కత్రినా.. నువ్వు లేకుంటే చచ్చిపోతా.. పెళ్లి చేసుకో! | Man proposes marriage to Katrina Kaif And She Reacts | Sakshi
Sakshi News home page

కత్రినా.. నువ్వు లేకుంటే చచ్చిపోతా.. పెళ్లి చేసుకో!

Published Wed, May 8 2019 12:10 PM | Last Updated on Wed, May 8 2019 12:10 PM

Man proposes marriage to Katrina Kaif And She Reacts - Sakshi

‘పించ్‌’ షోలో కత్రినా కైఫ్‌, ఆర్బాజ్‌ ఖాన్‌

‘కత్రినా.. నిన్ను నేను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను. నువ్వు లేకపోతే చచ్చిపోతాను. నన్ను పెళ్లి చేసుకో. నీ నెంబర్‌ ఇవ్వు’ .. ఇది బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్‌ ట్వీట్‌. ఓ వెబ్‌ షోలో పాల్గొన్న కత్రినా ఈ ట్వీట్‌కు పాజిటివ్‌గా స్పందిస్తూ.. ‘ ఈ రోజుల్లో కూడా ఇంతటి బలమైన భావోద్వేగాలు గల మనుషులు ఉన్నారని తెలియడం ఆనందం కలిగిస్తోంది. ఈ రోజుల్లో అందరూ పరిస్థితులకు అనుగుణంగా ఉండిపోతూ.. ఏదీ సీరియస్‌గా తీసుకోవడం లేదు’  అని పేర్కొన్నారు.

నటుడు ఆర్బాజ్‌ ఖాన్‌ నిర్వహించే వెబ్‌ షో ‘పించ్‌’లో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్‌ మీడియాలో నటులు, సెలబ్రిటీలపై వచ్చే కామెంట్లు, ట్రోలింగ్లు వారికి చదివి వినిపిస్తారు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్‌ మీడియాలో వచ్చిన పెళ్లి ప్రతిపాదనను చూపించగా.. కత్రినా ఒకింత ఉద్వేగంగానే స్పందించారు. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి కూడా ఆమె మాట్లాడారు. రణ్‌బీర్‌ కపూర్‌తో రిలేషన్‌షిప్‌కు బ్రేకప్‌ చెప్పిన తర్వాత సింగిల్‌గానే ఉంటున్న ఆమె.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఏమో ఐడియా లేదు. ఒకరోజు పెళ్లి చేసుకుంటాను. జీవితం ఊహించలేనిది. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు’ అని బదులిచ్చారు. వైవాహిక వ్యవస్థపై నమ్మకముందా? అని ప్రశ్నించగా.. ‘ఒక వ్యక్తిగా నాకు పెళ్లి, పిల్లలపై నమ్మకముంది. ఒకరోజు నేను పెళ్లి చేసుకుంటాను’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement