ఇదిగో నా ఐదుగురు గర్ల్‌ఫ్రెండ్స్‌: నటుడు | Angad Bedi Supports Wife Neha Dhupia Shuts Trolls Over Fake Feminism | Sakshi
Sakshi News home page

ఇదిగో నా ఐదుగురు గర్ల్‌ఫ్రెండ్స్‌: నటుడు

Mar 16 2020 5:39 PM | Updated on Mar 16 2020 6:11 PM

Angad Bedi Supports Wife Neha Dhupia Shuts Trolls Over Fake Feminism - Sakshi

ముంబై: ట్రోలింగ్‌ బారిన పడిన తన భార్య నేహా ధుపియాకు నటుడు అంగద్‌ బేడీ అండగా నిలబడ్డాడు. ‘‘నా మాటలు వినండి... ఇదిగో నా ఐదుగురు గర్ల్‌ఫ్రెండ్స్‌!’’ అంటూ నేహాతో ఉన్న ఫొటోలు షేర్‌ చేసి ట్రోల్స్‌కు ఘాటు కౌంటర్‌ ఇచ్చాడు. ప్రముఖ రియాలిటీ షో రోడీస్‌ రెవల్యూషన్‌లో లీడర్‌గా వ్యవహరిస్తున్న నేహా ధుపియా.. ఓ వ్యక్తిపై ఫైర్‌ అయిన సంగతి తెలిసిందే. తన గర్ల్‌ఫ్రెండ్‌ను చెంపదెబ్బ కొట్టానన్న అతడి మాటలకు స్పందించిన నేహా.. అమ్మాయిని కొట్టడం తప్పని పేర్కొన్నారు. అయితే ఆమె తనను మోసం చేసిందని.. ఐదుగురు అబ్బాయిలతో సంబంధం పెట్టుకున్నందు వల్లే ఈ విధంగా చేశానని అతడు వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ అతడు చేసింది ముమ్మాటికీ తప్పేనని నేహా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో.. ‘‘నేహా.. ఫేక్‌ ఫెమినిస్ట్‌, అనైతిక సంబంధాలను ప్రోత్సహిస్తోంది’’ అంటూ నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్‌కు దిగారు.(నటిపై ఫైర్‌ అవుతున్న నెటిజన్లు!)

ఈ క్రమంలో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ నేహా ఆదివారం ఓ లేఖ విడుదల చేశారు. మోసం చేసేవాళ్లను తనెప్పుడూ సపోర్టు చేయనని, మహిళల భద్రత గురించి మాత్రమే నేను మాట్లాడానని పేర్కొన్నారు. నిజం వైపే నిలబడతానని, ఏదేమైనా శారీరక హింస, దాడి ఆమోదించదగ్గ విషయం కాదని అభిప్రాయపడ్డారు. ఇక ఆమె భర్త అంగద్‌ బేడీ సైతం నేహాతో ఉన్న ఐదు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి తనకు మద్దతుగా నిలిచాడు. కాగా అంగద్‌- నేహా 2018లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరికి ఓ పాప సంతానం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement