విండీస్ ఫీల్డింగ్, భారత్ బ్యాటింగ్ | West Indies win the toss and choose to bowl | Sakshi
Sakshi News home page

విండీస్ ఫీల్డింగ్, భారత్ బ్యాటింగ్

Published Sun, Feb 14 2016 8:13 AM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM

విండీస్ ఫీల్డింగ్, భారత్ బ్యాటింగ్

విండీస్ ఫీల్డింగ్, భారత్ బ్యాటింగ్

మిర్‌పూర్: అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్, వెస్టిండీస్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన వెస్డిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. యువభారత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. స్థానిక షేరె బంగ్లా జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.

ప్రస్తుత అండర్-19 ప్రపంచకప్‌లో ఒక్క పరాజయం కూడా లేకుండా దూసుకెళుతున్న యువ భారత్ రికార్డు స్థాయిలో నాలుగో టైటిల్‌ను గెలవాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతోంది. చివరిసారి 2012లో ఉన్ముక్త్ చంద్ నేతృత్వంలోని భారత జట్టు ఈ టైటిల్ సాధించింది. అంతకుముందు 2000, 2008లోనూ కప్ గెలుచుకోగా ఈసారి కూడా చాంపియన్‌గా నిలిస్తే తొలిసారిగా ఈ టోర్నీని నాలుగుసార్లు గెలిచిన జట్టుగా రికార్డులకెక్కుతుంది. టోర్నీ చరిత్రలో రెండోసారి ఫైనల్‌కు చేరిన విండీస్ ఎలాగైనా టైటిల్ సాధించాలన్న కసితో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement