‘భారత జాతీయ కాంగ్రెస్ పిత’ ఎవరు? | ' Who are father of the Indian National Congress, | Sakshi
Sakshi News home page

‘భారత జాతీయ కాంగ్రెస్ పిత’ ఎవరు?

Published Thu, May 8 2014 9:59 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

‘భారత జాతీయ కాంగ్రెస్ పిత’ ఎవరు? - Sakshi

‘భారత జాతీయ కాంగ్రెస్ పిత’ ఎవరు?

 ఫారెస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్
 
 భారతదేశ చరిత్ర

 1.    హరప్పా ప్రజలు ఆరాధించిన దేవతలు ఎవరు?
     పశుపతి, అమ్మతల్లి
 
 2.    నవీన శిలాయుగానికి చెందిన లక్షణానికి ఉదాహరణ?
     ఆహార ఉత్పత్తి, కుండల తయారీ
 
 3.    హరప్పా ప్రజలు తమ ఇళ్ల నిర్మాణానికి వేటిని విరివిగా వాడారు?
     ఇటుకలు
 
 4.    సమాజాన్ని చాతుర్వర్ణ వ్యవస్థ (నాలుగు వర్ణాలు)గా విభజించినట్లు దేంట్లో పేర్కొన్నారు?
     రుగ్వేదంలోని పురుషసూక్తం
 
 5.    ‘కంఠక శోధన’ దేనికి సంబంధించింది?
     న్యాయవ్యవస్థ
 
 6.    సముద్రగుప్తుని అలహాబాదు స్తంభ శాసనాన్ని ఎవరు రచించారు?
     హరిసేనుడు
 
 7.    ఎర్ర కోట (ఢిల్లీ)లోని మయూర (నెమలి) సింహాసనాన్ని ఎవరు చేజిక్కించుకున్నారు?
     నాదిర్ షా
 
 8.    బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది?
     1905
 
 9.    ‘చౌరీ చౌరా’ సంఘటన ప్రాముఖ్యం ఏమిటి?
     గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేశారు.
 
 10.    ఆంధ్ర దేశ చరిత్రలో ‘పద్మనాభ యుద్ధం’ ఎప్పుడు జరిగింది?
     క్రీ.శ. 1794
 
 11.    చీరాల - పేరాల ఉద్యమం సందర్భంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నెలకొల్పిన గ్రామం పేరు?
     రామ్‌నగర్
 
 12.    రాణా ప్రతాప్, అక్బర్ మధ్య యుద్ధం ఎక్కడ జరిగింది?
     హల్దీఘాట్
 
 13.    ‘దేశభక్త’గా పేరు పొందిన తెలుగువారెవరు?
     కొండా వెంకటప్పయ్య
 
 14.    ‘శ్రీ భాగ్ ఒప్పందం’ఎవరి మధ్య జరిగింది?
     ఆంధ్ర - రాయలసీమ ప్రాంతాల నాయకుల మధ్య
 
 15.    ‘చైతన్య చరితామృతం’ గ్రంథ రచయిత?
     కృష్ణదాస్ కవిరాజ్
 
 16.    ‘రామాయణం గ్రంథాన్ని’ పారశీక భాషలోకి అనువదించినవారు ఎవరు?
     బదౌనీ
 
 17.    సింధు నాగరికతకు సంబంధించిన మహా స్నానఘట్టం, పెద్ద ధాన్యాగార భవనం ఎక్కడ బయటపడ్డాయి?
     మొహంజోదారో పట్టణంలో (సింధు నది ఒడ్డున)
 
 18.    ‘హరప్పా’ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది?
     రావీ నది
 
 19.    ‘సింధు నాగరికత’ ఏ యుగానికి చెందింది? ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉన్నతస్థితిలో విలసిల్లింది?
     కాంస్య యుగం. క్రీ.పూ. 2500 నుంచి క్రీ.పూ 1750 వరకు పరిఢవిల్లింది.
 
 20.   క్రీ.శ.7వ శతాబ్దంలో ఏ విదేశీ యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు?
     ఇత్సింగ్
 
 21.    ఆంధ్రదేశంలో ‘బేతంచర్ల’ దేనికి ప్రసిద్ధి?
     ప్రాక్ చరిత్రనాటి గుహలు
 
 22.    ‘సంగీత రత్నాకర’ గ్రంథ రచయిత?
     సారంగదేవుడు
 
 23.    పాలవంశ స్థాపకుడు ఎవరు?
     గోపాలుడు
 
 24.    ‘విక్రమశిల’ విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు?
     ధర్మపాలుడు
 
 25.    ‘దేవదాసీ’ అంటే అర్థం ఏమిటి?
     దేవుడికి అంకితమైన స్త్రీ
 
 26.    ‘గంగాదేవి’ రచించిన ‘మధురా విజయం’ ఏ అంశాన్ని వర్ణిస్తుంది?
     కంపన మధురను జయించడం
 
 27.    ఏ విజయనగర రాజు చైనా దేశానికి  రాయబారిని పంపాడు?
     మొదటి బుక్కరాయలు
 
 28.    ‘శారదా చట్టం’ దేనికి సంబంధించింది?
     బాల్య వివాహం
 
 29.    భారతదేశంలో మొదటిసారిగా ‘లేబర్’ ఉద్యమాన్ని నడిపిందెవరు?
     ఎన్.ఎమ్. లోఖండీ
 
 30.    భారతదేశంలో మొదటి ‘జాతీయ వార్తా’ సంస్థ ఏది?
     ది ఫ్రీ ప్రెస్ ఆఫ్ ఇండియా
 
 31.    ‘రాధాస్వామి సత్సంగ్’ను 1861లో ఆగ్రా లో ఎవరు స్థాపించారు?
     తులసీరామ్
 
 32.    ‘దయాభాగ’ రచయిత ఎవరు?
     జీమూత వాహనుడు
 
 33.    మహాభారతానికి మొదట ఉన్న పేరు?
     జయ
 
 34.    ‘లోథాల్’ దేనికి సంబంధించింది?
     సింధు నాగరికత
 
 35.    గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందిన పురాతన శాస్త్ర వైద్యుడెవరు?
     సుశ్రుతుడు
 
 36.    1866లో ‘భారత బ్రహ్మసమాజం’ అనే నూతన సమాజాన్ని ఎవరు స్థాపించారు?
     కేశవ చంద్రసేన్
 
 37.    1856 నాటి ‘హిందూ వితంతు పునర్వివాహ’ చట్టం ఏ సంఘసంస్కర్త కృషి ఫలితంగా వచ్చింది?
     ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్
 
 38.    రామకృష్ణ మిషన్‌ను 1897లో ఎవరు ఏర్పాటు చేశారు?
     స్వామి వివేకానంద
 
 39.    భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడెవరు?
     జె.బి. కృపలానీ
 
 40.    ‘ది నాయర్ సర్వీస్ సొసైటీ’ని ఎవరు స్థాపించారు?
     ఎం. పద్మనాభ పిళ్లై
 
 41.    ‘భారత జాతీయ కాంగ్రెస్ పిత’ ఎవరు?
     ఎ.ఒ. హ్యూమ్
 
 42.    ‘ప్రపంచ మతాల సమావేశం-1894’లో భారత్ తరఫున వివేకానందుడు ఎక్కడ ప్రసంగించాడు?
     చికాగో (అమెరికా)
 
 43.    రైతుల దీన పరిస్థితిని వివరించే ‘నీలి దర్పణ్’ నాటక రచయిత ఎవరు?
     దీనబంధుమిత్ర
 
 44.    ‘విజయమో లేదా మరణమో’ అనే నినాదాన్ని గాంధీజీ ఏ ఉద్యమం సందర్భంగా ప్రకటించారు?
     క్విట్ ఇండియా ఉద్యమం - 1942
 
 45.    ఆధునిక భారతదేశ సంఘ సంస్కరణ పితామహుడిగా ఎవరు గుర్తింపు పొందారు?
     రాజా రామ్మోహన్‌రాయ్
 
 46.    1815లో కలకత్తాలో ‘ఆత్మీయ సభ’ను ఎవరు ఏర్పాటు చేశారు?
     రాజా రామ్మోహన్‌రాయ్
 
 47.    1828 నాటి ‘బ్రహ్మసమాజం’ ప్రధాన ఉద్దేశం ఏమిటి?
     హిందూ మతాన్ని శుద్ధి చేయడానికి ‘ఏకేశ్వరో పాసనను’ ప్రోత్సహించడం
 
 48.    బెంగాల్ యువ హేతువాదుల ‘రాడికల్ ఉద్యమం’ నాయకుడెవరు?
     హెన్రీ డిరోజియో
 
 49.    భారతదేశంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతా న్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు?
     డల్హౌసీ
 
 50.    1917-18లో నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా ‘చంపారన్ రైతుల ఉద్యమం’ ఎక్కడ జరిగింది? దానికి ఎవరు నాయకత్వం వహించారు?
     బీహార్. గాంధీజీ నాయకత్వం వహించారు.
 
 51.    1918 నాటి ఖైరా రైతు ఉద్యమం ఎవరి నాయకత్వంలో, ఎక్కడ జరిగింది?
     వల్లభాయ్ పటేల్, గాంధీజీ. గుజరాత్‌లో.
 
 52.    వల్లభాయ్ పటేల్‌కు ‘సర్దార్’ అనే బిరుదు ఏ సత్యాగ్రహం సందర్భంగా వచ్చింది?
     బార్డోలి సత్యాగ్రహం (1928)
 
 53.    ‘ఆంధ్రా ప్రొవిన్సియల్ రైతు అసోసియే షన్’ను 1928లో ఎవరు ప్రారంభించారు?
     ఎన్.జి. రంగా, బి.వి. రత్నం
 
 54.    1936 నాటి అఖిల భారత కిసాన్ సభకు మొదటి అధ్యక్షుడెవరు?
     స్వామి సహజానంద
 
 55.    సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు?
     వెల్లస్లీ
 
 56.    ‘సైన్య సహకార పద్ధతి’ని అంగీకరించిన మొదటి రాజ్యం ఏది?
     హైదరాబాద్ సంస్థానం
 
 57.    ‘ఆర్కాట్ వీరుడు’ అని ఎవరిని పేర్కొంటారు?
     రాబర్‌‌ట క్లైవ్
 
 58.    ‘శాశ్వత భూమిశిస్తు’ నిర్ణయ పద్ధతిని ప్రవేశ పెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు?
     కారన్ వాలీస్
 
 59.    ఆంగ్లేయులు 1641లో ‘సెయింట్ జార్జి’ కోటను ఎక్కడ నిర్మించారు?
     మద్రాసు
 
 60.    పోర్చుగీసువారు ఏ బ్రిటిష్ రాజుకు బొంబాయిని కట్నంగా ఇచ్చారు?
     రెండో చార్లెస్
 
 61.    భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసినవారెవరు?
     రాబర్‌‌ట క్లైవ్
 
 62.    విజయనగర సామ్రాజ్య రెండో రాజధాని ఏది?
     పెనుగొండ
 
 63.    కాకతీయుల కాలంలో ‘మోటుపల్లి’ రేవును సందర్శించిన విదేశీ యాత్రికుడు?
     మార్కోపోలో
 
 64.    ఏ వైశ్రాయ్ కాలంలో ఇంపీరియల్ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు?
     రెండో లార్‌‌డ హార్డింజ్ (1911లో)
 
 65.    భారతదేశ జాతీయ చిహ్నాన్ని అశోకుని శిలా స్తంభం నుంచి గ్రహించారు. ఇది ఎక్కడ లభించింది?
     సారనాథ్
 
 66.    కళింగ యుద్ధాన్ని వర్ణించిన అశోకుని 13వ శిలాశాసనం ఎక్కడ ఉంది?
     జౌగడ
 
 67.    సూర్య - చంద్ర వంశరాజుల చరిత్రను ఏవి వివరిస్తాయి?
     పురాణాలు
 
 68.    ఆంగ్లేయులు ఆంధ్రదేశంలో మొదటగా స్థాపించిన వర్తక స్థావరం ఏది?
     మచిలీపట్నం
 
 69.    1921లో ఆంధ్రదేశంలో మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? దాని అధ్యక్షుడెవరు?
     విజయవాడలో, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
 
 70.    1885 నుంచి 1905 వరకు భారత జాతీయ మితవాద యుగానికి నాయకత్వం ఎవరు వహించారు?
     గోపాలకృష్ణ గోఖలే
 
 71.    1905 నుంచి 1915 వరకు జరిగిన జాతీయ ఉద్యమంలో ‘అతివాదులు’గా పేరు పొందినవారెవరు?
     లాలా లజపతిరాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్
 
 72.    ‘యుగాంతర్’ పత్రిక స్థాపకుడెవరు?
     అరవింద ఘోష్
 
 73.    ‘గీతా రహస్యం’ గ్రంథకర్త ఎవరు?
     బాల గంగాధర్ తిలక్
 
 74.    ‘శకారి’ అనే బిరుదు ఉన్న గుప్తరాజు ఎవరు?
     రెండో చంద్రగుప్తుడు
 75.    ‘సిపాయిల తిరుగుబాటు’ ఎక్కడ ప్రారంభమైంది?
     1857 మీరట్‌లో
 
 76.    డల్హౌసీ దత్తత స్వీకారం (లేదా) రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ రాజ్యంలో విలీనం అయిన మొదటి స్వదేశీ సంస్థానం ఏది?
     సతారా
 
 77.    పురోహితులు లేకుండా వివాహం చేసుకునే విధానాన్ని ఎవరు ప్రచారం చేశారు?
     ఇ.వి. రామస్వామి నాయకర్
 
 78.    1883లో ‘ఇల్బర్‌‌ట బిల్లు’ను ఏ వైశ్రాయ్ ప్రవేశపెట్టారు?
     లార్‌‌డ రిప్పన్
 
 79.    1884 నాటి ‘మద్రాస్ మహాజన సభ’ వ్యవస్థాపకులెవరు?
     జి.ఎస్. అయ్యర్, వీర రాఘవాచారి, పి. ఆనందాచార్యులు
 
 80.    ‘సైమన్ కమిషన్’ భారతదేశంలో ఏ సంవత్సరంలో పర్యటించింది?
     1928లో
 
 81.    భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం మొదట ఎక్కడ జరిగింది?
     కాకినాడలో
 
 82.    ఈస్టిండియా కంపెనీ పరిపాలన రద్దుకు విక్టోరియా రాణి ఎప్పుడు ప్రకటన జారీ చేసింది?
     1858లో
 
 83.    జాతీయ విద్యాభివృద్ధి కోసం అనిబీసెంట్ జాతీయ కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు?
     మదనపల్లిలో
 
 84.    ‘అవేక్ మదర్’ అనే గీతాన్ని ఎవరు రచించారు?
     సరోజినీనాయుడు
 
 85.    బాల కార్మికుల రక్షణకు మొదటిసారిగా ఫ్యాక్టరీ చట్టాన్ని ఎవరు ప్రవేశ పెట్టారు?
     1881లో లార్‌‌డ రిప్పన్
 
 86.    ‘ముద్రా రాక్షస’ గ్రంథ రచయిత ఎవరు?
     విశాఖ దత్తుడు
 
 87.    ‘అమిత్రఘాత్ర శత్రువులను నిర్మూలించిన వాడు’ అని ఎవరిని పేర్కొంటారు?
     బిందుసారుడు
 
 88.    మొదటి సంగమ సాహిత్య సదస్సుకు అధ్యక్షుడెవరు?
     అగస్త్యుడు
 
 89.    ‘శిలప్పాధికారం’ గ్రంథ రచయిత ఎవరు?
     ఇలాంగో అడిగళ్
 
 90.    తొల్కాప్పియార్ రచించిన ‘తొల్కప్పీయం’ ఏ అంశాన్ని ప్రస్తావిస్తుంది?
     వ్యాకరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement