మొబైల్ ఫోన్ ఉంటే అరచేతిలో ప్రపంచం అని ఊరికే అనలేదు. కరోనా వైరస్ వల్ల విధించిన లాక్‌డౌన్ సెల్‌ఫోన్‌కు మరింత అతుక్కుపోయేలా చేసింది. ఇంట్లో బోర్ కొట్టకుండా ఉండేందుకు సీరియళ్లు, కాదంటే వెబ్ సిరీస్, ముఖ్యంగా సినిమాలు.. ఇలా అన్నింటినీ కూర్చున్నదగ్గరే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వీటన్నింటికి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వేదికగా నిలుస్తున్నాయి. కొత్త సరుకు, కొంగొత్త ఆలోచనలతో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, వూట్ వంటి ఎన్నో యాప్స్ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. పైగా ఒక్క సినిమా టికెట్ కొనే రేటుకే ఎన్నో సినిమాలను ఎంచక్కా చూసేయచ్చు. దీంతో అందరూ ఈ ఓటీటీ యాప్స్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. దీని గురించి నటి టిస్కా చోప్రా మాట్లాడుతూ.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ప్రస్తుతం మంచిరోజులు నడుస్తున్నాయని తెలిపింది. లాక్‌డౌన్ ముగిసాక కూడా ప్రజలు అంత సులువుగా థియేటర్‌కు రాలేరేమోనని సందేహం వ్యక్తం చేసింది. (కరోనా నేర్పుతున్న కొత్త పాఠం)
"ఇప్పటికే చాలా సరుకంతా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు వెళుతున్నాయి. రానున్న కాలంలో చిన్న, మధ్య తరహా సినిమాలు కూడా వీటినే ఎంచుకుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ బయట కలిసి తిరగడానికి భయపడతారు. దీనివల్ల థియేటర్లకు గడ్డు పరిస్థితులు ఎదురు కానున్నాయి. 500 మందితో కలిసి తలుపులు మూసిన గదిలో నేను కూడా ఉండాలనుకోను. ఎందుకంటే అప్పుడు వైరస్ వ్యాప్తి చెందడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. పైగా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇంకా వ్యాక్సిన్ కనుగోనందున ఎవరూ థియేటర్‌కు రావడానికి ఇష్టపడరు. సుమారు ఓ ఏడాదిపాటు జనాల్లో ఇదే అభిప్రాయం కొనసాగవచ్చు. దీంతో పెద్ద సినిమాలు మరో ఆరునెలలు, లేదా ఓ సంవత్సరం వరకు ఆలస్యంగా విడుదలయ్యే అవకాశం ఉంద"ని ఆమె అభిప్రాయపడింది. కాగా ప్రస్తుతం టిస్కా చోప్రా అనేక వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. (అమ్మ అంత మాట ఎందుకు అన్నట్లు..?)
Comments
Please login to add a commentAdd a comment