కుప్పకూలిన టాప్ ఆర్డర్ | Under-19 cricket World Cup final: India loose 3 three wickets | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన టాప్ ఆర్డర్

Published Sun, Feb 14 2016 9:44 AM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM

కుప్పకూలిన టాప్ ఆర్డర్

కుప్పకూలిన టాప్ ఆర్డర్

మిర్‌పూర్: వెస్టిండీస్ తో జరుగుతున్న అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. విండీస్ బౌలర్ల ధాటికి యువభారత బ్యాట్స్ మెన్లు విలవిల్లాడారు. ఒకరివెంట ఒకరు పెవిలియన్ కు వరుస కట్టారు. పంత్(1), ఇషాన్ కిషాన్(4), అనమోల్ ప్రీత్ సింగ్(3), వాషింగ్టన్ సుందర్(7), అర్మాన్ జాఫర్(5) స్వల్ప స్కోరుకే అవుటయ్యారు.

విండీస్ బౌలర్లలో జోసఫ్ 3 వికెట్లు పడగొట్టాడు. జాన్, స్ప్రింగర్ చెరో వికెట్ తీశారు. యువభారత్ 20 ఓవర్లలో 56/5 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.  సర్ఫరాజ్ ఖాన్(14), లొమరర్(6) క్రీజ్ లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement