ్రామణి 2. వేదకాలపు ప్రజలకు తెలియని జంతువు? పులి 3. ‘బ్రాహ్మణాలు’ అంటే ఏమిటి? యజ్ఞాలు, యాగాలు గురించి వివరించే గ్రంథాలు 4. రుగ్వేద కాలం నాటి ఆర్యులు? చదవలేరు, రాయలేరు 5. బాలగంగాధర్ తిలక్ అభిప్రాయం ప్రకారం ఆర్యుల జన్మభూమి? ఆర్కిటిక్ ప్రాంతం 6. ‘ఆర్కిటిక్ హోం ఆఫ్ ద ఆర్యన్స’ అనే గ్రంథ రచయిత ఎవరు? బాలగంగాధర్ తిలక్ 7. ‘ఆంధ్ర’ అనే ‘పదం’ మొదట ఏ బ్రాహ్మణ్యంలో కనపడుతుంది? ఐతరేయ బ్రాహ్మణం 8. ‘లోకాయత’ వాదాన్ని ప్రచారం చేసిన వారు? చార్వాకుడు 9. సూర్య - చంద్రవంశ రాజుల చరిత్రను ఏవి వివరిస్తాయి? పురాణాలు 10. రుగ్వేద కాలంలో ఆర్యులు ఎక్కడ నివసించారు? సప్తసింధు ప్రాంతం 11. ‘తొలి వేదయుగం’ ఏ కాలానికి చెందింది? క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 1000 సంవత్సరాలు 12. ‘మలివేదయుగం’ ఏ కాలానికి చెందింది? క్రీ..పూ. 1000 - క్రీ.పూ. 600 13. మలివేదకాలంలో ఆర్యుల ఆరాధ్య దైవం ఎవరు? త్రిమూర్తులు 14. పండితులైన బ్రాహ్మణులకు ఇచ్చిన పన్నులేని గ్రామాలను ప్రాచీన భారతదేశంలో ఏమని పిలిచేవారు? అగ్రహారాలు 15. మౌర్య రాజ్యవంశాన్ని స్థాపించిన వారు? చంద్రగుప్త మౌర్యుడు 16. ‘తొలి తెలుగు శాసనం’ ఎవరి కాలంలో వేశారు? రేనాటి చోళులు 17. ఆంధ్రప్రదేశ్‌లో అతి ప్రాచీన శివలింగం ఎక్కడ ఉంది? గుడిమల్లం 18. ‘వీరపురుషదత్తుడు’ ఏ రాజవంశానికి చెందినవాడు? ఇక్ష్వాకులు 19. ‘ప్రతీక్ష సముత్పాదన’ సిద్ధాంత కర్త ఎవరు? గౌతమ బుద్ధుడు 20. ‘సల్లేఖనం’ ఏ మతానికి చెందింది? జైనమతం 21. ఆంధ్రప్రదేశ్‌లోని ‘బేతంచర్ల’ దేనికి ప్రసిద్ధి? ప్రాక్ చరిత్ర నాటి గుహలు 22. మొదటి జైన తీర్థంకరుడి పేరు? రుషభనాథుడు 23. మహాభారతాన్ని తెలుగు భాషలోకి అనువదించిన తొలి కవి ఎవరు? నన్నయభట్టు 24. గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందిన పురాతన శస్త్ర వైద్యుడు? శుశ్రుతుడు 25. ‘అమరావతి’ దేనికి ప్రసిద్ధి? బౌద్ధ శిల్పం 26. ‘నాగముచులిందుడు’ ఏ మతానికి చెందినవాడు? బౌద్ధమతానికి 27. బౌద్ధుల పవిత్ర గ్రంథాలను ఏమని పిలుస్తారు? త్రిపీఠకాలు 28. మగధ సామ్రాజ్యం తొలి రాజధాని? రాజగృహం 29. ‘మహాభాష్య’ గ్రంథాన్ని ఎవరు రచించారు? పతంజలి 30. అశోకుడి ‘కళింగ దండయాత్రను’ గురించి ఏ శిలాశాసనం విశదీకరిస్తుంది? 13వ శిలాశాసనం 31. ‘అశోకుడి శిలాశాసనాలు’ ఆంధ్రదేశంలో ఎక్కడ లభ్యమయ్యాయి? ఎర్రగుడి, రాజులమందగిరి, గుంటుపల్లి 32. బౌద్ధమతంలో ‘మాధ్యమిక వాదాన్ని’ ప్రతిపాదించిన వారు? ఆచార్య నాగార్జునుడు 33. భారతదేశంలో అతిపురాతన బౌద్ధ స్థూపం ఎక్కడ ఉంది? సారనాథ్ 34. సంస్కృతభాషలో తొలి శాసనం వేయించిన విదేశీ రాజు? మొదటి రుద్రదమనుడు 35. అత్యంత ప్రాచీన మతశాఖ? శైవం 36. ‘దక్షిణా పథపతి’ అనే బిరుదు ఉన్న రాజు? మొదటి శాతకర్ణి 37. భారతదేశంలో తొలిసారి బంగారు నాణేలను ముద్రించిన వారు? ఇండోగ్రీకులు 38. శాతవాహన రాజైన ‘హాలుడు’ ‘గాథాసప్తశతి’ గ్రంథాన్ని ఏ భాషలో రచించాడు? ప్రాకృతం 39. ‘ఖారవేలుడు’ ఏ వంశానికి చెందిన రాజు? ఛేదివంశం 40. గుప్తుల యుగానికి చెందిన సముద్రగుప్తుడి అలహాబాదు స్తంభ శాసనం ప్రశస్తి రచయిత ఎవరు? హరిసేనుడు 41. గుప్తుల కాలం నాటి శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? సంస్కృతం 42. ‘కథా సరిత్సాగరం’ గ్రంథ రచయిత? సోమదేవుడు 43. ‘మహాకవి కాళిదాసు’ ఏ గుప్త చక్రవర్తి ఆస్థానంలో ఉండేవాడు? రెండో చంద్రగుప్తుడు 44. ‘బృహత్ సంహిత’ గ్రంథకర్త? వరాహమిిహీరుడు 45. హర్షుడు రచించిన గ్రంథాలు? రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక 46. హర్షుడి కాలంలో ఏ చైనా యాత్రికుడు భారతదేశం సందర్శించాడు? హ్యూయాన్‌త్సాంగ్ 47. గుప్తుల కాలంలో విఖ్యాతుడైన జ్యోతిష్య శాస్త్రవేత్త? వరాహమిిహీరుడు 48. అజాత శత్రువు నిర్మించిన నగరం? పాటలీపుత్రం 49. ‘దేవీచంద్రగుప్త’ రచయిత ఎవరు? విశాఖదత్తుడు 50. భారతదేశంలో మొగలు వంశస్థాపకుడు? బాబర్ 51. బాబరు తన ‘తుజుక్-ఇ-బాబరీ’ (బాబరు జ్ఞాపకాలు) గ్రంథాన్ని ఏ భాషలో రచించాడు? టర్కిష్ భాషలో 52. భారతదేశంలో ‘రైత్వారీ’ విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి పాలకుడు? షేర్షా సూరి 53. ‘పరగణాలు’ అంటే ఏమిటి? వందల గ్రామాల సముదాయం 54. ‘రుపియా’ (రూపాయి) అనే నాణేన్ని ఎవరు ప్రవేశపెట్టారు? షేర్షాసూరి 55. ఆంధ్రదేశానికి చెందిన జగన్నాథ పండితరాయలు ఏ మొగలు చక్రవర్తి ఆస్థానంలో ఉండేవాడు? షాజహాన్ 56. మొగలు చక్రవర్తులను చారిత్రక క్రమంలో రాయండి? బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబు 57. జహాంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన మొదటి ఆంగ్లేయుడు ఎవరు? హాకిన్స 58. అక్బర్ - హేమూల మధ్య జరిగిన యుద్ధం ఏది? ఎప్పుడు జరిగింది? రెండో పానిపట్టు యుద్ధం. క్రీ.శ. 1556లో జరిగింది. 59. ‘మన్సబ్’ పద్ధతిని వివరించండి? మన్సబ్ అంటే హోదా. సైన్యంలో ఒక భాగమైన అశ్విక దళం. దీన్ని అక్బర్ ప్రవేశపెట్టారు. 60. గుప్తుల కాలానికి చెందిన ‘చిత్ర లేఖనాలు’ ఎక్కడ కనిపిస్తాయి? అజంతా గుహలు( 16, 17, 19, 1, 2, గుహల్లో) 61. నలందా విశ్వ విద్యాలయాన్ని ఏ గుప్తరాజు స్థాపించాడు? మొదటి కుమార గుప్తుడు 62. పాచీన భారతీయ భౌతిక శాస్త్ర గ్రంథం ఖందఖ్యాజ్యకం రచయిత? బ్రహ్మగుప్తుడు 63. ‘కవిరాజు’ బిరుదున్న గుప్తరాజు ఎవరు? సముద్రగుప్తుడు 64. కాళిదాసు రచించిన మూడు నాటకాలు పేర్కొనండి? అభిజ్ఞాన శాకుంతలం, మాళివికాగ్ని మిత్రం, విక్రమోర్వశీయం 65. మృచ్ఛకటిక నాటక రచయిత ఎవరు? నాటకంలో నాయక - నాయికల పేర్లు ఏమిటి? శూద్రకుడు. చారుదత్తుడు (నాయకుడు). వసంతసేన (నాయిక). 66. ‘ఆళ్వారులు’ అంటే ఎవరు? వైష్ణవ భక్తులు 67. ఏకశిలా రథాలను పల్లవులు ఎక్కడ నిర్మించారు? మహాబలిపురం 68. ఇస్లాం మతాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టిన వారు? అరబ్బులు 69. విక్రమాంక దేవచరిత్రను ఎవరు రచించారు? బిల్హణుడు 70. సంస్కృత భాషలో ‘మత్తవిలస ప్రహసనం’ను ఏ పల్లవరాజు రచించాడు? మొదటి మహేంద్రవర్మ 71. తూర్పు చాళుక్యుల ప్రథమ రాజధాని? పిఠాపురం (పిష్టపురం) 72. వేములవాడ చాళుక్యుల రాజధాని? బోధన్ 73. సంగీత రత్నాకర గ్రంథ రచయిత? సారంగదేవుడు 74. కోణార్క సూర్య దేవాలయాన్ని నిర్మించిన వారు? తూర్పు గాంగరాజు - మొదటి నరసింహుడు 75. రాష్ర్ట కూట రాజుల్లో ప్రసిద్ధి పొందిన వారు? అమోఘ వర్షుడు 76. ‘మాలతీ మాధవీయం’ గ్రంథ రచయిత? భవభూతి 77. ‘విచిత్ర చిత్తుడు’ బిరుదున్న పల్లవరాజు? మొదటి మహేంద్రవర్మ 78. ‘దేవదాసీ’ అంటే? దేవుడికి అంకితమైన స్త్రీ 79. క్రీ.శ. 8వ శతాబ్దంలో శంకరాచార్యుడు ప్రతిపాదించిన మతశాఖ? అద్వైత సిద్ధాంతం 80. తంజావూరు బృహదీశ్వరాలయం (లేదా) రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించిన వారు? మొదటి రాజేంద్రచోళుడు 81. చోళుల కాలంలో ‘వర్తక సంఘాలను’ ఏమని పిలిచేవారు? మణి గ్రామాలు 82. రామానుజాచార్యుడు ఎక్కడ జన్మిం చాడు? అతడు ప్రతిపాదించిన మత సిద్ధాంతం? తిరుపతి. విశిష్టాద్వైతం 83. మధ్వాచార్యుడు ప్రతిపాదించిన సిద్ధాంతం పేరు? ద్వైతమతం 84. ఆంధ్రదేశ చరిత్రలో ‘పద్మనాభయుద్ధం’ జరిగిన సంవత్సరం? క్రీ.శ. 1794 85. కాకతీయుల కాలంలో మోటుపల్లి రేవును సందర్శించిన విదేశీ యాత్రికుడు? మార్కోపోలో 86. విజయనగర రాజ్యాన్ని పాలించిన చివరి రాజవంశం? ఆరవీటి వంశం 87. ‘యవనరాజ్య స్థాపనాచార్య’ బిరుదున్న రాజు? శ్రీకృష్ణ దేవరాయలు 88. గోల్కోండ కుతుబ్‌షాహీ వంశంలో చివరి రాజు? అబుల్ హసన్ తానీషా 89. విజయనగర రాజ్యాన్ని స్థాపించిన సంగమ సోదరులు మొదట ఏ రాజ్యంలో పనిచేశారు? కాకతీయ రాజ్యంలో 90. బహమనీ రాజ్యాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? క్రీ.శ. 1347లో