నచ్చని పనులు చేస్తే పేరెంట్స్ కోప్పడటం సహజమే.. కానీ తాను చేసిన పనికి తండ్రి 15 ఏళ్లపాటు మాట్లాడలేదంటున్నాడు బాలీవుడ్ నటుడు అంగద్ బేడీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. టీనేజ్‌లో నా జుట్టు కత్తిరించుకున్నందుకు మా నాన్న (దివంగత క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ) బాధపడ్డాడు. కానీ నాపై కోప్పడలేదు.
నాకసలు నచ్చలేదు
కోప్పడినా బాగుండేది కానీ ఇలా లోలోపలే బాధపడటం నాకసలు నచ్చలేదు. నేనొక సిక్కును కాబట్టి జుట్టు, గడ్డం పొడవుగా పెంచుకోవాలని అందరూ చెప్తుండేవారు. ఎప్పటికైనా ఆ పని చేయగలనేమో కానీ ఇప్పుడైతే అది సాధ్యపడదు. ఎందుకంటే సినిమాల్లో నా జుట్టు పెద్దగా ఉండకూడదని చెప్పేవారు.
20 ఏళ్ల తర్వాత
అందుకని నా వృత్తి కోసం జుట్టు, గడ్డం కత్తిరించుకోక తప్పలేదు. దాదాపు 20 ఏళ్లపాటు ఆయన దిగులుపడుతూనే ఉన్నారు. పింక్ (2016) సినిమా రిలీజయ్యాక ఆయన నన్ను గట్టిగా హత్తుకున్నారు. నీ దారి నువ్వు ఎంచుకున్నావు.. నువ్వు చేయాల్సింది చేస్తున్నావ్.. కానీ మంచి అవకాశాల్ని ఎంచుకోమని సలహా ఇచ్చాడు.
33 ఏళ్ల వయసులో..
నాకు బాగా గుర్తు.. ఎప్పుడో 18 ఏళ్ల వయసులో జుట్టు కత్తిరించుకున్నా.. పింక్ సినిమా వచ్చేనాటికి నాకు 33 ఏళ్లు. దాదాపు 15 ఏళ్ల తర్వాత కానీ నాన్న నాతో మునుపటిలా మాట్లాడలేదు అని చెప్పుకొచ్చాడు. కాగా అంగద్ బేడీ.. టైగర్ జిందా హై, డియర్ జిందగీ, పింక్ వంటి పలు చిత్రాల్లో నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment