1. జీవుల విసర్జక పదార్థాల్లో ఉండే ప్రధాన మూలకం?
నత్రజని
2. కాయలను పండ్లుగా పక్వం చెందించే వాయువు?
ఇథిలీన్
3. సహజ విత్తనాలు లేని ఫలం?
అరటి
4. విత్తనాలు లేని ఫలాలను ఉత్పత్తి చేసే పద్ధతి?
అనిశేఖ ఫలనం
5. కృత్రిమంగా విత్తనాలు లేని ఫలాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగించే ఫైటో హార్మోన్?
జిబ్బరెల్లిన్‌లు
6. మేలు రకపు లక్షణాలు కలిగిన మొక్క నుంచి క్లోన్‌లను అభివృద్ధి చేసే క్రమంలో, వేర్ల పెరుగుదలకు
ఉపయోగించే రసాయనం?
నాఫ్తలిన్ బ్యుటరిక్ ఆమ్లం
7. ‘క్లోనింగ్’ అంటే?
పూర్తిగా తల్లిని పోలిన పిల్ల జీవులను అభివృద్ధి చేయడం
8. వేర్ల పెరుగుదలకు తోడ్పడే ఫైటో హార్మోన్?
ఆక్సిన్‌లు
9. ‘రెసిన్’లను ఏ మొక్కల నుంచి సంగ్రహిస్తారు?
పైనస్
10. ‘హీవియా బ్రెజీలియెన్సిస్’ మొక్క నుంచి సంగ్రహించే పదార్థం?
రబ్బరు
11. ‘బోట్యులిజం’ అంటే?
ఆహారం విషతుల్యం కావడం
12. ఉప్పు నీటి బురదనేలల్లో పెరిగే అడవులు?
మాంగ్రూవ్ అడవులు
13. మాంగ్రూవ్ అడవుల్ని ఎక్కువగా కలిగి ఉన్న రాష్ర్టం?
పశ్చిమ బెంగాల్
14. కాండం ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరిపే మొక్కలు?
ఎడారి మొక్కలు
15. ‘నెపందిస్’ ఒక?
కీటకాహార మొక్క
16. కీటకాహార మొక్కలు పెరిగే నేలల్లో ఏ మూలక లోపం కనిపిస్తుంది?
నత్రజని
17. టర్పెంటైన్ నూనెను ఏ మొక్కల నుంచి సేకరిస్తారు?
పైనస్ మొక్కలు
18. భూ వాతావరణంలోని పొరల్లో జీవరాశి మనుగడ సాగిస్తున్న పొర?
ట్రోపోస్పియర్
19. O3 అంటే?
ఓజోన్
20. భూ వాతవరణంలో ‘ఓజోన్’ ఏర్పడటానికి కారణమైన కాంతి కిరణాలు?
అతినీలలోహిత కిరణాలు
21. ‘కార్బన్ డై ఆక్సైడ్ సింక్’లుగా వేటిని పరిగణిస్తారు?
సముద్రాలు
22. భూమిపై గల ఉత్పత్తిదారులు?
మొక్కలు
23. ‘విచ్ఛిన్న కారులుగా’ ఏ జీవులను పరిగణిస్తారు?
బ్యాక్టీరియా, శిలీంద్రాలు
24. నల్లమందు మొక్క నుంచి సంగ్రహించే మందు?
మార్ఫిన్
25. అడవి గాడిదలను సంరక్షిస్తున్న రాష్ర్టం?
గుజరాత్
26. ఒంటి కొమ్ము ఖడ్గమృగాన్ని సంరక్షిస్తున్న నేషనల్ పార్‌క?
కాజీరంగా నేషనల్ పార్‌క
27. ఆసియా సింహాన్ని సంరక్షిస్తున్న నేషనల్ పార్‌క?
గిర్ నేషనల్ పార్‌క
28. అంతరించే అవకాశం ఉన్న జీవజాతుల సమాచారాన్ని తెలిపే పుస్తకం?
రెడ్ డేటాబుక్
29. బందీపూర్ నేషనల్ పార్‌క ఏ రాష్ర్టంలో ఉంది?
కర్ణాటక
30. జల కాలుష్య నియంత్రణ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం?
1974
31. వన్యప్రాణి సంరక్షణ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం?
1972
32. విటమిన్ - ఎ ను కలిగి ఉండే జన్యు మార్పిడి వరి?
ఎల్లోరైస్
33. వరిలో ‘బ్లైట్ తెగులు’ను కలిగించేది?
బ్యాక్టీరియా
34. నిమ్మలో కాంకర్ వ్యాధిని కలిగించేది?
బ్యాక్టీరియా
35. ప్లేగు వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా?
ఎర్సీనియా పెస్టిస్
36. బి.టి. కాటన్ అభివృద్ధిలో ఉపయోగపడిన బ్యాక్టీరియా?
బాసిల్లస్ తురిన్ జెనిసిస్
37. మానవునిలో ధనుర్వాతానికి కారణమయ్యే బ్యాక్టీరియా?
క్లాస్ట్రీడియం టెటనై
38. బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్త?
ఆంటోని వాన్ తవూవెన్ హక్
39. ‘నిస్సేరియా’ బ్యాక్టీరియా మానవునిలో కలగజేసే వ్యాధి?
గనేరియా
40. {sిపొనిమా పాలిడం వల్ల కలిగే వ్యాధి?
సిపిలిస్
41. రేబిస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త?
లూయీ పాశ్చర్
42. జీవులకు నిర్జీవులకు సంధానకర్త?
వైరస్
43. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్‌చ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
న్యూఢిల్లీ
44. సెంట్రల్ రైస్ రీసెర్‌చ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
కటక్
45. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది?
పుణే
46. జున్నులో ఉండే ప్రొటీన్?
కెసిన్
47. చెరకు పంటలో ఎర్రకుళ్లు తెగులుకు కారణం?
శిలీంద్రం
48. టిక్కా తెగులు ఏ పంటను ఆశిస్తుంది?
వేరుశెనగ
49. వరిలో అగ్గి తెగులుకు కారణం?
శిలీంద్రం
50. {దాక్ష శాస్త్రీయ నామం?
విటిస్ వినిఫెరా
51. టేకు మొక్క శాస్త్రీయ నామం?
టెక్టోనా గ్రాండిస్
52. ఎర్రచందనం శాస్త్రీయ నామం?
టీరోకార్పస్
53. సాల్ వృక్షం శాస్త్రీయ నామం?
షోరియా రోబస్టా
54. అజాడి రక్టా ఇండికా దేని శాస్త్రీయ నామం?
వేప చెట్టు
55. సరిగా నిల్వ చేయని చేపలపై దాడిచేసే బ్యాక్టీరియా?
క్లాస్ట్రీడియం
56. డిప్తీరియాను కలగజేసే బ్యాక్టీరియా?
కొరినే బ్యాక్టీరియం
57. ఒక జీవి తమజాతికి చెందిన జీవిని భక్షించడం?
కనిబాలిజం
58. ఎపి కల్చర్ అంటే?
తేనెటీగల పెంపకం
59. సిల్వర్ ఫిష్ అనేది?
ఒక కీటకం
60. తేనెటీగల లార్వా?
గ్రబ్
61. మొక్కల్లో జరిగే ఏ ప్రక్రియ వర్షాలు కురవడానికి కారణం అవుతుంది?
బాష్పోత్సేకం
62. రెండు ఎముకలను కలుపుతూ ఉండే బంధనాలు?
లిగమెంట్‌లు
63. పత్తి విత్తనాలను దూదిని వేరు చేసే ప్రక్రియ?
జిన్నింగ్
64. బయాప్సీ పరీక్ష ద్వారా నిర్ధారించే వ్యాధి?
క్యాన్సర్
65. గాసోహల్ వేటి మిశ్రమం?
పెట్రోల్ + ఆల్కహాల్
66. బయో గ్యాస్‌లో ప్రధాన వాయువు?
మీథేన్
67. MRIను విస్తరించండి?
మాగ్నెటిక్ రెసొనెన్‌స ఇమేజింగ్
68. పులుల సంరక్షణ కొరకు భారతదేశంలో ‘ప్రాజెక్ట్ టైగర్’ను ప్రారంభించిన సంవత్సరం?
1973
69. వ్యాయమం చేసేటప్పుడు కండరాలు అలసిపోవడానికి కారణం?
లాక్టిక్ ఆమ్లం
70. మానవుడిలో ‘ఆకలి’కి కారణమయ్యే హార్మోన్?
గ్రీలిన్
71. ‘ఆకలి’ని నియంత్రించే మెదడులోని భాగం?
మజ్జాముఖం
72. మన రాష్ర్ట పక్షి శాస్త్రీయ నామం?
కొరాషియస్ బెంగాలెన్సిస్
73. మన జాతీయ పక్షి శాస్త్రీయ నామం?
పావో క్రిస్పేటస్
74. జాతీయ జంతువు శాస్త్రీయనామం?
పాంథేరా టైగ్రిస్
75. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట జంతువు శాస్త్రీయ నామం?
ఆంటిలోప్ సెర్వికాప్రా
76. పించ్ పక్షులపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త?
చార్లెస్ డార్విన్
బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్త?
Published Fri, Apr 18 2014 9:59 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement