అవకాశాలు రావని భయపడ్డాను | Neha Dhupia pregnancy a secret for 6 months | Sakshi
Sakshi News home page

అవకాశాలు రావని భయపడ్డాను

Published Sat, Sep 22 2018 12:31 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Neha Dhupia pregnancy a secret for 6 months - Sakshi

నేహా ధూపియా, అంగద్‌ బేడీ

నటి నేహా ధూపియా వివాహం అంగద్‌ బేడీతో ఈ ఏడాది మేలో జరిగిన విషయం తెలిసిందే. నేహా త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని గత నెల ఈ దంపతులు ప్రకటించారు. మరి.. ఇన్నాళ్లూ ఈ విషయాన్ని ఎందుకు దాచారు? అంటే.. నేహా ధూపియా ఇలా చెప్పుకొచ్చారు. ‘‘ప్రెగ్నెంట్‌ అని ముందే చెప్పడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే నెలలు గడిచేకొద్దీ శరీరాకృతిలో మార్పులు వచ్చినా మొదటి నాలుగైదు నెలలు మామూలుగా ఉంటాం. అందుకని సినిమాలు చేసుకునే వీలు ఉంటుంది. అయితే ప్రెగ్నెంట్‌ అని తెలిస్తే అవకాశాలు ఇవ్వరని భయపడ్డాను. నాకేమో విశ్రాంతి తీసుకోవడం ఇష్టం లేదు. లక్కీగా ఆరు నెలల వరకూ నాకెలాంటి సమస్యా ఎదురవలేదు.

ఇప్పుడూ అంతే. నా ఎనర్జీ లెవల్స్‌ తగ్గకపోవడంతో ‘హెలికాప్టర్‌ ఈల’ సినిమాలో కూడా నటించాను. ఆ సంగతలా ఉంచితే.. ఈ సమయంలో నాకెందుకో తెలియదు కానీ అప్పుడప్పుడూ పీడకలలు రావడం, నేను భయపడటం జరుగుతుంది. అప్పుడు నా భర్త అంగద్‌ ముఖం చూస్తే ఆ భయాలన్నీ పోయి చాలా ప్రశాంతంగా ఉంటున్నా’’ అని చెప్పుకొచ్చారు నేహా. అంతా బాగానే ఉంది. నేహా పెళ్లయి దాదాపు ఐదు నెలలవుతోంది. గర్భం దాల్చిన ఆరు నెలల వరకూ, ఇప్పుడూ ఎలాంటి ప్రాబ్లమ్‌ లేదని ఆమె పేర్కొన్నారు. పైగా తొమ్మిదో నెలలోకి ఎంటరైనట్లున్నారు. దాంతో పెళ్లికి ముందే ఆమె ప్రెగ్నెంట్‌ అని ఔత్సాహికరాయుళ్లు వార్తలు మొదలుపెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement