Angad Bedi on Neha Dhupia Losing Work Due to Her Pregnancy - Sakshi
Sakshi News home page

Neha Dhupia: ప్రెగ్నెన్సీ వల్ల.. మూవీస్‌ నుంచి నేహాని తొలగించారు

Published Sat, Oct 2 2021 9:02 AM | Last Updated on Sat, Oct 2 2021 11:18 AM

Angad talks about his wife Neha losing work due to pregnancy - Sakshi

బాలీవుడ్‌ ఇండస్ట్రీలోని హ్యాపీ కపుల్స్‌లో  నేహా ధూపియా, అంగద్‌ బేడి జంట ఒకటి. ఇద్దరూ యాక్టర్స్‌గా తమ కెరీర్‌ని స​క్సెస్‌పుల్‌గా కొనసాగిస్తూనే వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ దంపతులకు ఇప్పటికే మెహర్ అనే కూతురు ఉండగా, నేహా మరోసారి ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ విషయాన్ని ఇటీవలే సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది ఈ జంట. అయితే ఇటీవల ఓ ఇంటర్వూలో అంగద్‌ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత తాము ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నాడు.

‘నేహా రెండో సారి ప్రెగ్నెంట్ కావడంతో అనేక ప్రాజెక్టులను కొల్పోవాల్సి వచ్చింది. ఎవరు కూడా తనని అలాగే కొనసాగించడానికి ఇష్టపడలేదు. నా పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. అనేక ప్రాజెక్టుల నుంచి తప్పించారు. ఈ ఇండస్ట్రీలో మనం చాలా ఏళ్లు ఉంటాం. అందువల్ల అవన్నీ మరిచిపోయి జీవితంలో ముందుకు సాగిపోవాలి. అలా నన్ను తీసేసిన తర్వాత అంతకంటే మంచి మనుషులు, క్రేజీ ప్రాజెక్టులలో పని చేసే అవకాశం లభించింది. అదే జీవితం అంటే’ అని అంగద్‌ తెలిపాడు. అయితే ప్రెగ్నెన్సీ మూలంగా ఎంతోమంది నేహాని సినిమాల నుంచి తీసేసినా, ఆమె ప్రస్తుతం చేస్తున్న చిత్రం గురువారం డెరెక్టర్‌ బెహజాద్ ఖంబాట స్క్రీన్‌పై గర్భిణి పోలీసుగా తెరపై చూపించడానికి స్క్రిప్ట్‌లో మార్పులు చేశాడని సంతోషం వ్యక్తం చేశాడు.

చదవండి: నేను కరీనాకు ఏ విషయంలోనూ సలహాలు ఇవ్వను: సైఫ్‌ అలీ ఖాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement