![Neha Dhupia And Angad Bedi Announce Second Pregnancy - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/19/nehaaa.jpg.webp?itok=E7a0KfOS)
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా రెండోసారి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నేహా ధూపియా దంపతులు వెల్లడించారు. బేబీ బంప్‌తో ఫోటోలను షేర్ చేస్తూ...'మంచి క్యాప్షన్‌తో రావడానికి రెండు రోజులు పట్టింది. మేం ఆలోచించిన వాటిలో ఉత్తమమైంది ఇదే.. థ్యాంక్యూ గాడ్' అంటూ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశారు. నేహా ధూపియా పోస్ట్‌పై పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇక నేహా ధూపియా.. నటుడు, మోడల్ అడంగ్ సింగ్ బేడీ అనే వ్యక్తిని 2018 మేలో పెళ్లి చేసుకోగా అదే సంవత్సరం నవంబర్‌లో మెహర్ అనే బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 'మిస్ ఇండియా: ది మిస్టరీ' అనే మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నేహా ధూపియా “క్యా కూల్ హై హమ్”, “షూట్ అవుట్ లోఖండ్‌వాలా” వంటి హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ నిన్నే ఇష్టపడ్డాను,విలన్, పరమవీర చక్ర వంటి చిత్రాల్లోనూ నటించింది.
Comments
Please login to add a commentAdd a comment