ఆ ఇద్దరి క్రికెటర్లతో ఆడుతా: సింధు | PV Sindhu Says Lots to Learn From MS Dhoni and Virat Kohli | Sakshi
Sakshi News home page

Published Sun, May 20 2018 4:39 PM | Last Updated on Sun, May 20 2018 5:18 PM

PV Sindhu Says Lots to Learn From MS Dhoni and Virat Kohli - Sakshi

హైదరాబాద్‌ : టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలలో ఒకరిని డబుల్స్‌ పార్టనర్‌గా ఎంచుకుంటానని బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు తెలిపారు. శనివారం ఉప్పల్‌లో జరిగిన కోల్‌కతా-సన్‌రైజర్స్‌ మ్యాచ్‌కు సింధు హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మ్యాచ్‌ మధ్యలో సింధూ మాట్లాడుతూ.. తానెప్పుడు  హైదరాబాద్‌లో ఉన్నా ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూస్తుంటానని, గత సీజన్‌లో కూడా హాజరయ్యానన్నారు. సన్‌రైజర్స్‌ అద్భుతంగా రాణిస్తుందని, తాను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఇక్కడ మ్యాచ్‌లు లేవని, కానీ అన్ని సన్‌ మ్యాచ్‌లను ఫాలో అయినట్లు తెలిపారు. జట్టు ఆటగాళ్లంతా సమిష్టిగా రాణిస్తు విజయాలు నమోదు చేస్తున్నారని కొనియాడారు. 

డబుల్స్‌ పార్టనర్‌గా ఏ క్రికెటర్‌ను ఎంపిక చేసుకుంటారన్న ప్రశ్నకు.. మాజీ కెప్టెన్‌ ధోని, ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలలో ఒకరిని ఎంపిక చేసుకుంటానన్నారు. మిగతా ఆటగాళ్లు బ్యాడ్మింటన్‌ ఆడే విషయం తనకు తెలియదన్నారు. ధోని, కోహ్లిల నుంచి చాలా నేర్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement