పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. ఆదిపురుష్ పేరేమో గానీ ఆది నుంచి వివాదాలే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై వివాదాలు ఇప్పుడే వీడేలా కనిపించడం లేదు. మొదట టీజర్ రిలీజ్ కాగా.. ఫ్యాన్స్ ఆగ్రాహానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే శ్రీరామనవమి సందర్భంగా సీతా సమేత శ్రీరాముడిగా ప్రభాస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సాధారణంగా ప్రతి ఇంట్లో కనిపించే శ్రీరాముడి ఫోటోకు ప్రతిరూపంగా ఈ తాజా పోస్టర్‌ని డిజైన్ చేశారు మేకర్స్. తాజాగా ఈ పోస్టర్‌పై సైతం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జానీ లేకుండా శ్రీరాముడిని వేషధారణలో చూపించినందుకు సినిమా నిర్మాతలపై ఫిర్యాదు చేశారు.
చిక్కుల్లో ఆదిపురుష్
మార్చి 30న రామ నవమి సందర్భంగా రిలీజైన 'ఆదిపురుష్' పోస్టర్ తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ మేకర్స్‌పై పోలీసులకు ఓ వర్గం ఫిర్యాదు చేసింది. ముంబయికి చెందిన సంజయ్ దీనానాథ్ తివారీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రామాయణ సహజ స్ఫూర్తికి, స్వభావానికి భిన్నంగా శ్రీరాముడిని వేషధారణలో పోస్టర్‌లో చూపించడం తమ మనోభావాలను దెబ్బతీసిందని ఫిర్యాదులో సంజయ్ పేర్కొన్నారు. సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన 'జానేవు' అనే పవిత్రమైన దారాన్ని రాముడు, లక్ష్మణ్ ధరించకపోవడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
ఆది నుంచి వివాదాలు
'ఆదిపురుష్'ను మొదటి నుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. గతంలో రిలీజైన టీజర్‌పై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. కాగా.. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్‌ను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూన్ 16న రిలీజ్ చేస్తామని ఓం రౌత్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment