Angad Bedi
-
ఆ పని చేసినందుకు నాన్న 15 ఏళ్లు మాట్లాడలేదు: నటుడు
నచ్చని పనులు చేస్తే పేరెంట్స్ కోప్పడటం సహజమే.. కానీ తాను చేసిన పనికి తండ్రి 15 ఏళ్లపాటు మాట్లాడలేదంటున్నాడు బాలీవుడ్ నటుడు అంగద్ బేడీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. టీనేజ్‌లో నా జుట్టు కత్తిరించుకున్నందుకు మా నాన్న (దివంగత క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ) బాధపడ్డాడు. కానీ నాపై కోప్పడలేదు. నాకసలు నచ్చలేదుకోప్పడినా బాగుండేది కానీ ఇలా లోలోపలే బాధపడటం నాకసలు నచ్చలేదు. నేనొక సిక్కును కాబట్టి జుట్టు, గడ్డం పొడవుగా పెంచుకోవాలని అందరూ చెప్తుండేవారు. ఎప్పటికైనా ఆ పని చేయగలనేమో కానీ ఇప్పుడైతే అది సాధ్యపడదు. ఎందుకంటే సినిమాల్లో నా జుట్టు పెద్దగా ఉండకూడదని చెప్పేవారు. 20 ఏళ్ల తర్వాతఅందుకని నా వృత్తి కోసం జుట్టు, గడ్డం కత్తిరించుకోక తప్పలేదు. దాదాపు 20 ఏళ్లపాటు ఆయన దిగులుపడుతూనే ఉన్నారు. పింక్ (2016) సినిమా రిలీజయ్యాక ఆయన నన్ను గట్టిగా హత్తుకున్నారు. నీ దారి నువ్వు ఎంచుకున్నావు.. నువ్వు చేయాల్సింది చేస్తున్నావ్.. కానీ మంచి అవకాశాల్ని ఎంచుకోమని సలహా ఇచ్చాడు.33 ఏళ్ల వయసులో..నాకు బాగా గుర్తు.. ఎప్పుడో 18 ఏళ్ల వయసులో జుట్టు కత్తిరించుకున్నా.. పింక్ సినిమా వచ్చేనాటికి నాకు 33 ఏళ్లు. దాదాపు 15 ఏళ్ల తర్వాత కానీ నాన్న నాతో మునుపటిలా మాట్లాడలేదు అని చెప్పుకొచ్చాడు. కాగా అంగద్ బేడీ.. టైగర్ జిందా హై, డియర్ జిందగీ, పింక్ వంటి పలు చిత్రాల్లో నటించాడు. -
మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి
Neha Dhupia, Angad Bedi Blessed with Baby Boy: బాలీవుడ్ నటి నేహా ధూపియా ఆదివారం నాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను నేహా భర్త, నటుడు అంగద్ బేడీ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపాడు. అయితే కొడుకు ఫొటోను మాత్రం రివీల్ చేయలేదు. రెండో బిడ్డకు జన్మనిచ్చిన నేహాకు ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా మిన్నారం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన నేహా తర్వాత జపనీస్ చిత్రంలో నటించింది. 2000 సంవత్సరంలో వచ్చిన 'నిన్నే ఇష్టపడ్డాను' చిత్రంతో టాలీవుడ్లో లక్ పరీక్షించుకుంది. అదే ఏడాది 'ఖయామత్: సిటీ అండర్ త్రెట్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. తర్వాత “క్యా కూల్ హై హమ్”, “షూట్ అవుట్ లోఖండ్వాలా” వంటి హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను తర్వాత విలన్, పరమవీర చక్ర వంటి సినిమాల్లోనూ నటించింది. 2018 మేలో నటుడు, మోడల్ అంగద్ బేడీని పెళ్లి చేసుకోగా అదే సంవత్సరం నవంబర్‌లో మెహర్ అనే బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by ANGAD BEDI (@angadbedi) -
ప్రెగ్నెన్సీ వల్ల.. మూవీస్ నుంచి తొలగించారు
బాలీవుడ్ ఇండస్ట్రీలోని హ్యాపీ కపుల్స్‌లో నేహా ధూపియా, అంగద్ బేడి జంట ఒకటి. ఇద్దరూ యాక్టర్స్‌గా తమ కెరీర్‌ని సక్సెస్‌పుల్‌గా కొనసాగిస్తూనే వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ దంపతులకు ఇప్పటికే మెహర్ అనే కూతురు ఉండగా, నేహా మరోసారి ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ విషయాన్ని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ఈ జంట. అయితే ఇటీవల ఓ ఇంటర్వూలో అంగద్ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత తాము ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నాడు. ‘నేహా రెండో సారి ప్రెగ్నెంట్ కావడంతో అనేక ప్రాజెక్టులను కొల్పోవాల్సి వచ్చింది. ఎవరు కూడా తనని అలాగే కొనసాగించడానికి ఇష్టపడలేదు. నా పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. అనేక ప్రాజెక్టుల నుంచి తప్పించారు. ఈ ఇండస్ట్రీలో మనం చాలా ఏళ్లు ఉంటాం. అందువల్ల అవన్నీ మరిచిపోయి జీవితంలో ముందుకు సాగిపోవాలి. అలా నన్ను తీసేసిన తర్వాత అంతకంటే మంచి మనుషులు, క్రేజీ ప్రాజెక్టులలో పని చేసే అవకాశం లభించింది. అదే జీవితం అంటే’ అని అంగద్ తెలిపాడు. అయితే ప్రెగ్నెన్సీ మూలంగా ఎంతోమంది నేహాని సినిమాల నుంచి తీసేసినా, ఆమె ప్రస్తుతం చేస్తున్న చిత్రం గురువారం డెరెక్టర్ బెహజాద్ ఖంబాట స్క్రీన్‌పై గర్భిణి పోలీసుగా తెరపై చూపించడానికి స్క్రిప్ట్‌లో మార్పులు చేశాడని సంతోషం వ్యక్తం చేశాడు. చదవండి: నేను కరీనాకు ఏ విషయంలోనూ సలహాలు ఇవ్వను: సైఫ్ అలీ ఖాన్ View this post on Instagram A post shared by ANGAD BEDI (@angadbedi) -
సన్నాఫ్ రావణ
ప్రభాస్ ముఖ్య పాత్రలో తెరకెక్కనున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తారు. సీత పాత్ర ఎవరు చేస్తారు? అనే విషయాన్ని చిత్రబృందం ప్రకటించలేదు. అయితే రావణాసురుడి కుమారుడు మేఘనాథ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అంగద్ బేడీ నటించనున్నారని సమాచారం. అంటే .. సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కుమారుడి పాత్రలో అంగద్ కనిపిస్తారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. 2022 ఆగస్ట్ 11న ఈ సినిమాను థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతుంది. -
నటుడితో జాన్వీ స్టెప్పులు.. అనిల్ కపూర్‌కు అంకితం
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ తల్లి నుంచి అందంతోపాటు అభినయాన్ని అందిపుచ్చుకున్నారు. నటనతోపాటు జాన్వీ కపూర్ మంచి డాన్సర్ అన్న విషయం తెలిసిందే. పలుసార్లు ఆమె చేసిన డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె నటించిన గుంజన్ సక్సేనా చిత్రంలో జాన్వీకి సోదరుడిగా నటించిన అంగద్ బేడీతో కలిసి స్టెప్పులు వేశారు. ఈ వీడియోను అంగద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సోమవారం షేర్ చేశారు. ‘‘ఎవరూ చూడని డ్యాన్స్. అనిల్ కపూర్ సర్.. ఈ పాట మీకు అంకితం. మా చిత్రం గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ నుంచి రిహార్సల్ దృశ్యం’ అంటూ పోస్టు చేసిన ఈ వీడియోలో వీరిద్దరూ అనిల్ కపూర్ సూపర్ హిట్ పాట 2మై నేమ్ ఈజ్ లఖన్’ అనే పాటకు డ్యాన్స్ చేశారు. (మా పిల్లలు ప్రతిభావంతులు) కాగా ‘గుంజన్ సక్సేనా’ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందింది. ప్రస్తుతం జాన్వీ ‘తఖ్త్’ సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్లో విజయవంతమైన నిర్మాతగా పేరుపొందిన కరణ్ జోహర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రణ్వీర్ సింగ్, అలియా భట్, కరీనా కపూర్, అనిల్ కపూర్, భూమి పడ్నేకర్, జాన్వీ కపూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 2021 డిసెంబర్లో క్రిస్మస్కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది. మొగలుల కాలం నాటి చారిత్రక కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. (పర్ఫెక్ట్ స్టెప్పులతో ఇరగదీసిన జాన్వీ) View this post on Instagram Dance like nobody’s watching.. @anilskapoor sir this is a tribute to you. Rehearsal scene from our film #gunjansaxenathekargilgirl when gunjan expresses”dada main pilot ban na chahti hoon”. #dhinakdhindha #rampampam my #mondaymotivation 🥳😉 #dance A post shared by ANGAD BEDI (@angadbedi) on Sep 20, 2020 at 11:42pm PDT -
ఇదిగో నా ఐదుగురు గర్ల్‌ఫ్రెండ్స్: నటుడు
ముంబై: ట్రోలింగ్ బారిన పడిన తన భార్య నేహా ధుపియాకు నటుడు అంగద్ బేడీ అండగా నిలబడ్డాడు. ‘‘నా మాటలు వినండి... ఇదిగో నా ఐదుగురు గర్ల్‌ఫ్రెండ్స్!’’ అంటూ నేహాతో ఉన్న ఫొటోలు షేర్ చేసి ట్రోల్స్‌కు ఘాటు కౌంటర్ ఇచ్చాడు. ప్రముఖ రియాలిటీ షో రోడీస్ రెవల్యూషన్లో లీడర్‌గా వ్యవహరిస్తున్న నేహా ధుపియా.. ఓ వ్యక్తిపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. తన గర్ల్‌ఫ్రెండ్‌ను చెంపదెబ్బ కొట్టానన్న అతడి మాటలకు స్పందించిన నేహా.. అమ్మాయిని కొట్టడం తప్పని పేర్కొన్నారు. అయితే ఆమె తనను మోసం చేసిందని.. ఐదుగురు అబ్బాయిలతో సంబంధం పెట్టుకున్నందు వల్లే ఈ విధంగా చేశానని అతడు వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ అతడు చేసింది ముమ్మాటికీ తప్పేనని నేహా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో.. ‘‘నేహా.. ఫేక్ ఫెమినిస్ట్, అనైతిక సంబంధాలను ప్రోత్సహిస్తోంది’’ అంటూ నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్‌కు దిగారు.(నటిపై ఫైర్ అవుతున్న నెటిజన్లు!) ఈ క్రమంలో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ నేహా ఆదివారం ఓ లేఖ విడుదల చేశారు. మోసం చేసేవాళ్లను తనెప్పుడూ సపోర్టు చేయనని, మహిళల భద్రత గురించి మాత్రమే నేను మాట్లాడానని పేర్కొన్నారు. నిజం వైపే నిలబడతానని, ఏదేమైనా శారీరక హింస, దాడి ఆమోదించదగ్గ విషయం కాదని అభిప్రాయపడ్డారు. ఇక ఆమె భర్త అంగద్ బేడీ సైతం నేహాతో ఉన్న ఐదు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి తనకు మద్దతుగా నిలిచాడు. కాగా అంగద్- నేహా 2018లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరికి ఓ పాప సంతానం. View this post on Instagram Sun MERI baat.. here are my 5 girlfriends!!!! Ukhad lo jo ukhad na hai!!!! @nehadhupia ✊️✊️ #itsmychoice A post shared by Angad Bedi “ARVIND VASHISHTHH” (@angadbedi) on Mar 15, 2020 at 10:00pm PDT -
‘ఇప్పటికీ తను నా గర్ల్‌ఫ్రెండే’
బాలీవుడ్ జంట అంగద్ బేడి- నేహా దుఫియా వివాహ బంధంలోకి అడుగుపెట్టి నేటితో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా హ్యాపీ కపుల్‌కు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి రోజును పురస్కరించుకుని వీరిద్దరు తమ ముద్దుల చిన్నారితో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నేహాతో తన అనుబంధం గురించి అంగద్ బేడీ మాట్లాడుతూ... ‘ గడిచిన ఏడాది ఎంతో హాయిగా సాగిపోయింది. పెళ్లి చేసుకుంటే జీవితం మారిపోతుంది. కష్టాలు మొదలవుతాయి(నవ్వుతూ) అంటూ చాలా మంది చెప్పారు. కానీ మా విషయంలో అలాంటివేమీ జరగడం లేదు. పెళ్లికి ముందు ఎలా ఉండేవాళ్లమో ఇప్పుడూ అంతే. ఇప్పటికీ మేమిద్దరం ప్రాణ స్నేహితులం. ప్రేమికులం. అంతేకాదు అందమైన కుటుంబాన్ని కలిగి ఉన్న అదృష్టవంతులం. నేహను జీవిత భాగస్వామిగా పొందడం ద్వారా నా జీవితం పరిపూర్ణమైంది’ అంటూ భార్యపై ప్రేమ కురిపించాడు. మెహర్ దేవుడిచ్చిన వరం.. ‘దేవుడి ఆశీస్సులతో ప్రస్తుతం మేము ముగ్గురం అయ్యాం. మా అనుబంధానికి గుర్తుగా మెహర్(కూతురు) మా జీవితంలోకి వచ్చింది. నిజానికి ఇప్పటికీ నేహాను నా గర్ల్‌ఫ్రెండ్‌లానే భావిస్తున్నా. తల్లిదండ్రులుగా బాధ్యతలను నెరవేరుస్తూనే మాకంటూ ఓ ప్రత్యేక స్పేస్ ఏర్పరచుకున్నాం. నిజాయితీగా గల స్నేహం మమ్మల్ని ఒక్కటి చేసింది. ఇప్పుడు దాంపత్య బంధంలో కూడా అంతే నిజాయితీగా ముందుకు సాగుతున్నాం’ అని అంగద్ కపుల్ గోల్స్ గురించి చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది సోనమ్ కపూర్- ఆనంద్ అహుజాల పెళ్లి ముచ్చట్లలో మీడియా మునిగిపోయిన వేళ తమ పెళ్లి ఫొటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు నేహా దుఫియా- అంగద్ బేడీ. ఎప్పుడూ తమ మధ్య ఉన్న బంధాన్ని బహిరంగంగా ప్రకటించని ఈ జంట సరిగ్గా ఇదే రోజున పంజాబీ సంప్రదాయంలో జరిగిన పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాలు, కొద్దిమంది సన్నిహితుల మధ్య దంపతులుగా మారిన విషయం తెలిసిందే. వీరికి ప్రస్తుతం కూతురు మెహర్ ఉంది. -
మేం ముగ్గురమయ్యాం
ఆదివారంనాడు నేహా ధూపియా, అంగద్ బేడీ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. వీరి ఫ్యామిలీ ఇద్దరి నుంచి ముగ్గురుగా మారింది. అవును.. నేహా ధూపియా ఆదివారం ఉదయం 11 గంటలకు ఓ పాపకు జన్మనిచ్చారు. ఈ ఏడాదే నేహా, అంగద్ ఒక్కటయిన సంగతి గుర్తుండే ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా రిలేషన్షిప్లో ఉన్న వీళ్లు మే నెలలో వివాహం చేసుకున్నారు. -
‘అందుకే యువీకి నాపై కోపం’
న్యూఢిల్లీ: తన పెళ్లి గురించి చెప్పనందుకు క్రికెటర్ యువరాజ్ సింగ్ తనపై కోపంగా ఉన్నాడని అంటున్నారు బాలీవుడ్ నటుడు అంగద్ బేడీ. ఈ ఏడాది సినీ నటి నేహా ధుపియాను అంగద్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తయ్యేవరకు వీరి పెళ్లి విషయం బయటకు రానివ్వలేదు. అయితే యువరాజ్, అంగద్ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. అలాంటిది పెళ్లి గురించి కనీసం తనకు కూడా ఒక్కమాటైనా చెప్పలేని కారణంగా యువీ చాలా అప్సెట్ అయ్యాడని అంగద్ పేర్కొన్నారు. అందుకే తనతో సరిగ్గా మాట్లాడటం లేదని అంగద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఫ్రెండ్షిప్ డే రోజున యువీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘నా స్నేహితులనుకున్నవారితో నాకు ఎదురైన అనుభవాలను చూశాక మనుషుల కంటే నా శునకాలే మేలనిపించింది’ అని పోస్ట్ చేశాడు. అది చూశాక నా గురించే ఆ పోస్ట్ పెట్టాడనిపించింది. తప్పు నాదే. నా ప్రాణ స్నేహితుడైన యువీకి నా పెళ్లి గురించి చెప్పలేదు. కానీ అనుకోకుండా పెళ్లి గురించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. యువీ నాపై కోపంగా ఉండటానికి అతనికి చాలా కారణాలు ఉండవచ్చు. నాకు యువీ అంటే ఇప్పటికీ ఇష్టమే. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇదివరకు ఉన్నట్లుగా లేదు. త్వరలో అతనికి నాపై కోపం తగ్గుతుందని అనుకుంటున్నాను’ అని అంగద్ బేడీ పేర్కొన్నారు. -
అవకాశాలు రావని భయపడ్డాను
నటి నేహా ధూపియా వివాహం అంగద్ బేడీతో ఈ ఏడాది మేలో జరిగిన విషయం తెలిసిందే. నేహా త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని గత నెల ఈ దంపతులు ప్రకటించారు. మరి.. ఇన్నాళ్లూ ఈ విషయాన్ని ఎందుకు దాచారు? అంటే.. నేహా ధూపియా ఇలా చెప్పుకొచ్చారు. ‘‘ప్రెగ్నెంట్ అని ముందే చెప్పడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే నెలలు గడిచేకొద్దీ శరీరాకృతిలో మార్పులు వచ్చినా మొదటి నాలుగైదు నెలలు మామూలుగా ఉంటాం. అందుకని సినిమాలు చేసుకునే వీలు ఉంటుంది. అయితే ప్రెగ్నెంట్ అని తెలిస్తే అవకాశాలు ఇవ్వరని భయపడ్డాను. నాకేమో విశ్రాంతి తీసుకోవడం ఇష్టం లేదు. లక్కీగా ఆరు నెలల వరకూ నాకెలాంటి సమస్యా ఎదురవలేదు. ఇప్పుడూ అంతే. నా ఎనర్జీ లెవల్స్ తగ్గకపోవడంతో ‘హెలికాప్టర్ ఈల’ సినిమాలో కూడా నటించాను. ఆ సంగతలా ఉంచితే.. ఈ సమయంలో నాకెందుకో తెలియదు కానీ అప్పుడప్పుడూ పీడకలలు రావడం, నేను భయపడటం జరుగుతుంది. అప్పుడు నా భర్త అంగద్ ముఖం చూస్తే ఆ భయాలన్నీ పోయి చాలా ప్రశాంతంగా ఉంటున్నా’’ అని చెప్పుకొచ్చారు నేహా. అంతా బాగానే ఉంది. నేహా పెళ్లయి దాదాపు ఐదు నెలలవుతోంది. గర్భం దాల్చిన ఆరు నెలల వరకూ, ఇప్పుడూ ఎలాంటి ప్రాబ్లమ్ లేదని ఆమె పేర్కొన్నారు. పైగా తొమ్మిదో నెలలోకి ఎంటరైనట్లున్నారు. దాంతో పెళ్లికి ముందే ఆమె ప్రెగ్నెంట్ అని ఔత్సాహికరాయుళ్లు వార్తలు మొదలుపెట్టారు. -
ఆ రూమర్ నిజమైంది...
సాక్షి, ముంబై: పెళ్లి కబురుతో అభిమానులను ఆశ్చర్యపర్చిన బాలీవుడ్ నటి నేహాదుపియా, అంగద్ బేడి, జంట మరో గుడ్‌న్యూస్‌తో ఫాన్స్‌కి స్వీట్ షాకిచ్చారు. తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నామనే వార్తను సోషల్ మీడియాలో పంచకున్నారు. తద్వారా గత కొద్దికాలంగా తన ప్రెగ్నెన్సీ వార్తలపై వస్తున్న ఊహాగానాలకు బాలీవుడ్ తార నేహా దూపియా తెరదించినట్టయింది. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను షేర్ చేశారీ జంట. దీంతో ఇవి వైరల్ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ శుభవార్తను శుక్రవారం నేహా కన్ఫామ్ చేశారు. కొత్త ఆరంభం.. ఇపుడు మేం ముగ్గురం.. ఆ భగవంతుడి ఆశీర్వాదం తమతో ఉందంటూ కొన్ని పోటోలను షేర్ చేశారు. అలాగే రూమర్లు నిజమయ్యాయంటూ అంగద్ బేడీ చమత్కారంగా స్పందించారు. దీంతో లక్షలకుపైగా వ్యూస్నుసాధించాయీ ఫోటోలు. అభినందనల వెల్లువ కురుస్తోంది. అద్భుతమైన జంటకు కంగ్రాట్స్..మరో అందమైన ప్రేమకథకు ఆరంభం అంటూ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ విషెస్ చెప్పారు .మరోవైపు ముంబైలో అట్టహాసంగా జరుగుతున్న లాక్మే ఫ్యాషన్ వీక్2018లో నేహా దూపియా, అంగద్ బేడి తళుక్కున మెరిసారు. మ్యాచింగ్ సాంప్రదాయ దుస్తుల్లో అక్కడున్న వారిని మెస్మరైజ్ చేశారు. చేతిలో చేయివేసుకొని ర్యాంప్‌పై వాక్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. చాలాకాలం డేటింగ్ అనంతరం నేహా దుపియా, అంగద్ బేడీ ఈ ఏడాది మే 10న ఆకస్మాత్తుగా వివాహం చేసుకోవడం హాట్ టాపిక్‌గా నిలిచింది. నేహా గర్భం దాల్చడం వల్లే హడావిడిగా పెళ్లి చేసుకొన్నారనే వార్లు మీడియాలో గుప్పుమన్న సంగతి తెలిసిందే. -
తల్లి కాబోతున్న బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి నేహా దుపియా ఎలాంటి హాడావుడి లేకుండా.. గుట్టుచప్పుడు కాకుండా బిషన్ సింగ్ బేడీ కుమారుడు అంగద్ బేడిను వివాహామాడారు. నేహా చడీచప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. వీరిద్దరూ హడావిడిగా పెళ్లి చేసుకోవడంపై అప్పట్లో ఎన్నో అనుమానాలు, సందేహాలు వ్యక్తమయ్యాయి. కొన్ని రోజుల తర్వాత నేహా ప్రెగ్నెంట్ అనే వదంతులు కూడా చక్కర్లు కొట్టాయి. అందుకే చడీచప్పుడు కాకుండా ఆమె వివాహం చేసుకున్నారని పుకార్లు వచ్చాయి. తాజాగా ఆ వదంతులన్నీ నిజం కాబోతున్నాయి. ఈసారి నేహా దుపియా నిజంగానే తల్లి కాబోతున్నారు. చాలా రోజుల నుంచి కొట్టిపారేస్తూ వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్లను, ఇప్పుడు ఆమె సోషల్ మీడియా వేదికగా కన్ఫామ్ చేసేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నేహా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. దానిలో తన భర్త అంగద్‌ను ప్రేమగా పట్టుకుని ఉండగా, తన బేబి బంప్‌ను చూపిస్తూ అంగద్ సంబురపడుతున్న పిక్చర్‌ను షేర్చేశారు. దానికి క్యాప్షన్‌గా... ‘కొత్త ఇన్నింగ్స్ ఇక్కడ ఉంది... #3ఆఫ్అజ్.....#సత్నంవహేగురు’ అంటూ పోస్టు చేశారు. అంగద్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవే ఫోటోలను షేర్ చేస్తూ.. ‘హా! వదంతులు నిజం కాబోతున్నాయి... #3ఆఫ్అజ్..... #సత్నంవహేగురు’ అంటూ పోస్టు చేశారు. ఇలా క్యూట్‌గా నేహా దుపియా తన ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేసేశారు. కాగ, నేహా, అంగద్ల వివాహం ఈ ఏడాది మేలో జరిగింది. వీరిద్దరూ ఈ విషయాన్నీ తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ధ్రువీకరించారు. తాజాగా తల్లిదండ్రులం కాబోతున్నామని విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారానే కన్ఫామ్ చేశారు. -
‘అతడి పేరు కూడా తెలీదు.. ఇంకా వివాహమా’
సాక్షి, ముంబై : ప్రాణ స్నేహితుల్లా మెలిగిన, ప్రేమించుకున్న వ్యక్తులను బ్రేకప్ తర్వాత మీ బంధం ఎలా ఉందని అడిగితే ఎవరికైనా కోపం, చిరాకు రావడం సహజం. ప్రస్తుతం బాలీవుడ్ నటి, మోడల్ నోరా ఫతేహి పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. మూడేళ్ల పాటు నటుడు అంగద్ బేడీతో రిలేషన్ షిప్లో ఉన్న నోరా... గతంలో అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇద్దరి పుట్టిన రోజు కూడా ఒకటే కావడంతో సంతోషం పట్టలేని ఆమె.. వారిద్దరి ఫొటోలను షేర్ చేసి ‘హ్యాపీ బర్త్‌డే అంగద్.. మనం ఇద్దరం ఒకే తేదీన పుట్టడం ఎంతో బాగుంది కదా. నువ్వు అచ్చం నాలాగే ఎందుకు ఉంటావో ఇప్పుడు తెలిసింది బెస్టీ అంటూ’ ట్వీట్ చేశారు. ఇందుకు బదులుగా.. ‘ హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్.. నీతో ఈ రోజును పంచుకోవడం నా అదృష్టం’ అంటూ అంగద్ ట్వీట్ చేశాడు. అయితే నోరాతో బ్రేకప్ అనంతరం అంగద్.. బాలీవుడ్ హీరోయిన్ నేహా ధుపియాను గత మేలో వివాహం చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల మధ్య పంజాబీ సంప్రదాయంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ఇటీవల ఓ జాతీయ మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో భాగంగా.. అంగద్ బేడీకి వివాహ శుభాకాంక్షలు తెలిపారా అంటూ నోరా ఫతేహిని యాంకర్ ప్రశ్నించారు. దీంతో చిరాకు పడిన నోరా..‘అంగద్ బేడీ ఎవరు. అతడి పేరు కూడా ఎప్పుడూ వినలేదు. అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అతడు ఎవరో కూడా తెలియనపుడు అతడి పెళ్లి గురించి నేనెలా మాట్లాడతానంటూ’ ఆగ్రహం వ్యక్తం చేశారు. Happy birthday to us 😎😄😇 @Imangadbedi how cool we are born on the same day! That explains why ur as cool as me😉 thats why we are besties😁 pic.twitter.com/WkaqYK6LGE — Nora Fatehi (@Norafatehi) February 6, 2017 Happy birthday superstar @Norafatehi I'm honoured to share my birthday with you.i always have your back.. errr I mean your shoulder😎 #bestie pic.twitter.com/iKTBexJbI4 — ANGAD BEDI! (@Imangadbedi) February 6, 2017 -
నీ కన్నా రెండేళ్లు చిన్నవాడితో పెళ్లా?
సినిమా స్టార్స్‌కు విమర్శలు కొత్తకాదు. సోషల్ మీడియాలో అయినదానికి, కానిదానికి కొంతమంది ట్రోలర్స్ వారి మీద పడి ఏడుస్తుంటారు. ఎప్పుడూ ఏదో విమర్శి చేసి.. చికాకు పరుచాలనుకుంటారు. అలాంటి వారికి ఇప్పుడు సినీవాళ్లు గట్టిగానే బదులు ఇస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ నటి నేహా ధూపియా చేరారు. ఇటీవలే నేహా ధూపియా నటుడు అంగద్ బేడీని పెళ్లి చేసుకున్నారు. ఢిల్లీలో వీరి వివాహ వేడుక కుటుంబసభ్యుల నడుమ ఒకింత గోప్యంగా జరిగింది. అనంతరం తమ పెళ్లి అయిందనే విషయాన్ని ఇద్దరూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అయితే, నేహా ధూఫియా తనకన్నా రెండేళ్లు చిన్నవాడిని పెళ్లి చేసుకుందని విమర్శిస్తూ.. ఓ నెటిజన్ వెకిలి కామెంట్ పెట్టారు. తన భర్త అంగద్ బేడీ తాజా చిత్రం ‘సూర్మా’ లోని ఆయన పాత్రను పరిచయం చేస్తూ నేహా దూఫియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టారు. దీనికి ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘అంగద్ బేడీ నీ కన్నా రెండేళ్లు చిన్నవాడు. అతను నీకు భర్త కాదు.. తమ్ముడులాంటి వాడు. రాఖీ కట్టు..’అంటూ వెకిలి వ్యాఖ్య చేశాడు. ఈ కామెంట్‌కు నెహా ఒకింత కూల్‌గానే ఘాటు బదులిచ్చారు. ‘నీ సలహా నచ్చిందోయ్. కానీ నాకో ఫెవర్ చేయ్. నీ జీవితమెంటో నువ్ చూసుకో..’ అంటూ ‘పంచ్’ ఎమోజీతో నెహా బదులిచ్చారు. A person with a heart of gold - meet Bikramjeet Singh aka Bikram in #Soorma, releasing on 13th July! #DontLetThisStoryPass ... congratulations team ... @sonypicsprodns @Flicker_Singh @diljitdosanjh @taapsee @IChitrangda @SnehaRajani @shaadesh @thecsfilms ... well done Mister .. 👊😉 @angadbedi 😘 A post shared by Neha Dhupia (@nehadhupia) on May 16, 2018 at 4:21am PDT