న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో చేసిన సేవలకు గానూ 13 మంది ప్రవాస భారతీయులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘ప్రవాసి భారతీయ సమ్మాన్’ పురస్కారాలను ప్రదానం చేశారు. వారి వివరాలు..
ఇలా గాంధీ: మహాత్మాగాంధీ మునిమనవరాలు. దక్షిణాఫ్రికాలో 1994 నుంచి 2004 వరకు పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. ఆ దేశంలో ఆమె చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా ఈ అవార్డ్‌ను ప్రకటించారు.
లీసా మేరియా సింగ్: భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రేలియా సెనేటర్. లీసా ఆస్ట్రేలియాలో తొలి దక్షిణాసియా సెనేటర్. మంత్రిగానూ పనిచేశారు. ప్రజాసేవతో పాటు భారత్, ఆస్ట్రేలియాల మధ్య స్నేహ సంబంధాల వృద్ధికి కృషిచేసినందుకు ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. రామకృష్ణ మిషన్: 1937 నుంచి ఫిజీలో సామాజిక సేవలందిస్తున్నందుకు.. కురియన్ వర్గీస్, వాసుదేవన్ చంచ్లానీ, వికాస్ చంద్ర సన్యాల్, సత్నారాయన్‌సింగ్ రాబిన్ బల్దేవ్‌సింగ్, శశింద్రన్‌ముత్తువేల్, శిబుద్దీన్ వావ కుంజు, షంషేర్ వాయలీల్ పరంబత్, శైలేశ్ లక్ష్మణ్ వర, పార్థసారధి చిరామెల్ పిళ్లై, రేణు ఖతోర్‌లకు పురస్కారాలు లభించాయి.
13మందికి ‘ప్రవాసి భారతీయ సమ్మాన్’
Published Fri, Jan 10 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement
Advertisement