ముహూర్తం కుదిరింది | Adipurush shooting launch on 19 january | Sakshi
Sakshi News home page

ముహూర్తం కుదిరింది

Published Sat, Jan 9 2021 6:27 AM | Last Updated on Sat, Jan 9 2021 6:27 AM

Adipurush shooting launch on 19 january - Sakshi

‘ఆదిపురుష్‌’ ఆరంభానికి ముహూర్తం కుదిరింది. త్వరలోనే ప్రేమికుడి నుంచి పౌరాణికంలోకి మారిపోనున్నారు ప్రభాస్‌. ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘ఆది పురుష్‌’. ఈ సినిమాలో శ్రీరాముడిగా కనిపిస్తారు ప్రభాస్‌. రావణుడిగా సైఫ్‌ అలీఖాన్, సీతగా కృతీ సనన్‌ నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ముంబైలో ఓ స్టూడియోలో షూటింగ్‌ మొదలవుతుంది. సినిమా మొత్తాన్ని స్టూడియోలోనే షూట్‌ చేయబోతున్నారని కూడా ఓ వార్త ఉంది. ప్రస్తుతం చేస్తున్న ప్రేమకథా చిత్రం ‘రాధే శ్యామ్‌’ను పూర్తి చేసి, ‘ఆదిపురుష్‌’ సెట్లో జాయిన్‌ అవుతారట ప్రభాస్‌. ఈ సినిమా కోసం తన శరీరాకృతిని కూడా మార్చేశారాయన. వచ్చే ఏడాది ఆగస్ట్‌లో ‘ఆదిపురుష్‌’ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement