Tisca Chopra
-
ఆడపిల్లలకు చెబుదాం
9 నుంచి 13 ఏళ్ల వయసులో ఉండే అమ్మాయిలకు ఎన్నో సందేహాలు. తమ శరీర మార్పుల గురించి. వాటికి సమాధానం మనం చెప్పం. వారే తెలుసుకోవాలి. ఆ వయసు తర్వాత వాళ్లు ‘ఆడపిల్లలు’ గా సమాజం నుంచి ప్రత్యేకం కాబడతారు. ఎందుకు అలా? వారిని వారికి తెలియచేద్దాం... వారిని సమాజంలో ఒక భాగం చేద్దాం అంటున్నారు నటి టిస్కా చోప్రా. తొమ్మిదేళ్ల కూతురు ఉన్న టిస్కా బాలికల కోసమే ‘వాట్స్ అప్ విత్ మీ’ పుస్తకం రాసి వెలువరించారు. ‘వాట్స్ అప్ విత్ మీ’ అనేది టిస్కా చోప్రా రాసిన పుస్తకం పేరు. దాని కింద ప్యూబర్టీ, పిరియడ్స్, పింపుల్స్, పీపుల్, ప్రాబ్లమ్స్ అండ్ మోర్ అనే ట్యాగ్‌లైన్. దీనిని బట్టి ఆ పుస్తకం ఏం మాట్లాడుతుందో మనకు అర్థమవుతుంది. 47 ఏళ్ల టిస్కా ‘తారే జమీన్ పర్’ నటిగా దేశానికి తెలుసు. ఆమె చేసిన ‘చట్నీ’ అనే లాంగ్ షార్ట్‌ఫిల్మ్ ఆమెకు విపరీతమైన ఖ్యాతి తెచ్చి పెట్టింది. బాలీవుడ్లో, టెలివిజన్‌లో, నాటక రంగంలో టిస్కా చాలా భిన్నమైన పాత్రలనే చేయడానికి ఇష్టపడుతుంది. అదీగాక ఆమె రచయిత్రి కూడా గతంలో ఆమె ‘యాక్టింగ్ స్మార్ట్: యువర్ టికెట్ టు షోబిజ్’ పుస్తకం రాసింది. ‘వాట్స్ అప్ విత్ మీ’ ఆమె రెండోపుస్తకం. కూతురి కోసం ‘ఇది నాకు వచ్చిన ఆలోచన కాదు. ‘రెడ్ పాండా’ పబ్లికేషన్స్ ఎడిటర్ విధి భార్గవ నా బుర్రలో వేసింది. లాక్డౌన్లో నేను ఇంట్లో ఉండటం కూడా ఈ ఆలోచన పెరగడానికి కారణమైంది. ఇక తొమ్మిదేళ్ల నా కూతురు మరో ముఖ్యకారణం. నా చిన్నప్పుడు పిరియడ్స్ గురించి అడిగితే అదొక అసహ్యకరమైన విషయంగా మా పెద్దలు ఆ విషయాన్ని చర్చించేవారు కాదు. దాని గురించి రకరకాలుగా సమాచారం సేకరించాల్సి వచ్చేది. ఆ సమాచారం కూడా కన్ఫ్యూజన్ని, ఆందోళనని కలిగించేది. నా కూతురును మాత్రం అలా నేను చేయదలుచుకోలేదు. మా ఇంట్లో లైంగిక అవయవాలను సంకేతపదాలతో మాట్లాడము నేను కాని నా భర్త కాని. వాటికి సంకేత పదాలు వాడటం వల్ల వాటి చుట్టూ నిగూఢత ఏర్పడుతుంది. దాని నుంచే సందేహాలు అన్నీ వచ్చేస్తాయి. అమ్మాయిలకు అమ్మాయిల గురించి, అబ్బాయిలకు అబ్బాయిల గురించి ఇద్దరికీ పరస్పరం సమాచారం ఉండాలి. దాని గురించి మనమంతా ఆలోచించాలి. నా పుస్తకం ఒక మేరకు జరిగిన ప్రయత్నంగా భావిస్తాను’ అంటోంది టిస్కా. సరదాగా సమచారం ‘నా పుస్తకంలో సమాచారాన్ని సరదాగా ఉండేలా చూశాను. చాలా బొమ్మలు ఉంటాయి. వాటి ద్వారా ఆడపిల్లలకు తమ శరీరాల్లో జరిగే మార్పులు, తద్వారా వచ్చే ఆందోళనల గురించి తెలుస్తుంది. పిరియడ్స్ గురించి జరిగే షేమింగ్ తెలుస్తుంది. దాని గురించి భయపడేది సిగ్గుపడేదీ ఏమీ లేదని చెబుతాను. అవి వచ్చినప్పుడు ఉపయోగించాల్సిన ప్యాడ్స్ గురించి కప్స్ గురించి సమాచారం ఉంటుంది. అసలు ఆడపిల్లలు ధైర్యంగా మెడికల్ షాప్‌కు వచ్చి ప్యాడ్స్‌ని కొనే, అలాగే మెడికల్ షాప్ వాడు దానిని న్యూస్‌పేపర్ లో చుట్టకుండా ఇచ్చే రోజులు రావాలి. ఆడపిల్లల తండ్రులు తమ కుమార్తెల కోసం శానిటరీ పాడ్ కొనగలగాలి. నా పుస్తకం తండ్రులకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఆడపిల్లల తండ్రులు కూడా తమ కుమార్తెల మనసుల్లో ఏముందో ఏం సందేహాలున్నాయో తెలుసుకుని వారిని తేలిక పరచాలి. మన ఇళ్లల్లో తల్లికి ఈ బాధ్యత అప్పజెబుతారు. తల్లి వాటికి రెస్పాండ్ కావచ్చు కాకపోవచ్చు’ అంటారు టిస్కా. నిపుణుల సహాయంతో... టిస్కా ఈ పుస్తకం టీనేజ్‌ను దాటిన ఒక స్త్రీ అవగాహనతో రాసినా, నిపుణుల సలహాలు కూడా తీసుకుంది. ఢిల్లీకి చెందిన డాక్టర్ మాలా అరోరా (గైనకాలజిస్ట్), కెనడాలో ఉంటున్న మాళవిక వర్మ (సైకాలజిస్ట్) తమ ఇన్పుట్స్ ఇచ్చి బాలికల భౌతిక, మానసిక మార్పులకు సంబంధించి వారికి వచ్చే సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ‘టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలకు సరైన అవగాహన కల్పించడం వల్ల మెన్స్ట్రువల్ హైజీన్ తెలుస్తుంది. లైంగిక అవయవాల ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోగలుగుతారు. టీనేజ్ ప్రెగ్నెన్సీల బారిన పడకుండా ఉంటారు’ అని డాక్టర్ మాలా అరోరా అంటారు. ఏమైనా టిస్కా అరోరా రాసిన ఈ పుస్తకం లాంటి పుస్తకాల అవసరం చాలా ఉంది. తెలుగులో ఇలాంటి పుస్తకాలు ఎన్ని ఉన్నాయి... స్కూల్ పిల్లలకు చదువుకునే విధంగా వారికి ఏ మేరకు అందుతున్నాయన్నది సందేహాస్పదం. మన సెలబ్రిటీలు ఇలాంటి ఆలోచనలు చేస్తే వారి స్టేటస్ వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ పుస్తకాలను చేరవేయవచ్చు. సమాజంలో జరుగుతున్న దుష్పరిమాణాలు చూసినప్పుడు బాలికల శారీరక, లైంగిక చైతన్యం గురించి ఎంతో పని సాగాలని తెలుస్తోంది. ఆ పని టిస్కా చేసినందుకు ఆమెకు తప్పకుండా అభినందనలు తెలిపి తీరాల్సిందే. – సాక్షి ఫ్యామిలీ -
ఘనంగా పరూల్ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవం
-
ఏడాది వరకు థియేటర్లకు ఎవరూ వెళ్లరు
మొబైల్ ఫోన్ ఉంటే అరచేతిలో ప్రపంచం అని ఊరికే అనలేదు. కరోనా వైరస్ వల్ల విధించిన లాక్డౌన్ సెల్‌ఫోన్‌కు మరింత అతుక్కుపోయేలా చేసింది. ఇంట్లో బోర్ కొట్టకుండా ఉండేందుకు సీరియళ్లు, కాదంటే వెబ్ సిరీస్, ముఖ్యంగా సినిమాలు.. ఇలా అన్నింటినీ కూర్చున్నదగ్గరే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వీటన్నింటికి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వేదికగా నిలుస్తున్నాయి. కొత్త సరుకు, కొంగొత్త ఆలోచనలతో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, వూట్ వంటి ఎన్నో యాప్స్ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. పైగా ఒక్క సినిమా టికెట్ కొనే రేటుకే ఎన్నో సినిమాలను ఎంచక్కా చూసేయచ్చు. దీంతో అందరూ ఈ ఓటీటీ యాప్స్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. దీని గురించి నటి టిస్కా చోప్రా మాట్లాడుతూ.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ప్రస్తుతం మంచిరోజులు నడుస్తున్నాయని తెలిపింది. లాక్డౌన్ ముగిసాక కూడా ప్రజలు అంత సులువుగా థియేటర్‌కు రాలేరేమోనని సందేహం వ్యక్తం చేసింది. (కరోనా నేర్పుతున్న కొత్త పాఠం) "ఇప్పటికే చాలా సరుకంతా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు వెళుతున్నాయి. రానున్న కాలంలో చిన్న, మధ్య తరహా సినిమాలు కూడా వీటినే ఎంచుకుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ బయట కలిసి తిరగడానికి భయపడతారు. దీనివల్ల థియేటర్లకు గడ్డు పరిస్థితులు ఎదురు కానున్నాయి. 500 మందితో కలిసి తలుపులు మూసిన గదిలో నేను కూడా ఉండాలనుకోను. ఎందుకంటే అప్పుడు వైరస్ వ్యాప్తి చెందడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. పైగా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇంకా వ్యాక్సిన్ కనుగోనందున ఎవరూ థియేటర్‌కు రావడానికి ఇష్టపడరు. సుమారు ఓ ఏడాదిపాటు జనాల్లో ఇదే అభిప్రాయం కొనసాగవచ్చు. దీంతో పెద్ద సినిమాలు మరో ఆరునెలలు, లేదా ఓ సంవత్సరం వరకు ఆలస్యంగా విడుదలయ్యే అవకాశం ఉంద"ని ఆమె అభిప్రాయపడింది. కాగా ప్రస్తుతం టిస్కా చోప్రా అనేక వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. (అమ్మ అంత మాట ఎందుకు అన్నట్లు..?) -
మీతో పెళ్లికి రెడీ.. మా ఆయన కూడా..
ముంబై: బాలీవుడ్ అందాలతార టిస్కా చోప్రాకు ఓ వింత అనుభవం ఎదురైంది. ఓ అభిమాని నుంచి ఆమెకు ఊహించని ప్రతిపాదన వచ్చింది. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరుతూ ట్విట్టర్లో అతగాడు టిస్కాకు ప్రపోజ్ చేశాడు. కాగా 42 ఏళ్ల టిస్కాకు పెళ్లి అయ్యింది. ఆమె సంజయ్ చోప్రాను వివాహం చేసుకుంది. ఆయన ఎయిరిండియాలో పైలట్. వీరిద్దరికీ ఓ పాప ఉంది. పాపం అభిమానికి ఈ విషయాలు తెలియవో లేక తెలిసి కూడా పెళ్లి ప్రపోజల్ చేశాడో కానీ.. టిస్కా మాత్రం సీరియస్ కాకుండా కొంటెగా సమాధానం ఇచ్చింది. 'మాట్లాడాలని ఎదురు చూస్తున్నందుకు ధన్యవాదాలు. మీ ప్రపోజల్‌కు నేను రెడీ. దయచేసి మీ వివరాలన్ని నాకు పంపండి. నేను ఎవరి కోసం వెళతానో అతన్ని చూడాలని నా భర్త కూడా కోరుకుంటున్నాడు' అంటూ టిస్కా సమాధానం ఇచ్చింది. టిస్కా దెబ్బకు అభిమాని సైలెంట్ అయిపోయాడు. -
నటికి సోషల్ మీడియాలో మ్యారేజ్ ప్రపోజల్!
ముంబై: సెలబ్రిటీలను పెళ్లిచేసుకునేందుకు చాలామంది సిద్ధంగా ఉంటారు. అప్పుడప్పుడు కొందరు యువతులు తమ అభిమాన హీరో ఇంటి ఎదుట బైఠాయించి.. పెళ్లి చేసుకోవాలని గొడవ చేస్తుండటం మన గమనిస్తుంటాం. ఇక్కడ మాత్రం రొటీన్ కు భిన్నంగా ఓ యువకుడు తన అభిమాన నటిని పెళ్లి చేసుకుంటావా అని సోషల్ మీడియాలో అడిగాడు. ఆ వివరాలిలా ఉన్నాయి. బాలీవుడ్ నటి టిస్కా చోప్రాకు ఓ వ్యక్తి సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ ద్వారా మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చాడు. ఇందుకు టిస్కా చోప్రా కూడా స్పందిస్తూ.. ఆ అభిమానికి షాక్ ఇచ్చింది. మొదటగా పెళ్లి ప్రతిపాదనకు థ్యాంక్స్ చెప్పిన టిస్కా.. పూర్తి వివరాలు పంపించాలని అభిమానికి ఓ ట్వీట్ చేసింది. తన భర్తను ఈ పెళ్లి గురించి పర్మిషన్ తీసుకోవాలని, ఏ వ్యక్తి తనతో జీవితాన్ని కోరుకుంటున్నారో ఆయనకు తెలియాలి కదా అని చమత్కరించింది. టిస్కా నుంచి ఇలాంటి రిప్లై ఊహించని ఆ వ్యక్తి కంగుతిని ఉంటాడు. తారే జమీన్ పర్, కిస్సా, రహస్య మూవీలతో వెండితెరపై తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న టిస్కా పలు టీవీ షోలతో పాటు కహానీ ఘర్ ఘర్ కీ, కరిష్మా కా కరిష్మా లాంటి సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం 'చట్నీ' అనే షార్ట్ ఫిల్మ్ షూటింగ్ లో బిజీగా ఉంది.