సాక్షి, హైదరాబాద్: ఉగాండా పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన రామ్‌కో సిమెంట్స్ ఉద్యోగి దినేశ్ రాజయ్య రాణించి మూడు కాంస్య పతకాలు సాధించాడు. దినేశ్ ఎస్‌ఎల్–3 సింగిల్స్‌లో, ఎస్‌ఎల్3–ఎస్‌ఎల్4 డబుల్స్‌లో, ఎస్‌ఎల్3–ఎస్‌యు5 మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు.
ఈ టోర్నీ సందర్భంగా దినేశ్‌ను ఉగాండాలో భారత హైకమిషనర్‌గా ఉన్న ఎ.అజయ్ కుమార్ సన్మానించి అభినందించారు. మొత్తం 20 దేశాల నుంచి వివిధ కేటగిరీల్లో కలిపి 191 మంది క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. భారత్‌కు 12 స్వర్ణాలు, 14 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి మొత్తం 42 పతకాలు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment