గాంధీ మనవరాలికి దక్షిణాఫ్రికా అవార్డు | Mahatma Gandhi's granddaughter honoured in South Africa | Sakshi
Sakshi News home page

గాంధీ మనవరాలికి దక్షిణాఫ్రికా అవార్డు

Published Sun, Jan 26 2014 9:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM

Mahatma Gandhi's granddaughter honoured in South Africa

జోహెన్నెస్బర్గ్: భారత జాతిపిత మహాత్మ గాంధీ మనవరాలు ఇలా గాంధీకి దక్షిణాఫ్రికా పురస్కారం దక్కింది. 'అమాడెలాకూఫా' అవార్డుతో ఆమెను గౌరవించారు. భారత సంతతికి చెందిన సన్నీ సింగ్, మాక్ మహరాజ్లకు కూడా ఈ పురస్కారాన్ని ప్రకటించారు. దక్షిణాఫ్రికా మిలటరీ ఈ పురస్కారాన్ని నెలకొల్పింది. సైన్యంలో భాగం కానప్పటికి ఇలా గాంధీకి ఈ గౌరవం దక్కడం విశేషం. ఆమె చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

తనకు అమాడెలాకూఫా పురస్కారం దక్కడం పట్ల సన్నీ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. అవార్డులు, రివార్డులు ఆశించకుండానే  42 ఏళ్ల క్రితం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నానని సన్నీ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు. వివక్షపై విజయం సాధించడమే తాము సాధించిన గొప్ప గెలుపని ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాకు అధికార ప్రతినిధిగా ఉన్న మహరాజ్ పురస్కార ప్రదానోత్సవానికి రాలేకపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement