Prabhas Birthday Wishes To Sunny Singh, Kartik Aaryan Funny Conversation Goes Viral - Sakshi
Sakshi News home page

Prabhas: ప్రభాస్‌కు అబద్ధం ఎందుకు చెప్పావు? నటుడికి యంగ్‌ హీరో క్వశ్చన్‌

Published Wed, Oct 6 2021 10:02 PM | Last Updated on Thu, Oct 7 2021 8:42 AM

Prabhas Gets Sunny Singh Birth Date Wrong, Kartik Aaryan Raise Question - Sakshi

సోషల్‌ మీడియా పుణ్యాన ప్రపంచాన ఏ మూలన ఉన్నవారికైనా ఇట్టే విషెస్‌ చెప్పుకునే అవకాశం దక్కింది. ముఖ్యంగా సినీతారలు వారికి సంబంధించిన ఏ విషయాన్నైనా నెట్టింట్లో షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటున్నారు. అలాగే ఇతర సెలబ్రిటీలతోనూ కనెక్షన్‌ మెయింటెన్‌ చేస్తూ ఉన్నారు. తాజాగా ప్రభాస్‌.. తన సహనటుడు సన్నీ సింగ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. నిజానికి సన్నీ సింగ్‌ బర్త్‌డే అక్టోబర్‌ 6. అయితే బాహుబలి ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్‌ 5నే అతడికి సోషల్‌ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు.

దీంతో ఈ పోస్టుకు యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ సహా అనేక మంది కామెంట్లు చేశారు. 'సర్‌, అతడు మీకు అబద్ధం చెప్పాడు, అతడి పుట్టినరోజు రేపు' అని కామెంట్‌ పెట్టాడు. అంతేకాకుండా ఈ పోస్టును ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేస్తూ.. ఆ పోస్టును సన్నీకి ట్యాగ్‌ చేశాడు. 'రేపు నీ పుట్టిన రోజు అయితే బాహుబలికి ఎందుకు అబద్ధం చెప్పావు?' అని ప్రశ్నించాడు. అందుకు సన్నీ సమాధానమిస్తూ.. 'బాహుబలి ఈరోజే పుట్టినరోజు జరుపుకోమన్నాడు. అందుకే నేనీరోజే బర్త్‌డే జరుపుకుంటున్నాను. అయినా నువ్వెందుకు మధ్యలో తల దూరుస్తున్నావు?' అని సరదాగా కౌంటరిచ్చాడు. కాగా ప్రభాస్‌ రాముడిగా నటిస్తున్న 'ఆదిపురుష్‌' చిత్రంలో సన్నీ సింగ్‌ లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే! ఈ సినిమాకు బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ డైరెక్షన్‌ చేస్తున్నాడు. సైఫ్‌ అలీఖాన్‌ లంకేశ్‌ పాత్రలో ఒదిగిపోనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement