
ప్రభాస్ ముఖ్య పాత్రలో తెరకెక్కనున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తారు. సీత పాత్ర ఎవరు చేస్తారు? అనే విషయాన్ని చిత్రబృందం ప్రకటించలేదు. అయితే రావణాసురుడి కుమారుడు మేఘనాథ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అంగద్ బేడీ నటించనున్నారని సమాచారం. అంటే .. సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కుమారుడి పాత్రలో అంగద్ కనిపిస్తారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. 2022 ఆగస్ట్ 11న ఈ సినిమాను థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతుంది.