
పాన్ ఇండియా హీరో ప్రభాస్, కృతి సనన్ జంటగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ విజువల్ వండర్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో మొదటిసారి ప్రభాస్‌తో నటిస్తోంది భామ. దేశవ్యాప్తంగా అభిమానులున్న ప్రభాస్‌తో నటించడం ఆనందంగా ఉందని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిది ముద్దుగుమ్మ. తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆదిపురుష్ నటి కావడంతోనే కృతిసనన్ బాగా ఫేమస్ అయింది.
(చదవండి: ఆది పురుష్ ఆలస్యానికి అసలు కారణం అదే.. కృతి సనన్ కామెంట్స్ వైరల్)
దీంతో ఆమె గతంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. అలాగే ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నతో ముద్దుగుమ్మ షాక్‌కు గురైంది. అవకాశం వస్తే ప్రభాస్, టైగర్ ష్రాఫ్, కార్తిక్ ఆర్యన్.. ముగ్గురిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారు? అలాగే ఫ్లర్ట్ కూడా' అంటూ దిమ్మతిరిగే ప్రశ్న అడిగారు. దీనికి కృతి సమాధానమిస్తూ.. 'కార్తిక్ ఆర్యన్‌ను ఫ్లర్ట్, టైగర్‌తో డేటింగ్. ఇక ప్రభాస్‌తో పెళ్లి' అని నవ్వుతూ సమాధానమిచ్చింది ఆదిపురుష్ భామ.
ప్రస్తుతం ఆమె భేదియా(తోడేలు) ప్రమోషన్స్‌లోనూ ప్రభాస్ గురించి కృతిసనన్ మాట్లాడారు. ఆయనే తన అభిమాన నటుడని, షూట్ సమయంలో భాషాపరంగా సాయం చేశారని చెప్పారు. రామాయణం ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించగా.. కృతి సీత పాత్రలో మెరవనుంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ చేయనున్నారు.
If ever get a chance I will marry #Prabhas.
— Dps Nayak™ 💔 (@NayakTweetz) November 25, 2022
-@kritisanon ❤
Ok ika fix aipondi North Vadina ani 🥳🥳🥰 #Prakrithi pic.twitter.com/Q67ppL7WIy