ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ధోని, కోహ్లి | Football match Dhoni, Kohli | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ధోని, కోహ్లి

Published Thu, Jun 2 2016 12:48 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

Football match Dhoni, Kohli

ముంబై: క్రికెట్‌కు విరామమిస్తూ భారత స్టార్ క్రికెటర్లు ఎమ్మెస్ ధోని, విరాట్ కోహ్లి కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ బరిలోకి దిగనున్నారు. విరాళాల సేకరణ కోసం అభిషేక్ బచ్చన్‌కు చెందిన ప్లేయింగ్ ఫర్ హ్యుమానిటీ, విరాట్ కోహ్లి ఫౌండేషన్ కలిసి సంయుక్తంగా ఈ ఛారిటీ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నాయి.

‘సెలబ్రిటీ క్లాసికో 2016’ పేరుతో శనివారం ముంబైలో ఈ మ్యాచ్ నిర్వహిస్తారు. ధోని, కోహ్లి, అభిషేక్‌లతో పాటు రణ్‌బీర్ కపూర్, జహీర్, హర్భజన్, యువరాజ్, రహానే, అశ్విన్ కూడా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement