ముంబై: క్రీడలు, క్రీడాకారులకు లభించే స్పాన్సర్‌షిప్‌లు గతేడాది (2022) రెట్టింపయ్యాయి. రూ. 5,907 కోట్లకు చేరాయి. ఇందులో సింహభాగం వాటా 85 శాతాన్ని క్రికెట్టే దక్కించుకుంది. మీడియా ఏజెన్సీ గ్రూప్‌ఎం రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2022లో స్పోర్ట్స్ సెలబ్రిటీలు రూ. 729 కోట్ల మేర స్పాన్సర్‌షిప్‌లు పొందారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 20 శాతం అధికం. అత్యధికంగా అందుకున్న టాప్ క్రీడాకారుల్లో విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, సచిన్ టెండుల్కర్, నీరజ్ చోప్రాలతో పాటు పీవీ సింధు కూడా ఉన్నారు. గతేడాది మొత్తం మీద క్రీడలపై ఖర్చులు రూ. 9,500 కోట్ల నుంచి రూ. 14,000 కోట్లకు చేరినట్లు గ్రూప్‌ఎం తెలిపింది. ‘2021తో పోలిస్తే భారత్‌లో క్రీడల స్పాన్సర్‌షిప్‌లు అసాధారణంగా 105 శాతం మేర వృద్ధి చెందాయి‘ అని పేర్కొంది.
ఐపీఎల్ దన్ను..
► ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెరగడం, కొత్తగా మరో రెండు టీమ్‌లు వచ్చి చేరడం, ఐసీసీ టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్, ఫిఫా వరల్డ్ కప్‌తో పాటు మారథాన్‌లు, కామన్వెల్త్ గేమ్స్ మొదలైనవి 2022లో క్రీడలపై చేసే ఖర్చు పెరగడానికి తోడ్పడ్డాయి.
► గతేడాది వచ్చిన స్పాన్సర్‌షిప్‌లలో క్రికెట్ 85% దక్కించుకోగా.. ఫుట్‌బాల్, కబడ్డీ మొదలైనవి 15 శాతంతో సరిపెట్టుకున్నాయి. కొత్త క్రీడలకు స్పాన్సర్‌షిప్‌లు భారీగా పెరుగుతున్నాయి.
► విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ తలో 30 పైగా బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ తదితరులు కూడా పుంజుకుంటున్నారు.
► కొన్నాళ్లుగా క్రీడలపై వ్యయాలు వార్షికంగా సగటున 14 శాతం మేర వృద్ధి చెందుతున్నాయి. ఎకానమీలో అత్యంత మెరుగ్గా రాణిస్తున్న రంగాల్లో ఇది కూడా ఒకటిగా ఉంటోంది.
► 2023 సీజన్ తర్వాత ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌ల రెన్యువల్, బీసీసీఐ హోమ్ సిరీస్ టైటిల్, టీమ్ ఇండియా స్పాన్సర్‌షిప్, బీసీసీఐ హోమ్ సిరీస్ మీడియా హక్కులు, మార్చిలో జరిగిన డబ్ల్యూపీఎల్ ప్రారంభ సీజన్ మొదలైన వాటితో భారత్‌లో స్పాన్సర్‌షిప్‌లు ఈ ఏడాది తారా స్థాయికి చేరనున్నాయి.
రూ. 5,900 కోట్లకు స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్‌లు
Published Thu, Apr 6 2023 6:23 AM | Last Updated on Thu, Apr 6 2023 10:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment