
సన్నీ సింగ్, ప్రభాస్, కృతీ సనన్
‘ఆదిపురుష్’ కుటుంబంలోకి స్వాగతం’ అంటూ కృతీ సనన్, సన్నీ సింగ్‌లను ఆహ్వానించారు ప్రభాస్. ఓం రౌత్ దర్శకత్వంలో రాముడి పాత్రలో ప్రభాస్, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఇందులో సీత పాత్ర ఎవరు చేస్తారు? లక్ష్మణుడిగా ఎవరు నటిస్తారు? అనే ప్రశ్నకు శుక్రవారం ఫుల్‌స్టాప్ పడింది. సీతగా కృతీ సనన్, లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ చేస్తారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ పాత్రల్లో ఈ ఇద్దరూ కన్‌ఫర్మ్ అని ఊహించవచ్చు. ‘‘ఈ సినిమా నాకు చాలా చాలా ప్రత్యేకమైనది.
ఈ మ్యాజికల్ వరల్డ్‌లో భాగమైనందుకు గర్వంగా, గౌరవంగా ఉంది’’ అన్నారు కృతీ సనన్. కానీ తాను ఏ పాత్ర చేయనున్నారో మాత్రం స్పష్టం చేయలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయ్‌లో జరుగుతోంది. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతారు కృతీ సనన్ . ముందుగా ఆమె సోలో సీన్స్‌ను చిత్రీకరించి, ఆ తర్వాత ప్రభాస్, సైఫ్ అలీఖాన్ కాంబినేషన్ సీన్స్‌ను తెరకెక్కించే ఆలోచనలో ఉందట చిత్రబృందం. వచ్చే ఏడాది ఆగస్టు 11న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment