న్యూఢిల్లీ:టీం ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ పై భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో భువనేశ్వర్ కుమార్ ఆరు వికెట్లు తీసి బేడీ రికార్డును తిరగరాశాడు. దీనిపై బేడీ స్పందించారు. ఈ 24 ఏళ్ల మీరట్ ఆటగాడు భారత్ తరుపున తన రికార్డు అధిగమించినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ' ఆ యువ ఆటగాడు నా తరహా ఆటగాడే. టెస్టుల్లో బెస్ట్ బౌలింగ్ ను నమోదు చేశాడు'అని బేడీ తెలిపారు. అంతకు ముందు ఇంగ్లండ్ పై బిషన్ సింగ్ బేడీ ఆడిన చివరి టెస్టులో నెలకొల్పిన (5/82) రికార్డే ఇప్పటి వరకూ పదిలంగా ఉంది.
భువనేశ్వర్ కుమార్ శుక్రవారం చెలరేగి బౌలింగ్ చేయడంతో ఆరు ఇంగ్లిష్ ఆటగాళ్ల వికెట్లను నేలకూల్చాడు.భారత్ నుంచి ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన జాబితాతో ముగ్గురు ఆటగాళ్లే మాత్రమే ఉన్నారు. 1936లో క్రికెట్ ఆడిన లధా అమర్ సింగ్, 1974 ప్రాంతంలో క్రికెట్ ఆడిన బిషన్ సింగ్, తాజాగా భువనేశ్వర్ కుమార్ లు మాత్రమే ఆ జాబితాలో చోటు దక్కించుకున్నారు.