‘అక్బర్ నామా’ గ్రంథ రచయిత ఎవరు? | who is the author of the 'Akbar Nama', book? | Sakshi
Sakshi News home page

‘అక్బర్ నామా’ గ్రంథ రచయిత ఎవరు?

Published Thu, May 1 2014 10:18 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

‘అక్బర్ నామా’ గ్రంథ రచయిత ఎవరు? - Sakshi

‘అక్బర్ నామా’ గ్రంథ రచయిత ఎవరు?

 భారతదేశ చరిత్ర

 1.    ఉద్యానవనాల రాజు అనే బిరుదు పొందిన వారు?
     బాబర్
 
 2. శ్రీనగర్ ‘షాలీమార్’ ఉద్యానవనాన్ని ఏ మొగల్ చక్రవర్తి నిర్మించాడు?

     జహంగీర్
 
 3.   ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘గోల్‌గుంబజ్’ కట్టడం ఎక్కడ ఉంది?
     బీజాపూర్
 
 4.    ‘బులంద్ దర్వాజా’ ఎక్కడ ఉంది?
     ఫతేపూర్ సిక్రీ
 
 5.    సూరదాస్, బైజు బావ్రా ఏ మొగల్ చక్రవర్తి కాలంలో గొప్ప సంగీత విద్వాంసులుగా పేరు పొందారు?
     అక్బర్
 
 6.    బెంగాల్‌లోని ‘సోనార్‌గావ్’ నుంచి లాహోర్‌ను కలిపే గ్రాండ్ ట్రంక్ రోడ్డును నిర్మించింది ఎవరు?
     షేర్ షా సూరి
 
 7.    భారతదేశంలో ప్రాచీన కట్టడాలు, శిథిలాల అవశేషాల పరిరక్షణ చట్టం చేసిన వైశ్రాయ్ ఎవరు?
     లార్‌‌డ కర్జన్ (1904లో)
 
 8.    భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ?
     సరోజినీనాయుడు
 
 9.    ‘ఆంధ్రమహాసభ’ తొలి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు?
     సురవరం ప్రతాపరెడ్డి
 
 10.    ‘వందేమాతరం’ ఉద్యమ కాలంలో ఆంధ్రా లో స్వరాజ్య పత్రికను స్థాపించినవారు?
     గాడిచర్ల హరిసర్వోత్తమరావు
 
 11.    ‘భారత జాతీయ కాంగ్రెస్’ తొలి ముస్లిం అధ్యక్షుడు ఎవరు?
     బద్రుద్దీన్ త్యాబ్జీ
 
 12.    ‘నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతం త్య్రం తెస్తాను’ అని నినదించినవారు?
     సుభాష్ చంద్రబోస్
 
 13.    ‘అంటరానివారికి కాంగ్రెస్, గాంధీ చేసిందేమిటి’ పుస్తక రచయిత ఎవరు?
     డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
 
 14.    ‘పంచతంత్రం’ గ్రంథాన్ని తెలుగులో ఎవరు రచించారు?
     దూబగుంట నారాయణ కవి
 
 15.    జలియన్‌వాలా బాగ్ దమనకాండకు నిరసనగా బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ‘నైట్‌హుడ్’ బిరుదును తిరస్కరించినవారు?
     రవీంద్రనాథ్ ఠాగూర్
 
 16.    ఆంధ్రదేశంలో డచ్‌వారు ఎక్కడ తమ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు?
     భీమునిపట్నం
 
 17.    ‘సుహృల్లేఖ’ గ్రంథ రచయిత?
     ఆచార్య నాగార్జునుడు
 
 18.    ‘ఏకబ్రాహ్మణ’, ‘ఆగమనిలయ’ అనే బిరుదులను ఆపాదించుకున్న శాతవాహన రాజు?
     గౌతమీపుత్ర శాతకర్ణి
 
 19.    వరంగల్ జిల్లా పాలంపేటలోని ప్రసిద్ధ ‘రామప్ప దేవాలయాన్ని’ ఎవరు నిర్మించారు?
     రేచర్ల రుద్రుడు
 
 20.    1885లో తొలిసారిగా బొంబాయిలో నిర్వ హించిన ‘భారత జాతీయ కాంగ్రెస్’ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
     డబ్ల్యూసీ బెనర్జీ
 
 21.    భారతదేశంలో తొలిసారిగా జనాభా లెక్కల సేకరణను ఏ వైశ్రాయ్ కాలంలో నిర్వహించారు?
     లార్‌‌డ మేయో
 
 22.    ‘పబ్లిక్ సర్వీస్ కమిషన్’ను ఎవరి కాలంలో ఏర్పాటు చేశారు?
     లార్‌‌డ రీడింగ్
 
 23.    పంజాబ్‌లోని అమృతసర్ స్వర్ణ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు?
     గురు అర్జున్
 
 24.    ‘విభజించు, పాలించు’ అనే నినాదం ఇచ్చినవారు?
     మహ్మద్ ఆలీ జిన్నా
 
 25.    ‘కన్నెగంటి హనుమంతు’ ఏ ఉద్యమంలో మరణించాడు?
     పల్నాడు సత్యాగ్రహం
 
 26.    ‘బార్డోలీ సత్యాగ్రహ’ నాయకుడు?
     సర్ధార్ వల్లభాయ్ పటేల్
 
 27.    మహాత్మాగాంధీని ‘భారతజాతి పిత’ అని తొలిసారిగా సంబోధించినవారు?
     సుభాష్ చంద్రబోస్
 
 28.    స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో ఆంధ్రాలో పన్నుల నిరాకరణోద్యమంతో సంబంధం ఉన్న ప్రదేశం ఏది?
     పెదనందిపాడు
 
 29.    ‘హోమ్‌రూల్’ ఉద్యమాన్ని ప్రారంభిం చినవారు?
     అనిబీసెంట్
 
 30.    1947, ఆగస్టు 15 నాటికి భారతదేశానికి గవర్నర్ జనరల్‌గా ఉన్న వ్యక్తి ఎవరు?
     లార్‌‌డ మౌంట్ బాటెన్
 
 31.    ‘సుభాష్ చంద్రబోస్’ జన్మస్థలం ఏది?
     కటక్
 
 32.    ఆంధ్ర దేశంలో 1857 నాటి తిరుగుబాటు ప్రధానంగా ఏయే ప్రాంతాల్లో జరిగింది?
     కడప, కర్నూలు, విశాఖపట్నం
 
 33.    1916లో ‘హోమ్‌రూల్ లీగ్’ను ఎవరు ప్రారంభించారు?
     బాలగంగాధర్ తిలక్
 
 34.    భారతదేశంలో ‘లా కమిషన్’ను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు?
     1833 నాటి చార్టర్ చట్టం
 
 35.    {బిటిష్ ఇండియా ప్రభుత్వంలో తొలి ‘లా’ సభ్యుడు?
     లార్‌‌డ మెకాలె
 
 36.    ‘జలియన్‌వాలా బాగ్’ మారణకాండ ఏ సంవత్సరంలో ఎక్కడ జరిగింది?
     ఏప్రిల్13, 1919లో అమృత్‌సర్(పంజాబ్)
 
 37.    ‘కాంగ్రెస్ సోషలిస్టు’ పార్టీని ఎవరు స్థాపించారు?
     ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాష్ నారాయణ (1934లో)
 
 38.    ‘పోర్టు ఫోలియో’ పద్ధతిని ప్రవేశపెట్టిన వైశ్రాయ్ ఎవరు?
     లార్‌‌డ కానింగ్
 
 39.    భారత కమ్యూనిస్టు పార్టీని ఎప్పుడు స్థాపించారు?
     1925లో
 
 40.    ‘స్వరాజ్యపార్టీ’ని ఎవరు స్థాపించారు?
     దేశబంధు చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ (1922లో)
 
 41.    ‘ఆల్ ఇండియా కిసాన్ సభ’ ఎప్పుడు ప్రారంభమైంది?
     1936లో
 
 42.    ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’ను ఎవరు స్థాపించారు?
     కె.బి. హెడ్గేవార్ (1925 నాగ్‌పూర్‌లో)
 
 43.    ఏ గవర్నర్ జనరల్ కాలంలో సతీసహగమనంపై నిషేధాన్ని విధించారు?
     విలియం బెంటింక్ (1829లో)
 
 44.    గోండు తెగల్లో ‘నరబలి’ ఆచారాన్ని అణచివేసిన గవర్నర్ జనరల్ ఎవరు?
     లార్‌‌డ హార్డింజ్
 
 45.    సైన్య సహకార పద్ధతి రూపకర్త ఎవరు?
     లార్‌‌డ వెల్లస్లీ
 
 46.    రాష్ట్రాల్లో ‘శాసన మండళ్లు’ ఏ చట్టం ద్వారా ఏర్పాటయ్యాయి?
     1861 భారత  శాసనసభల చట్టం
 
 47.    {పాథమిక విద్యను స్థానిక ప్రభుత్వాలు నిర్వహించాలని సూచించిన కమిషన్?
     హంటర్ కమిషన్
 
 48.    ఉత్తర భారతదేశాన్ని జయించిన తొలి రాష్ర్టకూట రాజు?
     ధ్రువుడు
 
 49.    ‘సత్యార్థప్రకాశిక’ గ్రంథ రచయిత?
     దయానంద సరస్వతి
 
 50.    అలీగఢ్ ఉద్యమం స్థాపకుడు?
     సయ్యద్ అహ్మద్‌ఖాన్ (1886లో)
 
 51.    ‘సీపీ బ్రౌన్ ఉదాహరణ కావ్యాన్ని’ ఇటీవల ఎవరు రచించారు?
     సన్నిధానం నరసింహశర్మ
 
 52.    ‘అక్బర్ నామా’ గ్రంథ రచయిత ఎవరు?
     అబుల్ ఫజల్
 
 53.    ఏ మొగల్ పాలకుడిని ఓడించి, ‘నిజాం ఉల్ -ముల్క్’ హైదరాబాద్ మొదటి నిజాం అయ్యాడు?
     ముబారిజ్ ఖాన్
 
 54.    ‘ఇంద్రజాల విద్య’ను ఏ వేదంలో ప్రస్తావించారు?
     అధర్వణ వేదం

 55.    ‘తమసోమా జ్యోతిర్గమయ’ అనే వాక్యం ఏ ఉపనిషత్తులో ఉంది?
     బృహదారణ్యకోపనిషత్తు
 
 56.    దక్షిణ భారత దేశంలో ‘మెగాలితిక్’ సంస్కృ తి ఏ యుగం గురించి తెలియజేస్తుంది?
     ఇనుపయుగం
 
 57.    ‘కళ్యాణీ చాళుక్య’ రాజ్యస్థాపకుడు ఎవరు?
     తైలపుడు
 
 58.    ‘పంపభారతం’ అని పేరు పొందిన ‘విక్రమార్జున విజయం’ గ్రంథ రచయిత?
     పంపకవి
 
 59.    కోయ, చెంచు, సవరలు తెగలు ఏ రాష్ట్రానికి చెందినవి?
     ఆంధ్రప్రదేశ్
 
 60.    సంతాల్ తెగల ప్రజల తిరుగుబాటు ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు?
     సిద్ధూ, కనుహూ
 
 61.    తమిళ ‘కుడి అరసు’ జర్నల్‌ను ఎవరు స్థాపించారు?
     ఇ.వి. రామస్వామినాయకర్
 
 62.    ‘జస్టిస్’ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?
     సి.ఎన్. మొదలియార్, టీ.ఎం.నాయక్, పి. త్యాగరాయచెట్టి
 
 63.    భారతదేశంలో ‘స్థానిక స్వపరిపాలన’ నిర్మాతగా ఏ బ్రిటిష్ రాజ ప్రతినిధిని పేర్కొంటారు?
     లార్‌‌డ రిప్పన్
 
 64.    భారతదేశంలో తొలిసారిగా ఎన్నికల విధానం ఏ చట్టం ద్వారా అమలైంది?
     మింటో - మార్లే సంస్కరణల చట్టం
 
 65.     బెంగాల్ విభజనను ఎప్పుడు చేశారు?
     1905 - కర్జన్ కాలంలో (1911లో హార్డింజ్ కాలంలో రద్దు చేశారు)
 
 66.    అన్నమాచార్యుడు ఏ విజయనగర రాజవంశ కాలానికి చెందినవారు?
     సాళువ వంశం
 
 67.    హంపీలోని ‘ఏకశిలారథం’ ఏ ఆలయంలో ఉంది?
     విఠలాలయం
 
 68.    విజయనగర కాలం నాటి ‘చిత్రలేఖనాలు’ ప్రస్ఫుటంగా ఎక్కడ కనిపిస్తాయి?
     లేపాక్షిలో
 
 69.    దక్కన్‌లో స్థాపించిన తొలి ముస్లిం రాజ్యం ?
     బహమనీ సామ్రాజ్యం. అల్లా ఉద్దీన్ హసన్ బహమన్ గంగూ క్రీ.శ. 1347లో స్థాపించాడు
 
 70.    గోల్కొండలో ‘కుతుబ్‌షాహీ’ వంశ స్థాపకుడు?
     సుల్తాన్ కులీ కుతుబ్‌షా. క్రీ.శ.1518లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు.
 
 71.    ‘హైదరాబాద్’ నగర నిర్మాత?
     మహ్మద్ కులీకుతుబ్‌షా
 
 72. క్రీ.శ.1565 నాటి రాక్షస - తంగిడి యుద్ధంలో పాల్గొనని బహమనీ రాజ్యం?
     బీరార్
 
 73.    ‘సారే జహాసే అచ్ఛా హిందూస్థాన్ హమారా’ గేయ రచయిత?
     మహ్మద్ ఇక్బాల్
 
 74.    అంటరానివారిగా పరిగణించే ‘మహరులకు’ తొలిసారిగా ఎవరు నాయకత్వం వహించారు?
     బి.ఆర్.అంబేద్కర్
 
 75.    జొరాష్ట్రియన్ మత స్థాపకుడు?
     జోరాష్టర్
 
 76.    పార్శీల పవిత్ర గ్రంథం ఏది?
     జండ్ అవెస్టా
 
 77.    భారతదేశంలో తొలి పత్రిక ‘బెంగాల్ గెజిట్’ను ఎవరు స్థాపించారు?
     జేమ్స్ అగస్టన్ హిక్కీ(1780లో కతకత్తా)
 
 78.    ‘ఆర్య సమాజం’ను ఏ సంవత్సరంలో ఎవరు స్థాపించారు?
     1875లో స్వామి దయానంద సరస్వతి
 
 79.    ఆత్మ గౌరవం ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?
     పెరియార్ ఇ.వి. రామస్వామి నాయికర్
 
 80.    ‘సరస్వతీ కంఠాభరణం’ గ్రంథాన్ని రచించిన ‘పరమరా’ రాజు?
     భోజుడు
 
 81.    {శావణ బెలగోళలో 56 అడుగుల ఎత్తు ఉన్న ఏకశిలా జైన గోమటేశ్వర విగ్రహాన్ని ఎవరు నిర్మించారు?
     మైసూరు గాంగరాజుల మంత్రి ‘చాముండరాయుడు’ క్రీ.శ. 983లో నిర్మించాడు.
 
 82.    ‘నలందా బౌద్ధ విహారాన్ని’ ఏ రాజు నిర్మించాడు?
     బలపుత్రదేవుడు
 
 83.    ‘గంగైకొండ’ అనే బిరుదున్న చోళరాజు?
     మొదటి రాజేంద్రచోళుడు
 
 84.    ‘సిద్ధాంత శిరోమణి’ గ్రంథకర్త?
     భాస్కరాచార్యుడు
 
 85.   క్రీ.శ. 12వ శతాబ్దంనాటి కాశ్మీర రాజుల చరిత్రను వివరించే గ్రంథం ఏది? దాని రచయిత ఎవరు?
     ‘రాజతరంగిణి’. కల్హణుడు రచించాడు.
 
 86.   ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఖజురహో దేవాలయాలను ఏ రాజ వంశీయులు నిర్మించారు?
     చండేల రాజులు
 
 87.    శైవమతాన్ని భక్తిమార్గంలో ప్రబోధించిన శివభక్తులను ఏమంటారు?
     నాయనార్లు. వారి రచనలు ‘థేవారాలు’
 
 88.    భక్తిమార్గంలో వైష్ణవమతాన్ని ప్రచారం చేసిన వారిని ఏమని పిలుస్తారు?
     ఆళ్వార్లు. వీరి రచనలు ప్రబంధాలు
 
 89.    శివాజీ ప్రవేశపెట్టిన పన్నులు ఏవి?
     చౌత్ : 1/4వ వంతు పన్ను విధించేవారు సర్దేశ్‌ముఖి: 10శాతం పన్ను విధించే వారు
 
 90.    ‘స్వారోచిష మనుసంభవం’ లేదా ‘మనుచరిత్ర’ గ్రంథకర్త?
     అల్లసాని పెద్దన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement