నటికి సోషల్ మీడియాలో మ్యారేజ్ ప్రపోజల్! | Tisca Chopra good reply on marriage proposal | Sakshi
Sakshi News home page

నటికి సోషల్ మీడియాలో మ్యారేజ్ ప్రపోజల్!

Published Fri, Oct 14 2016 8:51 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నటికి సోషల్ మీడియాలో మ్యారేజ్ ప్రపోజల్! - Sakshi

నటికి సోషల్ మీడియాలో మ్యారేజ్ ప్రపోజల్!

ముంబై: సెలబ్రిటీలను పెళ్లిచేసుకునేందుకు చాలామంది సిద్ధంగా ఉంటారు. అప్పుడప్పుడు కొందరు యువతులు తమ అభిమాన హీరో ఇంటి ఎదుట బైఠాయించి.. పెళ్లి చేసుకోవాలని గొడవ చేస్తుండటం మన గమనిస్తుంటాం. ఇక్కడ మాత్రం రొటీన్ కు భిన్నంగా ఓ యువకుడు తన అభిమాన నటిని పెళ్లి చేసుకుంటావా అని సోషల్ మీడియాలో అడిగాడు. ఆ వివరాలిలా ఉన్నాయి. బాలీవుడ్ నటి టిస్కా చోప్రాకు ఓ వ్యక్తి సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ ద్వారా మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చాడు. ఇందుకు టిస్కా చోప్రా కూడా స్పందిస్తూ.. ఆ అభిమానికి షాక్ ఇచ్చింది. మొదటగా పెళ్లి ప్రతిపాదనకు థ్యాంక్స్ చెప్పిన టిస్కా.. పూర్తి వివరాలు పంపించాలని అభిమానికి ఓ ట్వీట్ చేసింది.

తన భర్తను ఈ పెళ్లి గురించి పర్మిషన్ తీసుకోవాలని, ఏ వ్యక్తి తనతో జీవితాన్ని కోరుకుంటున్నారో ఆయనకు తెలియాలి కదా అని చమత్కరించింది. టిస్కా నుంచి ఇలాంటి రిప్లై ఊహించని ఆ వ్యక్తి కంగుతిని ఉంటాడు. తారే జమీన్ పర్, కిస్సా, రహస్య మూవీలతో వెండితెరపై తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న టిస్కా పలు టీవీ షోలతో పాటు కహానీ ఘర్ ఘర్ కీ, కరిష్మా కా కరిష్మా లాంటి సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం 'చట్నీ' అనే షార్ట్ ఫిల్మ్ షూటింగ్ లో బిజీగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement