Sunny Singh
-
ప్రభాస్ గురించి ట్వీట్ చేసిన సన్నీ సింగ్, ‘డార్లింగ్’ ఫ్యాన్స్ ఫైర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, స్పిరిట్‌తో పాటు నాగ్ అశ్విన్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ షూటింగ్ పూర్తికాగా.. సలార్, ఆదిపురుష్ సినిమాలు చివరి షెడ్యుల్‌ను జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేశాడు. ఈ నేపథ్యంలో ఆదిపురుష్‌లో లక్ష్మణుడిగా చేస్తున్న బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ షూటింగ్లో ప్రభాస్‌తో ఏర్పడిన బాండింగ్ గురించి చెబుతూ పప్పులో కాలేశాడు. చదవండి: పునీత్ గొప్ప మనసు, సేవా కార్యక్రమాల కోసం రూ. 8 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ట్విటర్లో ప్రభాస్‌తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘పెద్దన్నతో పని చేయడం గొప్పగా ఉంది. మా ఫ్రెండ్షిప్ ఎప్పటికి కొనసాగుతుంది’ అని ట్వీట్లో రాసుకొస్తు ప్రభాస్ పేరుతో ఉన్న ట్విటర్ అకౌంట్‌ను ట్యాగ్ చేశాడు. ఇది చూసిన కొందరు అభిమానులు సంతోషిస్తుంటే.. మరికొందరు సన్నీ సింగ్‌పై కౌంటర్ వేస్తున్నారు. అంతేగాక ‘ఇదేంటి బ్రో కాస్తా చూసుకోవాలి కదా, తెలుసుకొని పోస్ట్ చేయండంటు’ అతడిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే సన్నీ సింగ్‌పై నెటిజన్లు మండిపడటానికి అసలు కారణం ఏంటంటే.. ప్రభాస్‌కు ఇప్పటి వరకు అధికారిక ట్విటర్ అకౌంట్ లేదు. చదవండి: కొడుకు ఎంట్రీ.. బన్నీ అభిమానులకు సర్ప్రైజ్ ట్రీట్ కేవలం ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు మాత్రమే ఉన్నాయి. ప్రభాస్ పేరుతో ఎన్నో ఫేక్ ట్విటర్ ఖాతాలు ఉన్నాయి. అందులో ఒకదాన్ని అతడు ట్యాగ్ చేశాడు. అది గమనించిన ఫ్యాన్స్ ‘లక్ష్మణుడి’పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న సన్నీ సింగ్ ఆ ట్వీట్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. అదే పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేశాడు. కాగా ఆదిపురుష్‌లో ప్రభాస్ రాముడి పాత్ర పోషిస్తుండగా కృతి సనన్ సీతగా నటిస్తోంది. ఇక సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కనిపించబోతున్నాడు. -
బాహుబలికి అబద్ధం ఎందుకు చెప్పావు?: యంగ్ హీరో
సోషల్ మీడియా పుణ్యాన ప్రపంచాన ఏ మూలన ఉన్నవారికైనా ఇట్టే విషెస్ చెప్పుకునే అవకాశం దక్కింది. ముఖ్యంగా సినీతారలు వారికి సంబంధించిన ఏ విషయాన్నైనా నెట్టింట్లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటున్నారు. అలాగే ఇతర సెలబ్రిటీలతోనూ కనెక్షన్ మెయింటెన్ చేస్తూ ఉన్నారు. తాజాగా ప్రభాస్.. తన సహనటుడు సన్నీ సింగ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. నిజానికి సన్నీ సింగ్ బర్త్‌డే అక్టోబర్ 6. అయితే బాహుబలి ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్ 5నే అతడికి సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. దీంతో ఈ పోస్టుకు యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ సహా అనేక మంది కామెంట్లు చేశారు. 'సర్, అతడు మీకు అబద్ధం చెప్పాడు, అతడి పుట్టినరోజు రేపు' అని కామెంట్ పెట్టాడు. అంతేకాకుండా ఈ పోస్టును ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ.. ఆ పోస్టును సన్నీకి ట్యాగ్ చేశాడు. 'రేపు నీ పుట్టిన రోజు అయితే బాహుబలికి ఎందుకు అబద్ధం చెప్పావు?' అని ప్రశ్నించాడు. అందుకు సన్నీ సమాధానమిస్తూ.. 'బాహుబలి ఈరోజే పుట్టినరోజు జరుపుకోమన్నాడు. అందుకే నేనీరోజే బర్త్‌డే జరుపుకుంటున్నాను. అయినా నువ్వెందుకు మధ్యలో తల దూరుస్తున్నావు?' అని సరదాగా కౌంటరిచ్చాడు. కాగా ప్రభాస్ రాముడిగా నటిస్తున్న 'ఆదిపురుష్' చిత్రంలో సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే! ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ డైరెక్షన్ చేస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్రలో ఒదిగిపోనున్నాడు. View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas) -
ఆదిపురుష్‌కి స్వాగతం
‘ఆదిపురుష్’ కుటుంబంలోకి స్వాగతం’ అంటూ కృతీ సనన్, సన్నీ సింగ్‌లను ఆహ్వానించారు ప్రభాస్. ఓం రౌత్ దర్శకత్వంలో రాముడి పాత్రలో ప్రభాస్, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఇందులో సీత పాత్ర ఎవరు చేస్తారు? లక్ష్మణుడిగా ఎవరు నటిస్తారు? అనే ప్రశ్నకు శుక్రవారం ఫుల్స్టాప్ పడింది. సీతగా కృతీ సనన్, లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ చేస్తారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ పాత్రల్లో ఈ ఇద్దరూ కన్ఫర్మ్ అని ఊహించవచ్చు. ‘‘ఈ సినిమా నాకు చాలా చాలా ప్రత్యేకమైనది. ఈ మ్యాజికల్ వరల్డ్‌లో భాగమైనందుకు గర్వంగా, గౌరవంగా ఉంది’’ అన్నారు కృతీ సనన్. కానీ తాను ఏ పాత్ర చేయనున్నారో మాత్రం స్పష్టం చేయలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయ్‌లో జరుగుతోంది. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతారు కృతీ సనన్ . ముందుగా ఆమె సోలో సీన్స్‌ను చిత్రీకరించి, ఆ తర్వాత ప్రభాస్, సైఫ్ అలీఖాన్ కాంబినేషన్ సీన్స్‌ను తెరకెక్కించే ఆలోచనలో ఉందట చిత్రబృందం. వచ్చే ఏడాది ఆగస్టు 11న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
గాంధీ మనవరాలికి దక్షిణాఫ్రికా అవార్డు
జోహెన్నెస్‌బర్గ్: భారత జాతిపిత మహాత్మ గాంధీ మనవరాలు ఇలా గాంధీకి దక్షిణాఫ్రికా పురస్కారం దక్కింది. 'అమాడెలాకూఫా' అవార్డుతో ఆమెను గౌరవించారు. భారత సంతతికి చెందిన సన్నీ సింగ్, మాక్ మహరాజ్‌లకు కూడా ఈ పురస్కారాన్ని ప్రకటించారు. దక్షిణాఫ్రికా మిలటరీ ఈ పురస్కారాన్ని నెలకొల్పింది. సైన్యంలో భాగం కానప్పటికి ఇలా గాంధీకి ఈ గౌరవం దక్కడం విశేషం. ఆమె చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. తనకు అమాడెలాకూఫా పురస్కారం దక్కడం పట్ల సన్నీ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. అవార్డులు, రివార్డులు ఆశించకుండానే 42 ఏళ్ల క్రితం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నానని సన్నీ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు. వివక్షపై విజయం సాధించడమే తాము సాధించిన గొప్ప గెలుపని ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాకు అధికార ప్రతినిధిగా ఉన్న మహరాజ్ పురస్కార ప్రదానోత్సవానికి రాలేకపోయారు.