అతిపురాతన బౌద్ధ స్థూపం ఎక్కడ ఉంది?
1. తొలివేద కాలంలో గ్రామానికి నాయకుడు ఎవరు?
గ్రామణి
2. వేదకాలపు ప్రజలకు తెలియని జంతువు?
పులి
3. ‘బ్రాహ్మణాలు’ అంటే ఏమిటి?
యజ్ఞాలు, యాగాలు గురించి వివరించే గ్రంథాలు
4. రుగ్వేద కాలం నాటి ఆర్యులు?
చదవలేరు, రాయలేరు
5. బాలగంగాధర్ తిలక్ అభిప్రాయం ప్రకారం ఆర్యుల జన్మభూమి?
ఆర్కిటిక్ ప్రాంతం
6. ‘ఆర్కిటిక్ హోం ఆఫ్ ద ఆర్యన్‌స’ అనే గ్రంథ రచయిత ఎవరు?
బాలగంగాధర్ తిలక్
7. ‘ఆంధ్ర’ అనే ‘పదం’ మొదట ఏ బ్రాహ్మణ్యంలో కనపడుతుంది?
ఐతరేయ బ్రాహ్మణం
8. ‘లోకాయత’ వాదాన్ని ప్రచారం చేసిన వారు?
చార్వాకుడు
9. సూర్య - చంద్రవంశ రాజుల చరిత్రను ఏవి వివరిస్తాయి?
పురాణాలు
10. రుగ్వేద కాలంలో ఆర్యులు ఎక్కడ నివసించారు?
సప్తసింధు ప్రాంతం
11. ‘తొలి వేదయుగం’ ఏ కాలానికి చెందింది?
క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 1000 సంవత్సరాలు
12. ‘మలివేదయుగం’ ఏ కాలానికి చెందింది?
క్రీ..పూ. 1000 - క్రీ.పూ. 600
13. మలివేదకాలంలో ఆర్యుల ఆరాధ్య దైవం ఎవరు?
త్రిమూర్తులు
14. పండితులైన బ్రాహ్మణులకు ఇచ్చిన పన్నులేని గ్రామాలను ప్రాచీన భారతదేశంలో ఏమని పిలిచేవారు?
అగ్రహారాలు
15. మౌర్య రాజ్యవంశాన్ని స్థాపించిన వారు?
చంద్రగుప్త మౌర్యుడు
16. ‘తొలి తెలుగు శాసనం’ ఎవరి కాలంలో వేశారు?
రేనాటి చోళులు
17. ఆంధ్రప్రదేశ్‌లో అతి ప్రాచీన శివలింగం ఎక్కడ ఉంది?
గుడిమల్లం
18. ‘వీరపురుషదత్తుడు’ ఏ రాజవంశానికి చెందినవాడు?
ఇక్ష్వాకులు
19. ‘ప్రతీక్ష సముత్పాదన’ సిద్ధాంత కర్త ఎవరు?
గౌతమ బుద్ధుడు
20. ‘సల్లేఖనం’ ఏ మతానికి చెందింది?
జైనమతం
21. ఆంధ్రప్రదేశ్‌లోని ‘బేతంచర్ల’ దేనికి ప్రసిద్ధి?
ప్రాక్ చరిత్ర నాటి గుహలు
22. మొదటి జైన తీర్థంకరుడి పేరు?
రుషభనాథుడు
23. మహాభారతాన్ని తెలుగు భాషలోకి అనువదించిన తొలి కవి ఎవరు?
నన్నయభట్టు
24. గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందిన పురాతన శస్త్ర వైద్యుడు?
శుశ్రుతుడు
25. ‘అమరావతి’ దేనికి ప్రసిద్ధి?
బౌద్ధ శిల్పం
26. ‘నాగముచులిందుడు’ ఏ మతానికి చెందినవాడు?
బౌద్ధమతానికి
27. బౌద్ధుల పవిత్ర గ్రంథాలను ఏమని పిలుస్తారు?
త్రిపీఠకాలు
28. మగధ సామ్రాజ్యం తొలి రాజధాని?
రాజగృహం
29. ‘మహాభాష్య’ గ్రంథాన్ని ఎవరు రచించారు?
పతంజలి
30. అశోకుడి ‘కళింగ దండయాత్రను’ గురించి ఏ శిలాశాసనం విశదీకరిస్తుంది?
13వ శిలాశాసనం
31. ‘అశోకుడి శిలాశాసనాలు’ ఆంధ్రదేశంలో ఎక్కడ లభ్యమయ్యాయి?
ఎర్రగుడి, రాజులమందగిరి, గుంటుపల్లి
32. బౌద్ధమతంలో ‘మాధ్యమిక వాదాన్ని’ ప్రతిపాదించిన వారు?
ఆచార్య నాగార్జునుడు
33. భారతదేశంలో అతిపురాతన బౌద్ధ స్థూపం ఎక్కడ ఉంది?
సారనాథ్
34. సంస్కృతభాషలో తొలి శాసనం వేయించిన విదేశీ రాజు?
మొదటి రుద్రదమనుడు
35. అత్యంత ప్రాచీన మతశాఖ?
శైవం
36. ‘దక్షిణా పథపతి’ అనే బిరుదు ఉన్న రాజు?
మొదటి శాతకర్ణి
37. భారతదేశంలో తొలిసారి బంగారు నాణేలను ముద్రించిన వారు?
ఇండోగ్రీకులు
38. శాతవాహన రాజైన ‘హాలుడు’ ‘గాథాసప్తశతి’ గ్రంథాన్ని ఏ భాషలో రచించాడు?
ప్రాకృతం
39. ‘ఖారవేలుడు’ ఏ వంశానికి చెందిన రాజు?
ఛేదివంశం
40. గుప్తుల యుగానికి చెందిన సముద్రగుప్తుడి అలహాబాదు స్తంభ శాసనం ప్రశస్తి రచయిత ఎవరు?
హరిసేనుడు
41. గుప్తుల కాలం నాటి శాసనాలు ఏ భాషలో ఉన్నాయి?
సంస్కృతం
42. ‘కథా సరిత్సాగరం’ గ్రంథ రచయిత?
సోమదేవుడు
43. ‘మహాకవి కాళిదాసు’ ఏ గుప్త చక్రవర్తి ఆస్థానంలో ఉండేవాడు?
రెండో చంద్రగుప్తుడు
44. ‘బృహత్ సంహిత’ గ్రంథకర్త?
వరాహమిిహీరుడు
45. హర్షుడు రచించిన గ్రంథాలు?
రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక
46. హర్షుడి కాలంలో ఏ చైనా యాత్రికుడు భారతదేశం సందర్శించాడు?
హ్యూయాన్‌త్సాంగ్
47. గుప్తుల కాలంలో విఖ్యాతుడైన జ్యోతిష్య శాస్త్రవేత్త?
వరాహమిిహీరుడు
48. అజాత శత్రువు నిర్మించిన నగరం?
పాటలీపుత్రం
49. ‘దేవీచంద్రగుప్త’ రచయిత ఎవరు?
విశాఖదత్తుడు
50. భారతదేశంలో మొగలు వంశస్థాపకుడు?
బాబర్
51. బాబరు తన ‘తుజుక్-ఇ-బాబరీ’ (బాబరు జ్ఞాపకాలు) గ్రంథాన్ని ఏ భాషలో రచించాడు?
టర్కిష్ భాషలో
52. భారతదేశంలో ‘రైత్వారీ’ విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి పాలకుడు?
షేర్‌షా సూరి
53. ‘పరగణాలు’ అంటే ఏమిటి?
వందల గ్రామాల సముదాయం
54. ‘రుపియా’ (రూపాయి) అనే నాణేన్ని ఎవరు ప్రవేశపెట్టారు?
షేర్షాసూరి
55. ఆంధ్రదేశానికి చెందిన జగన్నాథ పండితరాయలు ఏ మొగలు చక్రవర్తి ఆస్థానంలో ఉండేవాడు?
షాజహాన్
56. మొగలు చక్రవర్తులను చారిత్రక క్రమంలో రాయండి?
బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబు
57. జహాంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన మొదటి ఆంగ్లేయుడు ఎవరు?
హాకిన్‌స
58. అక్బర్ - హేమూల మధ్య జరిగిన యుద్ధం ఏది? ఎప్పుడు జరిగింది?
రెండో పానిపట్టు యుద్ధం.
క్రీ.శ. 1556లో జరిగింది.
59. ‘మన్సబ్’ పద్ధతిని వివరించండి?
మన్సబ్ అంటే హోదా. సైన్యంలో ఒక భాగమైన అశ్విక దళం.
దీన్ని అక్బర్ ప్రవేశపెట్టారు.
60. గుప్తుల కాలానికి చెందిన ‘చిత్ర లేఖనాలు’ ఎక్కడ కనిపిస్తాయి?
అజంతా గుహలు( 16, 17, 19, 1, 2, గుహల్లో)
61. నలందా విశ్వ విద్యాలయాన్ని ఏ గుప్తరాజు స్థాపించాడు?
మొదటి కుమార గుప్తుడు
62. పాచీన భారతీయ భౌతిక శాస్త్ర గ్రంథం ఖందఖ్యాజ్యకం రచయిత?
బ్రహ్మగుప్తుడు
63. ‘కవిరాజు’ బిరుదున్న గుప్తరాజు ఎవరు?
సముద్రగుప్తుడు
64. కాళిదాసు రచించిన మూడు నాటకాలు పేర్కొనండి?
అభిజ్ఞాన శాకుంతలం, మాళివికాగ్ని మిత్రం, విక్రమోర్వశీయం
65. మృచ్ఛకటిక నాటక రచయిత ఎవరు? నాటకంలో నాయక - నాయికల పేర్లు ఏమిటి?
శూద్రకుడు.
చారుదత్తుడు (నాయకుడు).
వసంతసేన (నాయిక).
66. ‘ఆళ్వారులు’ అంటే ఎవరు?
వైష్ణవ భక్తులు
67. ఏకశిలా రథాలను పల్లవులు ఎక్కడ నిర్మించారు?
మహాబలిపురం
68. ఇస్లాం మతాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టిన వారు?
అరబ్బులు
69. విక్రమాంక దేవచరిత్రను ఎవరు రచించారు?
బిల్హణుడు
70. సంస్కృత భాషలో ‘మత్తవిలస ప్రహసనం’ను ఏ పల్లవరాజు రచించాడు?
మొదటి మహేంద్రవర్మ
71. తూర్పు చాళుక్యుల ప్రథమ రాజధాని?
పిఠాపురం (పిష్టపురం)
72. వేములవాడ చాళుక్యుల రాజధాని?
బోధన్
73. సంగీత రత్నాకర గ్రంథ రచయిత?
సారంగదేవుడు
74. కోణార్‌క సూర్య దేవాలయాన్ని నిర్మించిన వారు?
తూర్పు గాంగరాజు - మొదటి నరసింహుడు
75. రాష్ర్ట కూట రాజుల్లో ప్రసిద్ధి పొందిన వారు?
అమోఘ వర్షుడు
76. ‘మాలతీ మాధవీయం’ గ్రంథ రచయిత?
భవభూతి
77. ‘విచిత్ర చిత్తుడు’ బిరుదున్న పల్లవరాజు?
మొదటి మహేంద్రవర్మ
78. ‘దేవదాసీ’ అంటే?
దేవుడికి అంకితమైన స్త్రీ
79. క్రీ.శ. 8వ శతాబ్దంలో శంకరాచార్యుడు ప్రతిపాదించిన మతశాఖ?
అద్వైత సిద్ధాంతం
80. తంజావూరు బృహదీశ్వరాలయం (లేదా) రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించిన వారు?
మొదటి రాజేంద్రచోళుడు
81. చోళుల కాలంలో ‘వర్తక సంఘాలను’ ఏమని పిలిచేవారు?
మణి గ్రామాలు
82. రామానుజాచార్యుడు ఎక్కడ జన్మిం చాడు? అతడు ప్రతిపాదించిన మత సిద్ధాంతం?
తిరుపతి.
విశిష్టాద్వైతం
83. మధ్వాచార్యుడు ప్రతిపాదించిన సిద్ధాంతం పేరు?
ద్వైతమతం
84. ఆంధ్రదేశ చరిత్రలో ‘పద్మనాభయుద్ధం’ జరిగిన సంవత్సరం?
క్రీ.శ. 1794
85. కాకతీయుల కాలంలో మోటుపల్లి రేవును సందర్శించిన విదేశీ యాత్రికుడు?
మార్కోపోలో
86. విజయనగర రాజ్యాన్ని పాలించిన చివరి రాజవంశం?
ఆరవీటి వంశం
87. ‘యవనరాజ్య స్థాపనాచార్య’ బిరుదున్న రాజు?
శ్రీకృష్ణ దేవరాయలు
88. గోల్కోండ కుతుబ్‌షాహీ వంశంలో చివరి రాజు?
అబుల్ హసన్ తానీషా
89. విజయనగర రాజ్యాన్ని స్థాపించిన సంగమ సోదరులు మొదట ఏ రాజ్యంలో పనిచేశారు?
కాకతీయ రాజ్యంలో
90. బహమనీ రాజ్యాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు?
క్రీ.శ. 1347లో