ఆది పురుష్ ఆలస్యానికి అసలు కారణం అదే.. కృతి సనన్ కామెంట్స్ వైరల్ | Kriti Sanon Comments On Adipurush Movie Delay For Release | Sakshi
Sakshi News home page

Adipurush Movie: ఆదిపురుష్ ఆలస్యంపై స్పందించిన కృతి.. అందువల్లేనంటూ..!

Published Sat, Nov 19 2022 4:28 PM | Last Updated on Sat, Nov 19 2022 4:34 PM

Kriti Sanon Comments On Adipurush Movie Delay For Release - Sakshi

పాన్ ఇండియా హీరో ప్రభాస్, కృతి సనన్ జంటగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఈ చిత్రం ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ విజువల్ వండర్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్ర వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ టీజర్‌ను పలువురు విమర్శించిన విషయం తెలిసిందే. అయితే మొదట వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం భావించినా కొన్ని కారణాలతో జూన్‌కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.

(చదవండి: మహేశ్‌ బాబు పాటకు కృతీసనన్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌)

తాజాగా ఈ విషయంపై హీరోయిన్ కృతిసనన్ స్పందించింది. సినిమా ఆలస్యానికి గల అసలు కారణాన్ని వివరించింది భామ. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి భేడియా మూవీ ప్రమోషన్లలో కృతి సనన్ బిజీగా ఉంది. ఇటీవలే ఓ ఈవెంట్‌లో ఆదిపురుష్ విడుదల ఆలస్యానికి గల కారణాలపై ఆమెను ప్రశ్నించారు. దీనికి నటి బదులిస్తూ.. 'ఆదిపురుష్ చిత్రబృందం పట్ల చాలా గర్వంగా ఉంది. ఇది చాలా గొప్ప చిత్రం. ఇది మనమందరం గర్వించదగ్గ కథ. మన చరిత్రలో భాగం. ఈ సినిమాను సాధ్యమైనంత ఉత్తమంగా చేయాలి. దీనిపై ఇప్పటికే ఓం రౌత్ నోట్‌లో వివరించారు.' అంటూ వివరించింది.  

కాగా..కార్తిక్ ఆర్యన్‌తో కలిసి షెహజాదాలో కృతి సనన్ కనిపించనుంది. టబు, కరీనా కపూర్‌లతో కలిసి ది క్రూలో సనన్ కూడా నటిస్తోంది. గతంలో ఈ సినిమా టీజర్ చూసిన అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు కురిపించారు.రామాయణం లాంటి అద్భుతమైన మహాకావ్యం ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో రాముడుతో సహా ఇతరుల పాత్రలను వక్రీకరించారంటూ విమర్శించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement