sports womens
-
లైంగిక వేధింపులు ధైర్యంగా ఎదుర్కోవాలి
బంజారాహిల్స్ (హైదరాబాద్)/సాక్షి, కామారెడ్డి: క్రీడారంగంలోనైనా, ఎక్కడైనా లైంగిక వేధింపులకు గురవుతున్నట్టైతే ఆడపిల్లలు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని కామారెడ్డి జిల్లాకు చెందిన మార్షల్ ఆర్ట్స్ జాతీయ స్థాయి క్రీడాకారిణి సూచించారు. అదే సమయంలో క్రీడారంగంలోకి ఎంతో ఇష్టంగా వస్తున్న ఆడపిల్లలను వేధిస్తూ వారి మనోధైర్యాన్ని దెబ్బతీసే వారిపై ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ఆమె అన్నారు. తెలంగాణ జిల్లాల నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభించకపోగా, కొందరు అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు బాధిస్తున్నాయని చెప్పారు. ఆడపిల్లలు ఎందులోనూ త క్కువ కాదని, వారిని ప్రోత్సహించాల్సిందిపోయి వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇటీవల హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. క్రీడాకారిణులు, ఆడపిల్లలు ఆత్మవిశ్వాసం, ధైర్యంతో వ్యవహరించినట్టైతే వేధింపులకు పాల్పడే వారికి తగిన బుద్ధి చెప్పవచ్చని చెప్పారు. తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని, అయితే తాను గట్టిగా హెచ్చరించి వేధింపుల నుంచి బయటపడ్డానని తెలిపారు. రాష్ట్ర క్రీడా మంత్రి పేషీలో పని చేసే ఓ వ్యక్తి తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని చెప్పారు. వివరాలు ఆమె మాటల్లోనే.. నువ్వు క్యూట్‌గా ఉన్నావు..ఎప్పుడు కలుద్దాం అన్నాడు ‘బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో నివసించే క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేషీలో డేటాఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సురేందర్ తాను మంత్రి పీఏనని నాకు చెప్పాడు. నాకు 2022 నవంబర్‌లో తైక్వాండ్‌లో సిల్వర్, చెస్ బాక్సింగ్‌లో బంగారు పతకం లభించాయి. ఈ విషయాన్ని మంత్రికి చెప్పాల్సిందిగా సురేందర్‌కు మెసేజ్ చేశా. గత ఏడాది జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆర్థిక సాయానికి సంబంధించిన సిఫార్సు లేఖ ఇవ్వడానికి మరోసారి మంత్రి క్వార్టర్స్‌కు వెళ్లా. ఇంగ్లాండ్‌లో జరిగిన పోటీలో పతకం లభించినప్పుడు కూడా మెసేజ్ చేశా. ఆయా సందర్భాల్లో సురేందర్ ‘నువ్వు చాలా అందంగా (క్యూట్‌గా) ఉంటావు. మనం ఎక్కడ కలుసుకుందామంటూ ప్రపోజల్ పెట్టాడు. అసలు విషయం పక్కన పెట్టి క్యూట్‌గా ఉన్నావు.. నన్ను కలుస్తావా..? నీ వయస్సెంత? అంటూ మెసేజ్‌లు పంపాడు. రకరకాలుగా వేధింపులకు గురి చేయడంతో ఇక లాభం లేదనుకుని గట్టిగా వార్నింగ్ ఇచ్చా. తాను మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణిని అని, నాతో పెట్టుకుంటే బాగుండదని, బాడీలో ఏ ఒక్క పార్ట్ పనిచేయకుండా కొడతానని తీవ్రస్థాయిలో హెచ్చరించా. దీంతో సురేందర్ దారికొచ్చి క్షమాపణ చెప్పాడు. అప్పట్నుంచీ నాతో మర్యాదగానే ప్రవర్తించాడు..’ అని ఆమె తెలిపారు. వాస్తవం ఇలా ఉంటే ఓ చానెల్లో మాత్రం (సాక్షి కాదు) తన అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు కథనం ప్రసారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
రూ. 5,900 కోట్లకు స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్‌లు
ముంబై: క్రీడలు, క్రీడాకారులకు లభించే స్పాన్సర్‌షిప్‌లు గతేడాది (2022) రెట్టింపయ్యాయి. రూ. 5,907 కోట్లకు చేరాయి. ఇందులో సింహభాగం వాటా 85 శాతాన్ని క్రికెట్టే దక్కించుకుంది. మీడియా ఏజెన్సీ గ్రూప్ఎం రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2022లో స్పోర్ట్స్ సెలబ్రిటీలు రూ. 729 కోట్ల మేర స్పాన్సర్‌షిప్‌లు పొందారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 20 శాతం అధికం. అత్యధికంగా అందుకున్న టాప్ క్రీడాకారుల్లో విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, సచిన్ టెండుల్కర్, నీరజ్ చోప్రాలతో పాటు పీవీ సింధు కూడా ఉన్నారు. గతేడాది మొత్తం మీద క్రీడలపై ఖర్చులు రూ. 9,500 కోట్ల నుంచి రూ. 14,000 కోట్లకు చేరినట్లు గ్రూప్ఎం తెలిపింది. ‘2021తో పోలిస్తే భారత్‌లో క్రీడల స్పాన్సర్‌షిప్‌లు అసాధారణంగా 105 శాతం మేర వృద్ధి చెందాయి‘ అని పేర్కొంది. ఐపీఎల్ దన్ను.. ► ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెరగడం, కొత్తగా మరో రెండు టీమ్‌లు వచ్చి చేరడం, ఐసీసీ టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్, ఫిఫా వరల్డ్ కప్‌తో పాటు మారథాన్లు, కామన్వెల్త్ గేమ్స్ మొదలైనవి 2022లో క్రీడలపై చేసే ఖర్చు పెరగడానికి తోడ్పడ్డాయి. ► గతేడాది వచ్చిన స్పాన్సర్‌షిప్‌లలో క్రికెట్ 85% దక్కించుకోగా.. ఫుట్‌బాల్, కబడ్డీ మొదలైనవి 15 శాతంతో సరిపెట్టుకున్నాయి. కొత్త క్రీడలకు స్పాన్సర్‌షిప్‌లు భారీగా పెరుగుతున్నాయి. ► విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ తలో 30 పైగా బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ తదితరులు కూడా పుంజుకుంటున్నారు. ► కొన్నాళ్లుగా క్రీడలపై వ్యయాలు వార్షికంగా సగటున 14 శాతం మేర వృద్ధి చెందుతున్నాయి. ఎకానమీలో అత్యంత మెరుగ్గా రాణిస్తున్న రంగాల్లో ఇది కూడా ఒకటిగా ఉంటోంది. ► 2023 సీజన్ తర్వాత ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌ల రెన్యువల్, బీసీసీఐ హోమ్ సిరీస్ టైటిల్, టీమ్ ఇండియా స్పాన్సర్షిప్, బీసీసీఐ హోమ్ సిరీస్ మీడియా హక్కులు, మార్చిలో జరిగిన డబ్ల్యూపీఎల్ ప్రారంభ సీజన్ మొదలైన వాటితో భారత్‌లో స్పాన్సర్‌షిప్‌లు ఈ ఏడాది తారా స్థాయికి చేరనున్నాయి. -
ఆటపిల్లలు
లైఫ్‌లో గెలుపు, ఓటమి ఉంటుంది కానీ మగవాడు, ఆడపిల్ల అని వ్యత్యాసం ఉండకూడదు. లైఫే ఒక గేమ్ అయినప్పుడు ఆడపిల్ల ఆటపిల్లగా గెలవడం చాలా అవసరం. రియల్ లైఫ్‌లో మేరీ కామ్, కరణం మల్లీశ్వరి, సైనా నెహ్వాల్, సానియా మీర్జా, మిథాలీ రాజ్, సింధు, జ్యోతి సురేఖ.. వీళ్లంతా హిట్లు కొట్టిన వాళ్లే. ఇప్పుడు సినిమాల్లో కూడా ఆడపిల్లలు ఆటపిల్లలుగా హిట్లు కొట్టబోతున్నారు. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’... మంచి పాజిటివ్ ఫీల్ కలుగుతోంది కదూ. దాదాపు 70ఏళ్ల క్రితం శ్రీశ్రీ రాసిన పాట ఇది. 1980 తర్వాత హీరోయిన్లంటే గ్లామర్‌కే అనే రోజులు వచ్చాయి. ఇప్పుడు మంచి రోజులొచ్చాయి. అవును.. కథానాయికలకు మంచి రోజులొచ్చాయి. హీరోయిన్లంటే ‘ఆటా పాట’లకే కాదు.. అనే రోజులు పోయాయి. ఆటాపాటల నుంచి ‘ఆట’లోనూ బెస్ట్ అని ప్రూవ్ చేసుకునే రోజులు వచ్చాయి. సుకుమారానికి చిరునామా కాదు మేం... వీర వనితలం మేం అని కథానాయికలు గ్రేట్‌గా చెప్పుకునే రోజులు వచ్చాయి. సిల్వర్ స్క్రీన్‌పై ‘ఆట పిల్లలం మేం’ అని గొప్పగా చెప్పుకునే కాలం వచ్చింది. పాటలకే కాదు ఆటలకు కూడా ‘సై’ అంటున్నారు గ్లామర్ గర్ల్స్. సిల్వర్ స్క్రీన్‌పై చాకచక్యంగా ఆటాడేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నాయికలు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ చేసి, తమలో మంచి ప్లేయర్ ఉందని రీల్‌పై నిరూపించుకున్నారు. ఇప్పుడు మరికొంతమంది నాయికలు ఆ పని మీద ఉన్నారు. గోల్‌పై గురి ఏం సక్కగున్నవ్రో.. సొట్ట సెంపలోడ... ఫస్ట్ సినిమా ‘ఝుమ్మంది నాదం’లో హీరో మనోజ్‌ని కవ్వించారు తాప్సీ. ఆ సినిమాలో ఈ ఢిల్లీ భామ మొహమాటపడకుండా గ్లామరస్‌గా కనిపించారు. అఫ్కోర్స్ బాగా నటించారు కూడా. అయినా అప్పటి నుంచి కంటిన్యూస్‌గా గ్లామరస్ రోల్సే. ‘షాడో’ సినిమాలో అయితే ఏకంగా బికినీలో కనిపించారు. సీన్ డిమాండ్ చేసింది మరి. అలాంటి తాప్సీ ఇప్పుడు మరో విధంగా రెచ్చిపోతున్నారు. చెట్టు చెట్టూ పాటలు పాడుకుంటూ ఎన్నాళ్లు తిరుగుతారు. చేతిలో హాకీ బ్యాట్ పట్టుకుని గురి చూసి, గోల్ పోస్ట్‌పై గురి పెట్టారు. ‘పింక్’, ‘నామ్ షబానా’ వంటి హిందీ సినిమాల్లో గ్లామర్ వైజ్‌గా బ్యాక్ సీట్ తీసుకుని, పెర్ఫార్మెన్స్కి ఫ్రంట్ సీట్ ఇచ్చారు. ఇప్పుడు ‘సూర్మా’లో హాకీ ప్లేయర్ హర్ప్రీత్గా నటిస్తున్నారు. భారతీయ హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఫిమేల్ హాకీ ప్లేయర్‌గా నటిస్తున్నారు తాప్సీ. ‘‘మా నాన్నగారు హాకీ ప్లేయర్. నా చిన్నప్పుడు ఆయన ఢిల్లీ యూనివర్సిటీ కోసం హాకీ ఆడారు. ఒకవేళ నేను హీరోయిన్ కాకపోయి ఉంటే స్పోర్ట్స్‌లో ఉండేదాన్ని. ఏదేమైనా మా నాన్నగారి ఫేవరెట్ ఆటను నేను సినిమా కోసం ఆడతానని అనుకోలేదు’’ అన్నారు తాప్సీ. ‘సూర్మా’ షూటింగ్ మొదలు కాక ముందు ఆమె కొన్నాళ్లు హాకీ ఆటలో ట్రైనింగ్ తీసుకున్నారు. నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్ చేయాలనే తాప్సీ గోల్‌ను ఈ చిత్రం కొంతవరకూ తీర్చింది. వచ్చే నెల 13న ఈ సినిమా రిలీజ్ కానుంది. లవ్.. లవ్... విలన్ కూతురు లేడీ విలన్ అవ్వాలా? ఎవరన్నారు? హీరోయిన్ అవ్వొచ్చు. మంచి పేరు తెచ్చుకోవచ్చు. ఇందుకు శ్రద్ధా కపూర్ బెస్ట్ ఎగ్జాంపుల్. తండ్రి శక్తి కపూర్ ఎంత పెద్ద విలనో తెలిసిందే. కూతురిలో మాత్రం మంచి హీరోయిన్ ఉంది. కెరీర్ స్టార్టింగ్‌లోనే ‘ఆషికీ 2’లో అద్భుతంగా నటించారు శ్రద్ధా కపూర్. ఎవరైనా మంచి చాన్స్ ఇస్తే చాలు.. వర్కవుట్ చేసేసుకుంటారు. కొన్ని సక్సెస్‌లు, ఎక్కువ ఫ్లాపులతో శ్రద్ధా జర్నీ సాగుతోంది. ‘సాహో’తో తెలుగుకి పరిచయం కానున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఖాతాలో మరో మంచి అవకాశం పడింది. ‘లవ్ లవ్..’ అంటూ ఈ సినిమాలో లవ్వాడాలనుకుంటున్నారు శ్రద్ధా. లవ్‌స్టోరీ కాదండీ.. బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా ‘లవ్ 1, లవ్ 2’ అనబోతున్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తీయబోతున్న సినిమాలో శ్రద్ధా కథానాయికగా నటించనున్నారు. ఎంతో శ్రద్ధగా బ్యాడ్మింటన్ నేర్చుకున్నారు. సైనాని కలిశారు. ఆ సమయంలో టిప్స్ తీసుకునే ఉంటారు. కానీ అనుకున్న సమయానికి సినిమా ఆరంభం కాలేదు. శ్రద్ధా ఇతర సినిమాల షెడ్యూల్స్ ఓ కారణం అయితే, బ్యాడ్మింటన్ ఆటలో ఇంకా పట్టు సాధించాలనుకుంటున్నారట. అదొక కారణం. ఈ ప్రాజెక్ట్‌ని ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఈ నెల మొదలవుతుందని వార్త వచ్చింది. అయితే వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా మొదలవుతుందట. అమోల్ గుప్తా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పట్టాలెక్కడమే ఆలస్యం. ర్యాకెట్‌తో షెటిల్ కాక్‌ను రఫ్ఫాడించడానికి శ్రద్ధా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఫోర్లు.. సిక్సర్లు... మేల్ క్రికెట్ అంతగా పాపులర్ అవ్వలేదు ఉమెన్ క్రికెట్. ఇక్కడ శ్రీశ్రీ పాటను గుర్తు చేసుకోవాలి. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’. మహిళా క్రికెట్‌కి కూడా బోలెడంత పాపులార్టీ వస్తుందని ఆశిద్దాం. ఆ సంగతలా ఉంచితే క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రస్తుతం రెండు చిత్రాలు రూపొందుతున్నాయి. అట్టకత్తి, కాక్కముటై్ట.. వంటి పలు చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేసిన ఐశ్వర్యా రాజేష్ క్రికెటర్‌గా ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ‘‘చిన్న పట్టణానికి చెందిన ఓ యువతి క్రికెటర్‌గా ఎంత పేరు తెచ్చుకుంది? అనేది ఈ సినిమా కథ. నిజం చెప్పాలంటే ఇప్పటివరకూ నేను ఉమెన్ క్రికెట్‌ని చూడలేదు. ఈ సినిమా ఒప్పుకున్నాకే చూశాను. గేమ్ తెలియకుండా ఆడటం చాలా కష్టం. అందుకే క్రికెట్ కోచింగ్‌కి వెళ్లాను. లేడీ క్రికెటర్ పాత్ర చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు ఐశ్వర్యా రాజేష్. రజనీకాంత్ ‘కబాలి’లో ‘నెరుప్పుడా..’ (నిప్పురా..) పాట రాసిన అరుణ్ రాజా కామరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరో క్రికెట్ బేస్డ్ మూవీ విషయానికొస్తే.. ఇది తెలుగు సినిమా. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ విజయ్ దేవరకొండ, ‘ఛలో’ ఫేమ్ రష్మికా మండన్నా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక క్రికెటర్‌గా కనిపించనున్నారు. ‘‘నా జీవితంలో నేను క్రికెట్ బ్యాట్ పట్టుకోలేదు. ఈ సినిమా కోసం ట్రైనింగ్ తీసుకున్నాను. క్రికెట్ ఆట అంత సులువు కాదని అర్థమైంది. ట్రైనింగ్ తీసుకున్నాక ఉమెన్ క్రికెటర్లపై నాకు గౌరవం పెరిగింది’’ అని రష్మికా మండన్నా పేర్కొన్నారు. భరత్ కమ్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సిల్వర్ స్క్రీన్‌పై ఐశ్వర్య, రష్మిక కొట్టబోయే సిక్సర్లు చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. గురి చూస్తే.. సాగరిక గట్గే ఓ సినిమాలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా చేయనున్నారు. తొలిసారి ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది స్పోర్ట్స్ మూవీ ద్వారానే. షారుక్ ఖాన్ ‘చక్ దే ఇండియా’లో సాగరిక హాకీ ప్లేయర్‌గా సపోర్టింగ్ రోల్ చేశారు. ఇప్పుడు ‘మాన్సూన్ ఫుట్‌బాల్’ మూవీలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా నటించనున్నారు. రియల్ లైఫ్‌లో సాగరికకూ, క్రికెట్‌కు అవినాభావ సంబంధం ఉంది. క్రికెటర్ జహీర్ ఖాన్, సాగరిక గతేడాది లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సంగతలా ఉంచి.. ‘మాన్సూన్ ఫుట్‌బాల్’ విషయానికొస్తే... కొందరు గృహిణులు ఫుట్‌బాల్ టీమ్‌గా ఏర్పడడానికి ఎలాంటి కృషి చేశారు? అనే కథతో దర్శకుడు మిలింద్ ఉకే ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆ మధ్య ముంబైలో జరిగిన ‘ఉమెన్ ఫుట్‌బాల్ లీగ్’ ఈవెంట్లో ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఆట ఆడుతున్న అమ్మాయిలను సాగరిక చీరప్ చేశారు. ఆ ఈవెంట్‌కి చీర కట్టుకుని వెళ్లిన సాగరిక కాన్వాస్ షూస్ వేసుకుని, సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. కానీ, సినిమా కోసం సీరియస్‌గా ప్రాక్టీస్ చేశారు. వీళ్లలానే మరికొందరు స్పోర్ట్స్ మూవీస్ చేయడానికి రెడీ అవుతున్నారు. కష్టాన్ని ఇష్టంగా చేసుకుని హీరోయిన్లు కష్టపడుతున్నారు. భేష్ అనాల్సిందే. మేరీ కామ్‌తో మూవ్మెంట్ స్పోర్ట్స్ బ్యాక్ మూవీస్ ఈ మధ్య ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఫిమేల్ స్పోర్ట్స్ మూవీస్ ఎక్కువ అవ్వడానికి ముఖ్య కారణం ‘మేరీ కామ్’ అని చెప్పొచ్చు. బాక్సర్ మేరీ కామ్ జీవితం ఆధారంగా తీసిన ‘మేరీ కామ్’లో ప్రియాంకా చోప్రా టైటిల్ రోల్ చేశారు. ‘ఫ్యాషన్ గర్ల్’ అనిపించుకున్న ప్రియాంకా చోప్రా ఆ సినిమాలో బాక్సింగ్ రింగ్‌లో రెచ్చిపోయిన వైనం అందర్నీ ఆకట్టుకుంది. ప్రియాంకలో మంచి నటి ఉందని నిరూపించిన సినిమాల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. అలాగే, ‘గురు’ సినిమాలో రితికా సింగ్ గురించి చెప్పాలి. ఈమె రియల్ కిక్ బాక్సర్. దర్శకురాలు సుధ కొంగర కావాలనే ఆమెను ‘ఇరుది సుట్రు’ సినిమాకి తీసుకున్నారు. ఇదే సినిమా హిందీలో ‘సాలా ఖడూస్’గా రూపొందింది. తెలుగులో ‘గురు’గా రీమేక్ చేశారు. రియల్ లైఫ్ క్యారెక్టర్ని రీల్‌పై సునాయాసంగా చేసేశారు రితికా. ‘గురు’లో వెంకటేశ్ కోచ్‌గా నటించారు. ప్రముఖ మల్లయోధుడు మహావీర్ సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘దంగల్’. తండ్రిలానే మంచి రెజ్లర్స్ అనిపించుకున్న మహావీర్ సింగ్ కుమార్తెలు గీత ఫోగట్, బబితా ఫోగట్‌గా ఈ చిత్రంలో ఫాతిమా సనా షేక్, జైరా వసీమ్, మహావీర్‌గా ఆమిర్ ఖాన్ నటించారు. ఫాతిమా, వసీమ్ ఈ సినిమాలో జరిగిన మల్లయుద్ధంలో ఎలాంటి పట్లు పట్టారంటే...‘దంగల్’ చిత్రం చైనా, జపాన్ వంటి ఇతర దేశాల్లో ఆడియన్స్ కూడా చప్పట్లు కొట్టేంత గట్టి పట్టుపట్టారు. బాక్సాఫీస్ రాజ్యాన్ని రాజులే కాదు. రాణులు కూడా పరిపాలించగలరని నిరూపించారు. ఇక ‘సుల్తాన్’ సినిమాలో రెజ్లర్‌గా అనుష్కాశర్మ అదుర్స్. అనుష్కా బరిలోకి దిగితే ఎంతటి రెజ్లర్ అయినా మట్టికరవాల్సిందే అనేలా చేశారు. – డి.జి.భవాని -
కబడ్డీ కోర్టులోనూ క్యాస్టింకౌచ్!
-
జీవితాలతో 'ఆటా'డుకున్నాడు..!
కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వీరలంకయ్య తమ జీవితాలతో ఆటాడుకున్నాడని పలువురు క్రీడాకారిణులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లను అమ్ముకోవడం ద్వారా ఇప్పటికే ఎంతో మందికి అన్యాయం చేశారని ఆరోపించారు. విజయవాడ స్పోర్ట్స్: ‘తాను రైల్వేలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశా.. కబడ్డీ ఫెడరేషన్ ఇచ్చిన సర్టిఫికెట్ నిజమైనదేనంటూ ఇచ్చే ఫాం–2ని ఇవ్వమని కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వీర్లలంకయ్యని ఫోన్లో అభ్యర్థించాను.. అందుకు రూ.లక్షలు డిమాండ్ చేశారు.. పైగా ‘నీకిస్తే నీ నుంచి నాకేంటి లాభం’ అంటూ ముక్తయించారని విశాఖపట్నంకు చెందిన క్రీడాకారిణి సునీత ఆరోపించారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలోని కబడ్డీ గ్రౌండ్లో గురువారం కబడ్డీ అసోసియేషన్ కృష్ణా జిల్లా కార్యదర్శి వై.శ్రీకాంత్‌తో కలసి క్రీడాకారిణులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సునీత మాట్లాడుతూ సర్టిఫికెట్ కోసం అక్కడికి, ఇక్కడికి వెళ్లాల్సి ఉంటుందని అర్థమై, అర్థం కాని రీతిలో లైంగికంగా వేధించారని పేర్కొంది. అదేమని అడిగితే డైవర్ట్ చేసి మాట్లాడేవారని వివరించారు. తాను 15 నేషనల్స్ ఆడిన చివరకు ఫాం–2 అడిగితే నిరు పేదనైన నన్ను వీరలంకయ్య చాలా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. క్రీడాకారిణిలు మాట్లాడుతూ ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.వీర్లలంకయ్య సర్టిఫికెట్లను అమ్ముకోవడం ద్వారా ఇప్పటికే ఎంతో మంది క్రీడాకారుల జీవితాలు నాశనమం చేశారని చెప్పారు. క్రీడాకారిణి హత్య వెనుక.. సర్టిఫికెట్లు అమ్ముకుంటున్నారని నిలదీసిన కారణంగా 1995లో ప్రియదర్శిని అనే క్రీడాకారిణిని కారులో వీరలంకయ్య హత్య చేశారని ఆరోపించారు. వీరలంకయ్యను అసోసియేషన్ నుంచి తొలిగించాలని డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలపై సీఎం చంద్రబాబుతో సహా ఉన్నతాధికారులందరికీ ఫిర్యాదు చేశామని, ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 20 ఏళ్లుగాకొనసాగడం నేరం వీరలంకయ్య 20 ఏళ్లుగా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉండడం నేరమని కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వై.శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆడినవారికి కాకుండా బయట వ్యక్తులకు కబడ్డీ సర్టిఫికెట్లు అమ్ముకున్నారని తన వద్ద ఆధారాలు ఉన్నాయని విలేకరులకు తెలిపారు. ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కేఈ ప్రభాకర్ న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో కబడ్డీ క్రీడాకారిణులు ధనలక్ష్మి, సునీత, గౌతమి(విశాఖపట్నం), నవ్య, కేఎల్వీ రమణ(కృష్ణా) పాల్గొన్నారు. -
క్రీడా పాటవంతో ఖండాంతరయానం
బాస్కెట్‌బాల్‌లో రాణిస్తున్న పేదబాలికలు అమెరికా పర్యటనకు ఎంపిక చేసిన ‘మ్యాజిక్ బస్సు’ 15 రోజులు ఆ దేశంలో ఉన్న శ్రావణి, అశ్వినిప్రియ అక్కడి పోటీల్లోనూ విజయాలు నమోదు రాజమహేంద్రవరం సిటీ / తాడితోట : విమానం ఎక్కడమే కలలోని మాటగా భావించే కుటుంబాలకు చెందిన ఆ ఇద్దరు బాలికలూ ఖండాంతరయానం చేసి వచ్చారు. భూగోళానికి ఆవలివైపున అమెరికాలో 15 రోజులు పర్యటించారు. క్రీడామైదానంలో మెరుపుల్లా కదిలే ఆ బాలలిద్దరూ గోదారి బిడ్డలే. రాజమమహేంద్రవరానికి చెందిన లంకా సాయి శ్రావణి, ఇండిగిబిల్లి అశ్వినిప్రియ అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన బాస్కెట్‌బాల్ శిక్షణ, పోటీల్లో పాల్గొని సోమవారం నగరానికి తిరిగి వచ్చారు. ఈ పర్యటన తమకెంతో ఆనందాన్నిచ్చిందని వారు చెప్పారు. స్థానిక దానవాయి పేట మున్సిపల్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న శ్రావణి, అశ్వినిప్రియ బాస్కెట్ బాల్ క్రీడలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. పలు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన వీరిని ‘మ్యాజిక్ బస్సు’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ గుర్తించింది. ఈ సంస్థ మురికివాడలలోని బాల,బాలికల్లో వివిధ క్రీడలలో ఆసక్తిగల వారిని గుర్తించి, శిక్షణ ఇచ్చి అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతుంది. ఈ నేపథ్యంలోనే శ్రావణి, అశ్వినిప్రియలను అమెరికా ప్రయాణానికి ఎంపిక చేసింది. ఈ నెల 9న రాజమహేంద్రవరం నుంచి బయలుదేరిన వీరు అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్, న్యూజెర్సీలలో 15 రోజుల పాటు బాస్కెట్ బాల్ క్రీడలో శిక్షణ పొందారు. అక్కడ వివిధ జట్ల మధ్య జరిగిన పోటీలలో పాల్గొని విజయం సాధించారు. న్యూయార్క్‌లో ఆరు రోజులు శిక్షణ పొందిన తాము న్యూజెర్సీలో ఆరు రోజులు పోటీలలో పాల్గొన్నట్లు వారు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 12 మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించగా ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపికయ్యారని, రాజమహేంద్రవరం నుంచి తామిద్దరం ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మరో 20 మందిని తీర్చిదిద్దుతాం.. అమెరికా వచ్చిన క్రీడాకారులందర్నీ కలిపి 30∙టీమ్‌లుగా కేటాయించారని, తాము జర్మనీ పేరుతో గల టీమ్‌లో ఆడి విజేతగా నిలిచామని శ్రావణి,అశ్వినిప్రియ చెప్పారు. విజేతగా నిలిచిన తమకు సర్టిఫికెట్లు అందజేశారని తెలిపారు. తమకు లభించిన అవకాశం ద్వారా క్రీడలతో పాటు అనేక అంశాలు నేర్చుకున్నామన్నారు. దానిలో భాగంగానే చదువు మానేసిన వారిని గుర్తించి వారు తిరిగి పాఠశాలకు వెళ్ళేలా, క్రీడలలో ఆరితేరేలా తీర్చిదిద్దే ప్రాజెక్టును తమ్కు అప్పగించారని, దానిని సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు. తమకు మరలా మ్యాజిక్ బస్సు ద్వారా అమెరికా వెళ్ళే అవకాశం వస్తే తమ స్థానంలో మరో ఇద్దరు క్రీడాకారులను పంపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సిమెటరీపేటలో వెల్లివిరిసిన ఆనందం నిరుపేద కుటుంబాలలో పుట్టిన శ్రావణి, అశ్వినిప్రియ రాజమహేంద్రవరంలో సిమెటరీ పేటలో నివసిస్తుంటారు. వీరి తండ్రులు ప్రైవేటు ఎలక్రీ్టషియన్‌లుగా జీవనం సాగిస్తున్నారు. తల్లులు గృహిణులు. వీరు అమెరికా వెళ్ళి తిరిగి రావడంతో సోమవారం రాత్రి సిమెటరీపేటలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. స్థానికులు, స్నేహితులు, బంధువులు వీరిని అభినందనలతో ముంచెత్తారు. పుష్పగుచ్ఛాలు అందించి వెన్నుతట్టారు.