Under-19 cricket World Cup final
-
క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడనున్న టీమిండియా..
టరోబా: అండర్– 19 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు అసాధారణ గెలుపుతో లీగ్ దశ ను ముగించింది. గ్రూప్ ‘బి’ మ్యాచ్ లో యువ భారత్ 326 పరుగుల భారీ తేడాతో ఉగాండాపై నెగ్గింది. మొదట భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 405 పరుగుల భారీస్కోరు చేసింది. రాజ్ అంగద్ బావా (162 నాటౌట్; 14 ఫోర్లు, 8 సిక్సర్లు), అంగ్కృష్ (144; 22 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. తర్వాత ఉగాండా 19.4 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో నిషాంత్ 4, రాజ్వర్ధన్ 2 వికెట్లు తీశారు. ఈనెల 29న జరిగే క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. -
'యువ' సేన సిద్ధం
దాదాపు ఇరవై ఏళ్ల క్రితం రెండో అండర్–19 క్రికెట్ ప్రపంచకప్... ప్రత్యక్ష ప్రసారం మాట దేవుడెరుగు... భారత ఆటగాళ్ళు కైఫ్, సెహ్వాగ్, హర్భజన్ ప్రతీ మ్యాచ్ ముగిసిన తర్వాత సాయంత్రం తమ డార్మిటరీకి దగ్గరిలోని టెలిఫోన్ బూత్‌నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేసి స్కోర్లు చెప్పేవారు. దక్షిణాఫ్రికాలోని యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో టోర్నీ జరిగితే, ఆటగాళ్లకు అక్కడి క్యాంపస్‌లోనే వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. మరో రెండేళ్లకు భారత్ టైటిల్ సాధించినా... పరిస్థితి పెద్దగా మారలేదు. మన జట్టు విజయాన్ని కూడా ఎవరూ పట్టించుకోలేదు. అంతకు పదేళ్ల క్రితం జరిగిన తొలి టోర్నీలోనైతే ఆస్ట్రేలియాలో మ్యాచ్‌కు కొన్ని నిమిషాల ముందు భారత జట్టు అక్కడే కిట్ కొనుక్కొని బరిలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పుడు... భారత యువ ఆటగాళ్ళకు సీనియర్ పురుషుల జట్టుతో సమానంగా సౌకర్యాలు, బిజినెస్ క్లాస్ ప్రయాణం, భారీ మొత్తంలో దినవారీ భత్యం...ప్రాక్టీస్ సెషన్లు, వార్మప్ మ్యాచ్‌లే కాదు, ఈ టోర్నీకి సంబంధించి అన్ని జట్ల ఆటగాళ్ల ప్రత్యేక ప్రమోషనల్ షూట్లు, జ్ఞాపికలపై సంతకాలు చేయడం...ఇదంతా ఐసీసీ మార్కెటింగ్ ప్రచారం. పాల్గొంటున్న పదహారు జట్ల ఆటగాళ్ల హాజరీతో భారీగా ఆరంభోత్సవ కార్యక్రమం. ఇక మ్యాచ్‌లు 200లకు పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం. టి20 లీగ్‌లు వచ్చాక ప్రపంచమంతా కూడా యువ ఆటగాళ్లపై, వారి ప్రదర్శనపై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో రెండేళ్లకు ఒకసారి ఆసక్తి రేపుతున్న అండర్–19 వరల్డ్ కప్ మళ్లీ వచ్చేసింది. న్యూజిలాండ్‌లో జరిగే ఈ సంబరానికి రేపటి నుంచి తెర లేస్తోంది. మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): అంతర్జాతీయ స్థాయిలో కుర్రాళ్లు సత్తా చాటేందుకు సరైన వేదికలాంటి అండర్–19 వరల్డ్ కప్‌కు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఇక్కడి బే ఓవల్ మైదానంలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌తో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ తలపడుతుంది. ఫైనల్ కూడా ఇక్కడే నిర్వహిస్తారు. ప్రస్తుతం జరగబోతోంది 12వ వరల్డ్ కప్ కాగా... గత టోర్నీల్లో పాల్గొని ఆ తర్వాత సీనియర్ స్థాయికి ఎదిగిన ఆటగాళ్లు వివిధ జట్లలో అనేక మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రతిభను నిరూపించుకొని ప్రమోట్ అయ్యేందుకు యువ ఆటగాళ్లంతా సిద్ధంగా ఉన్నారు. భారత్, ఆస్ట్రేలియా గతంలో మూడు సార్లు అండర్–19 ప్రపంచ కప్ గెలుచుకోగా...పాకిస్తాన్ రెండు సార్లు, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఒక్కోసారి విజేతగా నిలిచాయి. వీరంతా అక్కడినుంచే... అండర్–19 ప్రపంచకప్‌లో తమ ఆటతో గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత సీనియర్ క్రికెట్లో కూడా తమదైన ముద్ర చూపించిన ఆటగాళ్లు అన్ని జట్లలోనూ ఉన్నారు. ఇందులో అగ్రస్థానం మాత్రం మన కెప్టెన్ విరాట్ కోహ్లికే దక్కుతుంది. 2008లో తన నాయకత్వంలోనే భారత్‌ను విజేతగా నిలిపిన కోహ్లికి ఆ తర్వాత ఎదురు లేకుండా పోయింది. అదే ఏడాది సీనియర్ జట్టులో తనకు లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న అతను... ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా, నాయకుడిగా ఎదిగాడు. ఈ జాబితాలో యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, మనీశ్ పాండే, విలియమ్సన్, ఆమ్లా, డి కాక్, రబడ, అంబటి రాయుడు, వేణుగోపాలరావు తదితరులున్నారు. జట్ల వివరాలు గ్రూప్ ‘ఎ’: న్యూజిలాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, కెన్యా గ్రూప్ ‘బి’: భారత్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, పపువా న్యూగినియా గ్రూప్ ‘సి’: ఇంగ్లండ్, బంగ్లాదేశ్, నమీబియా, కెనడా గ్రూప్ ‘డి’: పాకిస్తాన్, శ్రీలంక, ఐర్లాండ్, అఫ్ఘానిస్తాన్ భారత్ లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్ జనవరి 14న ఆస్ట్రేలియాతో (ఉ.గం. 5.30నుంచి) జనవరి 16న పపువా న్యూ గినియాతో (ఉ.గం. 6.30) జనవరి 19న జింబాబ్వేతో (ఉ.గం. 6.30నుంచి) 2012 1988లో యూత్ వరల్డ్ కప్ పేరుతో తొలి టోర్నీ జరిగింది. ఆ తర్వాత అండర్–19 ప్రపంచకప్‌ను మళ్లీ నిర్వహించేందుకు పదేళ్లు పట్టింది. 1998నుంచి దీనిని ఐసీసీ అండర్–19 వరల్డ్‌కప్‌గా వ్యవహరిస్తున్నారు. మన సైన్యమిదే... దేశవాళీ క్రికెట్లో ఇప్పటికే సంచలన క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ షా నేతృత్వంలో భారత జట్టు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కోచ్‌గా భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ మార్గనిర్దేశనంలో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని కుర్రాళ్లు పట్టుదలగా ఉన్నారు. ఇటీవల ఇదే జట్టు ఆసియా కప్‌లాంటి టోర్నీలలో వరుస విజయాలు సాధించి ఊపు మీదుంది. జట్టు వివరాలు: పృథ్వీ షా (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, ఆర్యన్ జూయల్, అభిషేక్ శర్మ, అర్‡్షదీప్ సింగ్, హార్విక్ దేశాయ్, మన్జోత్ కల్రా, కమలేశ్ నాగర్కోటి, పంకజ్ యాదవ్, రియాన్ పరాగ్, ఇషాన్ పొరెల్, హిమాన్షు రాణా, అనుకూల్ రాయ్, శివమ్ మావి, శివసింగ్ -
కుర్రాళ్ల ఆశలు ఆవిరి
* తొలిసారి చాంపియన్‌గా విండీస్ * ఫైనల్లో ఓడిన భారత్ * అండర్-19 ప్రపంచకప్ మిర్పూర్: నాలుగోసారి అండర్-19 ప్రపంచకప్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని భావించిన యువ భారత్‌కు నిరాశే ఎదురైంది. టోర్నీ అంతటా అత్యంత నిలకడను ప్రదర్శిస్తూ విజయాలు సాధిస్తూ వచ్చిన జట్టుకు ఫైనల్లో వెస్టిండీస్ షాక్‌నిచ్చింది. ఆదివారం షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని కాపాకుడునేందుకు కుర్రాళ్లు చివరి ఓవర్ వరకూ ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. అటు తీవ్ర ఒత్తిడిని జయిస్తూ కీసి కార్టీ (125 బంతుల్లో 52 నాటౌట్; 2 ఫోర్లు), కీమో పాల్ (68 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్; 1 సిక్స్) అద్భుత ప్రదర్శనతో.... ఐదు వికెట్ల తేడాతో నెగ్గిన వెస్టిండీస్ ఈ టోర్నీ చరిత్రలో తొలిసారిగా చాంపియన్‌గా నిలించింది. పేసర్ల ధాటికి విలవిల టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 45.1 ఓవర్లలో 145 పరుగులు మాత్రమే చేసింది. సర్ఫరాజ్ (51; 5 ఫోర్లు; 1 సిక్స్) తన అద్భుత ఫామ్‌ను మరోసారి చూపగా మిగతా అంతా విఫలమయ్యారు. పిచ్ పరిస్థితిని సద్వినియోగం చేసుకున్న పేసర్లు జోసెఫ్ (3/39), రియాన్ జాన్ (3/38) చక్కటి బౌన్స్‌తో భారత బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. దీంతో 50 పరుగులకే జట్టు ఐదు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. చివర్లో బాథమ్ (21; 3 ఫోర్లు), లొమ్రోర్ (19; 2 ఫోర్లు) పోరాడడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ 49.3 ఓవర్లలో 146 పరుగులు చేసి నెగ్గింది. అయితే భారత బౌలర్లు పట్టుదల ప్రదర్శించడంతో విండీస్ 77 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. కానీ కార్టీ, పాల్ జోడి మరో వికెట్ పడకుండా సమయోచిత ఆటతీరుతో మరో మూడు బంతులు మిగిలి ఉండగా జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. పాల్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను భారత ఫీల్డర్లు వదిలేశారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రిషబ్ (స్టంప్డ్) ఇమ్లాచ్ (బి) జోసెఫ్ 1; ఇషాన్ ఎల్బీడబ్ల్యు (బి) జోసెఫ్ 4; అన్మోల్ (సి) ఇమ్లాచ్ (బి) జోసెఫ్ 3; సుందర్ (సి) జోసెఫ్ (బి) జాన్ 7; సర్ఫరాజ్ ఎల్బీడబ్ల్యు (బి) జాన్ 51; అర్మాన్ (సి) పాల్ (బి) స్ప్రింజర్ 5; లొమ్రోర్ (సి) ఇమ్లాచ్ (బి) హోల్డర్ 19; దాగర్ (సి) కార్టీ (బి) జాన్ 8; బాథమ్ (సి) ఇమ్లాచ్ (బి) పాల్ 21; అవేశ్ (సి) జా న్ (బి) పాల్ 1; అహ్మద్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (45.1 ఓవర్లలో ఆలౌట్) 145. వికెట్ల పతనం: 1-3, 2-8, 3-27, 4-41, 5-50, 6-87, 7-116, 8-120, 9-123, 10-145. బౌలింగ్: జోసెఫ్ 10-0-39-3; హోల్డర్ 10-2-20-1; జాన్ 10-0-38-3; స్ప్రింజర్ 9-1-24-1; పాల్ 6.1-0-17-2. వెస్టిండీస్ ఇన్నింగ్స్: పోప్ (సి) అహ్మద్ (బి) అవేశ్ 3; ఇమ్లాచ్ (సి) లొమ్రోర్ (బి) అహ్మద్ 15; హెట్‌మైర్ (సి) అర్మాన్ (బి) దాగర్ 23; కార్టీ నాటౌట్ 52; స్ప్రింజర్ (సి) అర్మాన్ (బి) దాగర్ 3; గూలీ (సి అండ్ బి) దాగర్ 3; పాల్ నాటౌట్ 40; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (49.3 ఓవర్లలో ఐదు వికెట్లకు) 146. వికెట్ల పతనం:1-5, 2-28, 3-67, 4-71, 5-77. బౌలింగ్: అవేశ్ 10-1-29-1; అహ్మద్ 9.3-2-32-1; సుందర్ 9-1-18-0; బాథమ్ 3-0-12-0; లొమ్రోర్ 8-0-29-0; దాగర్ 10-1-25-3. -
యువ భారత్‌కు షాక్:విండీస్‌దే కప్
మిర్పూర్: అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ పోరులో యువ భారత్‌కు షాక్ తగిలింది. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన తుదిపోరులో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలై రన్నరప్‌గా సరిపెట్టుకుంది. భారత్ విసిరిన 146 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన విండీస్ ఇంకా మూడు బంతులుండగా విజయం సాధించి తొలిసారి కప్‌ను దక్కించుకుంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ కు ఆదిలో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు గిడ్రాన్ పోప్(3), ఇమ్లాక్(15) పెవిలియన్‌కు చేరారు. అనంతరం హేట్‌మైర్(23),స్పింగర్(3), గూలీ(3) కూడా అవుట్ కావడంతో విండీస్ 77 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ పై భారత్ పట్టు సాధించినట్లు కనబడింది. కాగా, ఆ తరుణంలో కార్టీ(52నాటౌట్), కీమో పాల్(40) సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో విండీస్ 49.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుని వరల్డ్ కప్‌ను అందుకుంది. దీంతో నాల్గో సారి కప్‌ను దక్కించుకుందామనుకున్న భారత్‌కు నిరాశే ఎదురైంది. 2000, 08, 12 సంవత్సరాల్లో వరల్డ్ కప్ ను గెలుచుకుని రికార్డు టైటిల్ పై కన్నేసిన యువ భారత్ పేలవ ప్రదర్శన కారణంగా పరాజయం పాలైంది. ఈ టోర్నీలో భారత్ కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. కాగా, అండర్ 19 వరల్డ్ కప్ లో రెండోసారి ఫైనల్ కు చేరిన విండీస్ అందరీ అంచాలను తల్లక్రిందులు చేసి తమలోని ప్రతిభకు కొదవలేదని నిరూపించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన యువ భారత్ 45.1 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటయ్యింది. భారత ఆటగాళ్లలో సర్పరాజ్ ఖాన్(51), బాథమ్(21), లామ్రోర్(19) మినహా మిగతా ఎవరూ రెండంకెల స్కోరును దాటలేదు. ఎనిమిది మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో భారత స్వల్ప స్కోరుకే పరిమితమైంది. విండీస్ బౌలర్లలో జోసఫ్, జాన్‌లకు తలో మూడు వికెట్లు సాధించగా, కీమో పాల్‌కు రెండు వికెట్లు లభించాయి. -
ఫైనల్లో ఆశలు రేకెత్తించిన డాగర్
మీర్పూర్: అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ సమరం ఆసక్తికరంగా మారింది. భారత్ తక్కువ స్కోరుకే ఆలౌటయినా బౌలర్ మయాంక్ డాగర్ కీలక సమయంలో వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. భారత్ నిర్దేశించిన 146 పరుగుల కష్టసాధ్యంకాని లక్ష్యంతో బరిలో దిగిన విండీస్ 30 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. విండీస్ విజయానికి మరో 66 పరుగులు చేయాలి. లక్ష్యసాధనను విండీస్ జోరుగా కొనసాగించింది. ఓ దశలో విండీస్ స్కోరు 67/2. దీంతో భారత్ విజయావకాశాలు సన్నగిల్లాయి. ఈ సమయంలో భారత బౌలర్ మయాంక్ డాగర్ చెలరేగాడు. డాగర్ వరుసగా మూడు వికెట్లు పడగొట్టి భారత్ విజయంపై ఆశలు రేకెత్తించాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 45.1 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ (51)కు తోడు మహిపాల్ లోమ్రోర్ 19, రాహుల్ బాథమ్ 21 పరుగులు చేయడం మినహా ఇతర భారత బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్ దాటలేకపోయారు. వెస్టిండీస్ బౌలర్లు జోసెఫ్, రియాన్ జాన్ చెరో మూడు వికెట్లు, కీమో పాల్ రెండు వికెట్లు పడగొట్టారు. -
ఫైనల్లో భారత్ తక్కువ స్కోరు
మీర్పూర్: అండర్-19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన భారత బ్యాట్స్‌మెన్ అసలైన ఫైనల్ సమరంలో బోల్తాపడ్డారు. టాపార్డర్‌లో సర్ఫరాజ్ ఖాన్ (51) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయడం మినహా ఇతర ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. వెస్టిండీస్‌తో ఆదివారం జరుగుతున్న ఫైనల్ పోరులో భారత్ 146 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యువ భారత్ 45.1 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్‌కు తోడు మహిపాల్ లోమ్రోర్ 19, రాహుల్ బాథమ్ 21 పరుగులు చేయడం మినహా ఇతర బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్ దాటలేకపోయారు. వెస్టిండీస్ బౌలర్లు జోసెఫ్, రియాన్ జాన్ చెరో మూడు వికెట్లు, కీమో పాల్ రెండు వికెట్లు పడగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రిషబ్ పంత్ (1) తొలి ఓవర్లోనే అవుటయ్యాడు. ఆ వెంటనే అన్మోల్ప్రీత్ సింగ్ (3) పెవిలియన్ చేరడంతో భారత్ 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కెప్టెన్ ఇషాన్ కిషన్ (4)తో పాటు వాషింగ్టన్ సుందర్ (7), ఆర్మన్ జాఫర్ (5) తక్కువ పరుగులకే అవుటవడంతో భారత్ కోలుకోలేకపోయింది. 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో భారత్ 100 పరుగుల లోపే పోరాటం ముగుస్తుందనిపించింది. అయితే సర్ఫరాజ్ ఒంటరి పోరాటం చేసి జట్టును ఆదుకున్నాడు. అతనికి లోమ్రోర్ కాసేపు అండగా నిలిచాడు. కాగా హాఫ్ సెంచరీ చేసిన వెంటనే సర్ఫరాజ్ అవుటయ్యాక, భారత ఇన్నింగ్స్ ఎక్కువసేపు సాగలేదు. చివర్లో రాహుల్ కాసేపు పోరాడాడు. -
కుప్పకూలిన టాప్ ఆర్డర్
మిర్పూర్: వెస్టిండీస్ తో జరుగుతున్న అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. విండీస్ బౌలర్ల ధాటికి యువభారత బ్యాట్స్ మెన్లు విలవిల్లాడారు. ఒకరివెంట ఒకరు పెవిలియన్ కు వరుస కట్టారు. పంత్(1), ఇషాన్ కిషాన్(4), అనమోల్ ప్రీత్ సింగ్(3), వాషింగ్టన్ సుందర్(7), అర్మాన్ జాఫర్(5) స్వల్ప స్కోరుకే అవుటయ్యారు. విండీస్ బౌలర్లలో జోసఫ్ 3 వికెట్లు పడగొట్టాడు. జాన్, స్ప్రింగర్ చెరో వికెట్ తీశారు. యువభారత్ 20 ఓవర్లలో 56/5 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. సర్ఫరాజ్ ఖాన్(14), లొమరర్(6) క్రీజ్ లో ఉన్నారు. -
విండీస్ ఫీల్డింగ్, భారత్ బ్యాటింగ్
మిర్పూర్: అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో భారత్, వెస్టిండీస్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన వెస్డిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. యువభారత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. స్థానిక షేరె బంగ్లా జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ప్రస్తుత అండర్-19 ప్రపంచకప్‌లో ఒక్క పరాజయం కూడా లేకుండా దూసుకెళుతున్న యువ భారత్ రికార్డు స్థాయిలో నాలుగో టైటిల్‌ను గెలవాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతోంది. చివరిసారి 2012లో ఉన్ముక్త్ చంద్ నేతృత్వంలోని భారత జట్టు ఈ టైటిల్ సాధించింది. అంతకుముందు 2000, 2008లోనూ కప్ గెలుచుకోగా ఈసారి కూడా చాంపియన్‌గా నిలిస్తే తొలిసారిగా ఈ టోర్నీని నాలుగుసార్లు గెలిచిన జట్టుగా రికార్డులకెక్కుతుంది. టోర్నీ చరిత్రలో రెండోసారి ఫైనల్‌కు చేరిన విండీస్ ఎలాగైనా టైటిల్ సాధించాలన్న కసితో ఉంది.