ఆ సీనియర్‌ నటిని పెళ్లి చేసుకుంటాడట! | Divya Dutta got marriage proposal on Twitter | Sakshi
Sakshi News home page

ఆ సీనియర్‌ నటిని పెళ్లి చేసుకుంటాడట!

Published Sat, Oct 22 2016 4:21 PM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM

ఆ సీనియర్‌ నటిని పెళ్లి చేసుకుంటాడట!

ఆ సీనియర్‌ నటిని పెళ్లి చేసుకుంటాడట!

సినీ నటీమణులకు ఈ మధ్య సోషల్‌ మీడియాలో చిత్రమైన ప్రపోజల్స్‌ వస్తున్నాయి. మొన్నటికిమొన్న ఓ యువకుడు బాలీవుడ్‌ అందాల నటి టిస్కా చోప్రాపై మనస్సు పడ్డాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ట్విట్టర్‌లో బహిరంగంగా ప్రతిపాదన పంపాడు. పెళ్లయి ఓ పాప కూడా ఉన్న 42 ఏళ్ల టిస్కా కూడా ఏం తక్కువ తినలేదు. ‘నేను పెళ్లికి రెడీ. వివరాలు పంపు. మా ఆయన కూడా ఎవరి కోసం నేను వెళుతున్నానో తెలుసుకోవాలనుకుంటున్నారు’  అంటూ సరదాగా కామెంట్‌ చేసింది.

ఇప్పుడు అంతకంటే సీనియర్‌ నటికి ట్విట్టర్‌లో పెళ్లి ప్రతిపాదన వచ్చింది. ‘బాగ్‌ మిల్కా బాగ్‌’, ‘వీర్‌ జరా’ వంటి సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించిన సీనియర్‌ నటీమణి దివ్యాదత్తాను పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువకుడు ముందుకొచ్చాడు. ట్విట్టర్‌లో అర్మాన్‌ మాలిక్‌ అనే వ్యక్తి ఆమెకు పెళ్లి ప్రతిపాదన పెట్టాడు కానీ.. వచ్చిరానీ ఇంగ్లిష్‌లో అతను ఏం చెప్పాడో ఎవరికీ అర్థం కాలేదు. ‘Divya Like you and I want to marry you very extraordinary amount Tume Hu Khus marry me I will swear’ అంటూ ట్వీట్‌  చేశాడు. అతని భావాల బట్టి ‘దివ్యా.. నువ్వు నాకు ఇష్టం. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా.. ఒట్టు’ అని అన్నట్టు భావిస్తున్నారు. 

అయితే, అతడి ఇంగ్లిష్‌ అర్థం కాక సీనియర్‌ నటి దివ్యాదత్తా కూడా తికమక పడ్డారు. ‘ఏమంటున్నావు అన్నా.. కాస్తా అర్థమయ్యేట్టు చెప్పు’ అని ఆమె అడిగారు. ఇక, అతడి వచ్చిరానీ ఇంగ్లిష్‌ మీద నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఇంగ్లిష్‌ భాష ఇప్పుడే ప్రశాంతంగా చనిపోయిందని ఒకరు కామెంట్‌ చేయగా.. మీ మీద ధ్యాసతో ఏం టైప్‌ చేస్తున్నాడో తెలియక తప్పులు టైప్‌ చేసి ఉంటాడని మరొకరు వ్యాఖ్యానించారు. ఇది కచ్చితంగా గూగుల్‌ ట్రాన్స్‌లేటర్‌ పొరపాటే అయి ఉంటుందని ఒకరు.. కన్సోలేషన్‌ ప్రైజ్‌ కింద స్పోకెన్‌ ఇంగ్లిష్‌ బుక్‌ అతనికి కానుకగా ఇవ్వండని మరొకరు ఛలోక్తులు విసిరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement