క్వార్టర్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డ‌నున్న టీమిండియా.. | U19 World Cup: India win big against Uganda | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డ‌నున్న టీమిండియా..

Published Mon, Jan 24 2022 6:28 AM | Last Updated on Mon, Jan 24 2022 7:17 AM

U19 World Cup: India win big against Uganda - Sakshi

టరోబా: అండర్‌– 19 క్రికెట్‌ ప్రపంచకప్‌లో భారత జట్టు అసాధారణ గెలుపుతో లీగ్‌ దశ ను ముగించింది. గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌ లో యువ భారత్‌ 326 పరుగుల భారీ తేడాతో ఉగాండాపై నెగ్గింది. మొదట భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 405 పరుగుల భారీస్కోరు చేసింది. రాజ్‌ అంగద్‌ బావా (162 నాటౌట్‌; 14 ఫోర్లు, 8 సిక్సర్లు), అంగ్‌కృష్‌ (144; 22 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. తర్వాత ఉగాండా 19.4 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో నిషాంత్‌ 4, రాజ్‌వర్ధన్‌ 2 వికెట్లు తీశారు. ఈనెల 29న జరిగే క్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement