డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్'. చాలారోజుల నుంచి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సినిమా ఇది. టీజర్ వల్ల విపరీతంగా ట్రోల్స్ వచ్చినప్పటికీ, రిలీజ్ కి ముందు మాత్రం హైప్ బాగానే ఏర్పడింది. ఈ ఊపులోనే కోట్లు కొల్లగొట్టేందుకు రెడీ అయిపోయింది.
ఇప్పటివరకు రామాయణం ఆధారంగా చాలా సినిమాలొచ్చాయి. వాటితో పోలిస్తే 'ఆదిపురుష్' చాలా డిఫరెంట్. ఎందుకంటే ఒకటి రెండు కాదు ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టి మరీ తీశారు. తొలుత రూ.400 కోట్లే అనుకున్నారు. కానీ టీజర్ దెబ్బకు అందరూ తిట్టిన తిట‍్టకుండా తెగ తిట్టారు. దీంతో గ్రాఫిక్స్ కోసం మరో రూ.100 కోట్లు ఖర్చు చేశారు.
(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' కోసం ప్రభాస్ ఫస్ట్ టైమ్ అలా!)
సినిమా బడ్జెటే అన్ని వందల కోట్లు అంటే రెమ్యునరేషన్స్ కూడా గట్టిగానే ఇచ్చి ఉంటారని మీకు డౌట్ రావొచ్చు. అవును మీరు ఊహించింది నిజమే. రాముడిగా నటించినందుకు డార్లింగ్ ప్రభాస్ కి ఏకంగా రూ.150 కోట్ల వరకు ఇచ్చారని టాక్. దీంతో ఆలోవర్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా మన డార్లింగ్ రికార్డ్ సృష్టించాడు!
మిగతా నటీనటుల్లో రావణుడిగా చేసిన సైఫ్ అలీఖాన్ కి రూ.12 కోట్ల వరకు అందినట్లు తెలుస్తోంది. టీజర్ లో రావణ్ గెటప్ ని చూపించారు. విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఇప్పటివరకు రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్ లోనూ అతడిని దాచేశారు. రేపు సినిమాలోనైనా చూపిస్తారో లేదో?
వీళ్లిద్దరి తర్వాత సీతగా యాక్ట్ చేసిన కృతిసనన్ కి రూ.3 కోట్లకు పైనే రెమ‍్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లక్ష‍్మణుడిగా నటించిన సన్నీ సింగ్ కు అయితే రూ.1.5 కోట్లు ఇచ్చారని సమాచారం. ఇదే సినిమాలో నటించిన సోనాల్ చౌహాన్ కి రూ.50 లక్షలు ఇచ్చారట. బహుశా ఈమె సూర్ఫనఖ పాత్ర చేసి ఉండొచ్చని అనిపిస్తోంది. హనుమాన్ గా చేసిన దేవదత్త నాగే, డైరెక‍్టర్ ఓం రౌత్ కు ఎంత ఇచ్చారనేది బయటకు రాలేదు. ఓవరాల్ గా చూసుకుంటే.. కేవలం పారితోషికాలకే రూ.170-200 కోట్లకు పైగా వరకు ఖర‍్చు చేశారంటే పెద్ద విశేషమే.
(ఇదీ చదవండి: 'ఆదిపురుష్'తో ప్రభాస్ కచ్చితంగా హిట్ కొట్టాలి.. లేదంటే?)
Comments
Please login to add a commentAdd a comment