ధోనీ రిటైర్‌మెంట్‌పై స్పందించిన‌ కోహ్లి | Virat Kohli Comments Over MS Dhoni Retirement | Sakshi
Sakshi News home page

నువ్వెప్పటికీ నా కెప్టెన్‌వే: కోహ్లి

Published Sun, Aug 16 2020 6:43 PM | Last Updated on Sun, Aug 16 2020 6:56 PM

Virat Kohli Comments Over MS Dhoni Retirement - Sakshi

ముంబై : ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ రిటైర్‌మెంట్‌పై విరాట్‌ కోహ్లి స్పందించారు. ఆదివారం ఇందుకు సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ‘‘   కొన్ని సార్లు మాటలు కరువవుతాయి. అలాంటి సందర్భమే ఇది. మనమిద్దరం మంచి స్నేహాన్ని పంచుకున్నాం. ఒకర్ని ఒకరం అర్థం చేసుకున్నాం. ఎందుకంటే  మనిద్దరి దారులు ఒకటే కాబట్టి. నీ సారధ్యంలో.. అదీ నీతో ఆడటం నాకెంతో ఇష్టం. ( రికార్డు సృష్టించిన విరుష్క జంట)

నువ్వు నాపై నమ్మకాన్ని ఉంచావు. దానికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. ఓ విషయం నేను ఎప్పుడూ చెబుతుంటాను. ఇప్పుడు కూడా చెబుతున్నాను. నువ్వెప్పటికీ నా కెప్టెన్‌వే.’’ అని వీడియోలో పేర్కొన్నారు విరాట్‌ కోహ్లి. కాగా, ఎంఎస్‌ ధోనీ శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement