నీ కన్నా రెండేళ్లు చిన్నవాడితో పెళ్లా? | Actress Neha Dhupia trolled for marrying younger man | Sakshi
Sakshi News home page

May 20 2018 10:53 AM | Updated on Apr 3 2019 6:34 PM

Actress Neha Dhupia trolled for marrying younger man - Sakshi

సినిమా స్టార్స్‌కు విమర్శలు కొత్తకాదు. సోషల్‌ మీడియాలో అయినదానికి, కానిదానికి కొంతమంది ట్రోలర్స్‌ వారి మీద పడి ఏడుస్తుంటారు. ఎప్పుడూ ఏదో విమర్శి చేసి.. చికాకు పరుచాలనుకుంటారు. అలాంటి వారికి ఇప్పుడు సినీవాళ్లు గట్టిగానే బదులు ఇస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ నటి నేహా ధూపియా చేరారు.

ఇటీవలే నేహా ధూపియా నటుడు అంగద్‌ బేడీని పెళ్లి చేసుకున్నారు. ఢిల్లీలో వీరి వివాహ వేడుక కుటుంబసభ్యుల నడుమ ఒకింత గోప్యంగా జరిగింది. అనంతరం తమ పెళ్లి అయిందనే విషయాన్ని ఇద్దరూ సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అయితే, నేహా ధూఫియా తనకన్నా రెండేళ్లు చిన్నవాడిని పెళ్లి చేసుకుందని విమర్శిస్తూ.. ఓ నెటిజన్‌ వెకిలి కామెంట్‌ పెట్టారు. తన భర్త అంగద్‌ బేడీ తాజా చిత్రం ‘సూర్మా’ లోని ఆయన పాత్రను పరిచయం చేస్తూ నేహా దూఫియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టారు. దీనికి ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘అంగద్‌ బేడీ నీ కన్నా రెండేళ్లు చిన్నవాడు. అతను నీకు భర్త కాదు.. తమ్ముడులాంటి వాడు. రాఖీ కట్టు..’అంటూ వెకిలి వ్యాఖ్య చేశాడు. ఈ కామెంట్‌కు నెహా ఒకింత కూల్‌గానే ఘాటు బదులిచ్చారు. ‘నీ సలహా నచ్చిందోయ్‌. కానీ నాకో ఫెవర్‌ చేయ్‌. నీ జీవితమెంటో నువ్‌ చూసుకో..’ అంటూ ‘పంచ్‌’ ఎమోజీతో నెహా బదులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement