సింధు నాగరికత ప్రజల ముఖ్యవృత్తి ఏది?
ఫారెస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్
భారతదేశ చరిత్ర
1. పురుషార్థాలు ఎన్ని? అవి ఏవి?
నాలుగు. (ధర్మ, అర్థ, కామ, మోక్షం)
2. సింధు నాగరికత ప్రజల ముఖ్యవృత్తి ఏది?
వ్యవసాయం
3. నిష్క, మాన, ఫణాలు దేన్ని సూచిస్తాయి?
నాణేలు
4. రాజసూయం, అశ్వమేథం, వాజపేయం లాంటి యజ్ఞాలను ఎందులో ప్రస్తావించారు?
బ్రాహ్మణాలు
5. ‘గాయత్రీమంత్రం’ ఏ దేవతకు సంబంధించింది?
సావిత్రి
6. అధర్వణవేదం ఏ విషయం గురించి చర్చిస్తుంది?
మంత్రాలు, తాయెత్తులు
7. భారతదేశ మొట్టమొదటి కవి?
వాల్మీకి
8. ‘శూన్యవాద సిద్ధాంతాన్ని’ ఎవరు ప్రతిపాదించారు?
ఆచార్య నాగార్జునుడు
9. ఏ పల్లవరాజు చేతిలో రెండో పులకేశిన్ (పశ్చిమ చాళుక్యరాజు) ఓడిపోయాడు?
నరసింహవర్మన్
10. హర్షుడు ఏ చాళుక్యరాజు చేతిలో ఓడిపోయాడు?
రెండో పులకేశిన్
11. ఏ బౌద్ధమత సదస్సులో బౌద్ధులు ‘హీనయాన - మహాయాన’ శాఖలుగా విడిపోయారు?
నాలుగో బౌద్ధమత సదస్సు
12. పాటలీపుత్ర నగర పరిపాలన ఎంతమంది సభ్యులతో నిర్వహించారు?
30 మంది సభ్యులతో
13. ఉండవల్లి, మొగల్రాజపురం, బెజవాడ గుహాలయాలను ఏ రాజవంశం నిర్మించింది?
విష్ణుకుండినులు
14. ‘కుషాణులు’ ఏ తెగకు చెందినవారు?
మధ్యాసియా ‘యూచీతెగకు’
15. మగధ రాజ్యాన్ని స్థాపించిన ప్రథమ వంశం ఏది? అందులో గొప్పవాడు ఎవరు?
హర్యాంక వంశం (క్రీ.పూ. 544-413), బింబిసారుడు
16. మౌర్యవంశ రాజుల్లో ‘అమిత్రఘాత’ అనే బిరుదు పొందిన రాజు?
బిందుసారుడు (క్రీ.పూ. 297-272)
17. మౌర్యుల కాలంలో వర్తక సంఘాలను ఏమని పిలిచేవారు?
నిగమాలు
18. మౌర్యచరిత్ర రచనకు ఉపకరించే ‘ఇండికా’ గ్రంథ రచయిత?
మెగస్తనీసు
19. మౌర్యవంశం పతనానంతరం మగధను పాలించిన రాజవంశం ఏది? దాని స్థాపకుడెవరు?
శుంగవంశం, పుష్యమిత్రశుంగుడు
20. కళింగాధిపతి, కళింగ చక్రవర్తి బిరుదులున్న చేధి వంశం లేదా మహామేఘ వాహనవంశం రాజెవరు?
ఖారవేలుడు
21. చేధి వంశం, మహామేఘ వాహన వంశంలో ‘ఖారవేలుని’ వివరాలను అందించే ఒకే ఒక శాసనం పేరేమిటి?
హాథీగుంఫా శాసనం (ఉదయగిరి, ఒడిశా)
22. ‘లలిత విస్తర గ్రంథం’ ఏ మతానికి చెందింది?
బౌద్ధమతానికి
23. ‘కథాసరిత్సాగర’ రచయిత?
సోమదేవుడు
24. ‘ఆదిగ్రంథ్’ ఎవరి బోధనల సంకలనం?
గురునానక్
25. ‘అభంగాలు’ అంటే ఏమిటి?
మార్మిక అనుభవాలను తెలిపే గీతాలు
26. భారతదేశంలో మొదటిసారిగా ‘వెండి పంచమార్కుడు నాణేలు’ ఏ కాలంలో ముద్రించారు?
క్రీ.పూ. 6వ శతాబ్దంలో (మహాజనపదాలు)
27. అశ్వఘోషుడు రచించిన బుద్ధచరితం ఏ భాషలో ఉంది?
సంస్కృతం
28. ‘నాగార్జునకొండ’ (విజయపురి) ఎవరి కాలంలో గొప్ప బౌద్ధ విద్యాపీఠంగా వర్ధిల్లింది?
ఇక్ష్వాకులు
29. ఉండవల్లిలోని అనంత పద్మనాభస్వామి గుహాలయాన్ని ఏ రాజులు నిర్మించారు?
విష్ణుకుండినులు
30. మొట్టమొదటి సారిగా భాగవత మతాన్ని ఏ గ్రీకురాజు ఆదరించాడు?
హెలియో డోరస్
31. శుద్ధ సంస్కృత భాషలో శాసనాన్ని వేయించిన మొదటి విదేశీ రాజెవరు?
మొదటి రుద్రదమనుడు (గిర్నార్ శాసనం)
32. మొదటి సంగమ సాహిత్య పండిత పరిషత్ అధ్యక్షుడెవరు?
అగస్త్యుడు
33. తూర్పు చాళుక్యుల వంశస్థాపకుడెవరు?
కుబ్జ విష్ణువర్ధనుడు
34. ఆంధ్రదేశంలో పశ్చిమ చాళుక్యుల వేసర దేవాలయాల వాస్తురీతి ఎక్కడ కనిపిస్తుంది?
అలంపురం ‘నవబ్రహ్మదేవాలయాలు’ (మహాబూబ్‌నగర్ జిల్లా)
35. ‘కిరాతార్జునీయం’ గ్రంథ రచయిత?
భారవి
36. మహాబలిపురంలో ‘పంచపాండవుల రాతి రథాలను’ ఏ రాజులు నిర్మించారు?
పల్లవరాజులు(మొదటి నరసింహవర్మ)
37. ‘ఓడబొమ్మ’ ఉన్న సీసపు నాణేన్ని ఏ శాత వాహనరాజు ముద్రించాడు?
యజ్ఞ శ్రీ శాతకర్ణి
38. ‘గౌతమీపుత్ర శాతకర్ణికి’ సంబంధించిన అతి ముఖ్యమైన ‘నాసిక్ శాసనాన్ని’ ఎవరు వేయించారు?
గౌతమీ బాలశ్రీ
39. ‘గాథాసప్తశతి’ ప్రాకృత గ్రంథ రచన ఎవరిది?
హోలుడు
40. లీలావతి పరిణయం గ్రంథ రచయిత?
కుతూహోలుడు
41. రాష్ర్టకూట రాజ్య స్థాపకుడెవరు?
దంతిదుర్గుడు
42. ‘గణిత సారసంగ్రహం’ గ్రంథ రచయిత?
మూలవీరాచార్యుడు
43. రాష్ర్ట కూటుల వాస్తు శిల్పశైలికి మహోన్నతంగా నిర్మించిన ఎల్లోరాలోని కైలాస ఆలయ నిర్మాత ఎవరు?
రాష్ర్ట కూట మొదటి కృష్ణుడు
44. ముంబై సమీపంలో ‘ఎలిఫెంటా గుహాలయాలు’ ఏ రాజుల కాలంలో నిర్మితమయ్యాయి?
రాష్ర్టకూటులు
45. చోళుల పరిపాలనా విభాగంలో ‘కుర్రమ్’, ‘కొట్టమ్’ పదాలు దేన్ని సూచిస్తాయి?
కొన్ని గ్రామాల సముదాయం
46. శివభక్తుల గురించి వివరించే ‘పెరియపురాణం’ గ్రంథ రచయిత ఎవరు?
శక్కిలార్
47. సంస్కృత భాషలో ‘బ్రహ్మసూత్రాల’ మీద శ్రీ భాష్యం పేరుతో వ్యాఖ్యానం చేసినవారు?
రామానుజాచార్యులు
48. ‘గీత గోవింద’ రచయిత జయదేవుడిని పోషించిన రాజవంశం ఏది?
సేనవంశం(లక్ష్మణ సేనుడు పోషించాడు)
49. తంజావూర్‌లోని ‘బృహధీశ్వరాలయాన్ని’ నిర్మించిన చోళరాజెవరు?
రాజ రాజ చోళుడు
50. ‘షానామా’ గ్రంథ రచయిత?
ఫిరదౌసీ
51. ‘సెయింట్ థామస్’ ఎవరి కాలంలో భారతదేశం సందర్శించాడు?
గొండో ఫెర్నిజ్
52. అమరావతి స్థూపాన్ని పునరుద్ధరించిన శాతవాహన రాజెవరు?
వాసిష్టీ పుత్ర పులోమావి
53. పాకిస్థాన్‌లో లభించిన అశోకుడి శిలా శాసనాలు ఏ లిపిలో ఉన్నాయి?
ఖరోష్టి
54. {పపంచ ప్రసిద్ధి గాంచిన ‘సాంచీస్థూపం’ ఏ రాష్ర్టంలో ఉంది?
మధ్యప్రదేశ్
55. అశోకుడు వేయించిన బ్రాహ్మీలిపిలో ఉన్న శిలాశాసనాలను ఎవరు చదవ గలిగారు?
జేమ్స్‌ప్రిన్సెఫ్
56. జైనమతాన్ని ఎప్పుడూ పోషించని వారు ఎవరు?
చోళులు