
న‍్యూఢిల్లీ:గత కొన్నేళ్లుగా పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లకు భారత క్రికెట్ జట్టు దూరంగా ఉండటాన్ని దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ తప్పుబట్టారు. కేవలం రాజకీయాలు కారణంగానే ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు తెగిపోయాయని విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక క‍్రీడను క్రీడగానే చూడాలే కానీ, ఇక్కడ రాజకీయాలతో కలుషితం చేయడం ఎంతమాత్రం సరికాదన్నాడు. అసలు పాకిస్తాన్ తో క్రికెట్ ఆడకుండా ఉంటే ఉగ్రవాదాన్ని నిరోధించవచ్చనే ప్రభుత్వ నిర్ణయాన్ని బేడీ పరోక్షంగా తప్పుపట్టాడు.
'క్రికెట్‌లో రాజకీయాలేమిటి.. పాకిస్తాన్ తో క్రికెట్ ఆడకుండా ఉంటే ఉగ్రవాదం కంట్రోల్ అయిపోతుందా. ఇరు దేశాల మధ్య సఖ్యత వాతావారణం నెలకొనాలంటే క్రికెట్ అనే దాన్ని ఒక ప్లాట్‌ఫామ్ గా ఉపయోగించుకోవాలి. అంతేకానీ పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడకపోతేనే దేశభక్తి ఉందనుకోవడం పొరపాటు. మనం అవలంభించే ఏదొక విధానం మన దేశభక్తిని తెలియచేయదు. నేను ఇక్కడ మాట్లాడేది కేవలం పాకిస్తాన్‌తో సిరీస్‌లకు సంబంధించి మాత్రమే.. అంతేకానీ భారతదేశానికి నేను వ్యతిరేకంగా మాట్లాడటం లేదు' అని బిషన్ సింగ్ బేడీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment